TG Inter Admissions 2024 : అలర్ట్... ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే..?-telangana intermediate extends inter first year admission date till october 15 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Inter Admissions 2024 : అలర్ట్... ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే..?

TG Inter Admissions 2024 : అలర్ట్... ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 29, 2024 09:46 AM IST

Telangana Intermediate Board Updates : ఇంటర్ అడ్మిషన్లపై తెలంగాణ ఇంటర్ బోర్డు మరోసారి కీలక అప్జేట్ ఇచ్చింది. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్15వ తేదీని తుది గడువుగా పేర్కొంది. ఇంకా కాలేజీల్లో చేరని విద్యార్థులు వెంటనే చేరాలని అధికారులు సూచించారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్మిషన్లు 2024
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్మిషన్లు 2024

ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ఇంటర్ బోర్డు. జూనియర్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశ గడువును పొడిగించింది. అక్టోబర్ 15 తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది.

ఈ ఏడాది ప్రవేశాలకు సంబంధించి ఇదే చివరి అవకాశమని ఇంటర్ బోర్డు  స్పష్టం చేసింది. ఇంకా అడ్మిషన్లు తీసుకొని విద్యార్థులు ఏవరైనా ఉంటే వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లో మాత్రమే చేరాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను ఇంటర్ బోర్డు సైట్ లో ఉంచినట్లు తెలిపింది. వాటిని చెక్ చూసుకున్న తర్వాతే… అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది.

షెడ్యూల్ నిర్ణయించిన ప్రకారం… ఇంటర్ ఫస్టియర్ తరగతులు జూన్ 01 నుంచే ప్రారంభమయ్యాయి. పాఠశాల అధికారులు జారీ చేసిన పాస్ సర్టిఫికేట్, ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, తాత్కాలిక టెన్త్ మార్కుల మెమో ఆధారంగా ప్రిన్సిపాల్స్ ఇంటర్ ప్రవేశాలను పొందవచ్చు. ఒరిజినల్ ఎస్ఎస్సీ సర్టిఫికెట్ సమర్పించిన తర్వాత అడ్మిషన్ ను నిర్థారిస్తారు.

ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్ - వివరాలు

ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నవంబర్ 18 నుంచి 23 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు జరగనున్నాయి. సంక్రాంతి సెలవులను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 16 వరకు ప్రకటించారు. సంక్రాంతి అనంతరం జనవరి 17, 2025న ఇంటర్ కాలేజీలు రీఓపెన్ చేస్తారు. 2025 జనవరి 20 నుంచి 25 వరకు ఇంటర్ ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

  • ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు - ఫిబ్రవరి మెదటి వారం, 2025
  • ఇంటర్ వార్షిక పరీక్షలు - మార్చి మొదటి వారం, 2025
  • 2024-25 అకాడమిక్ క్యాలెండర్ చివరి పనిదినం- మార్చి 29, 2025
  • వేసవి సెలవులు- మార్చి 30, 2025 నుంచి జూన్ 1, 2025 వరకు
  • అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు - మే చివరి వారం, 2025
  • 2025-26 విద్యాసంవత్సంలో ఇంటర్ కాలేజీల రీఓపెన్ -జూన్ 2, 2025
  • ఈ విద్యా సంవత్సరంలో కనీసం 220 రోజుల పాటు ఇంటర్ కాలేజీలు పనిచేయనున్నాయి. 75 రోజుల పాటు సెలవులు రానున్నాయి.