AP LAWCET Counselling 2024 : ఏపీ లాసెట్ ప్రవేశాలు - కౌన్సెలింగ్ ఎప్పుడంటే....?-ap lawcet counseling is likely to be held in the month of october 2024 latest updates check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Lawcet Counselling 2024 : ఏపీ లాసెట్ ప్రవేశాలు - కౌన్సెలింగ్ ఎప్పుడంటే....?

AP LAWCET Counselling 2024 : ఏపీ లాసెట్ ప్రవేశాలు - కౌన్సెలింగ్ ఎప్పుడంటే....?

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 28, 2024 02:04 PM IST

AP LAWCET Counselling 2024: ఆంధ్రప్రదేశ్ లాసెట్ ప్రవేశాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. జూన్ లో ఎంట్రెన్స్ ఫలితాలను ప్రకటించారు. కానీ ఇంకా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కాలేదు. అక్టోబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ 2024
ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ 2024

AP LAWCET Counselling Schedule 2024 : రాష్ట్రంలో న్యాయ కళాశాలాల్లో ప్రవేశాలకు సంబంధించి లాసెట్ 2024 నిర్వహించిన సంగతి తెలిసిందే. జూన్ 27వ తేదీనే ఇందుకు సంబంధించిన ఫలితాలు కూడా విడుదలయ్యాయి. కానీ ఇప్పటివరకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఎంట్రెన్స్ రాసిన అభ్యర్థులు... లాసెట్ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు తెలంగాణలో చూస్తే లాసెట్ ప్రవేశాల ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ప్రస్తుతం ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ నడుస్తోంది.

కౌన్సెలింగ్ ఎప్పుడు...?

గతేడాది చూస్తే ఏపీలో లాసెట్ కౌన్సెలింగ్ నవంబర్ మాసంలో ప్రారంభమైంది. కానీ ఈసారి అక్టోబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏపీ లాసెట్‌ను 19,224 మంది అభ్యర్థులు రాశారు. అందులో 17,117 మంది (89.04 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో రెండేళ్ల పీజీ కోర్స్ లో 99.51 శాతం, మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్స్ లో 89.74 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్స్ లో 80.06 శాతం ఉతీర్ణత సాధించారు. ఎంట్రెన్స్ లో పాస్ అయిన వారితో పాటు మేనేజ్ మెంట్ కోటాలో చేరాలనుకునే చాలా మంది అభ్యర్థులు... కౌన్సెలింగ్ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు.

లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించాలంటే ఆయా కాలేజీలకు బార్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇంకా కొన్నికాలేజీల అనుమతుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి అవుతోందని తెలుస్తోంది. ఇదే జరిగితే అక్టోబర్ తొలి వారంలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

లాసెట్ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి…

  • -అభ్యర్థులు మొదటగా https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • -Download Rank Card అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • -Registration Number , Hall Ticket Number, పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.
  • -గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • -ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
  • -అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంత కీలకం.

ఈసారి విడుదలైన ఫలితాలను చూస్తే… రెండేళ్ల పీజీ కోర్సులో(LLM) పురుషులు 99.51 శాతం, స్త్రీలు 99.51 శాతం ఉత్తీర్ణత సాధించారు. మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో పురుషులు 91.28 శాతం, స్త్రీలు 86.26 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో పురుషులు 81.91 శాతం, స్త్రీలు 78.17 శాతం ఉత్తీర్ణత సాధించారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం