తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live September 25, 2024: Govt Employees Transfers: మ‌ళ్లీ ఆగిన బ‌దిలీల ప్రక్రియ‌, అక్టోబర్ 2 వరకు ఆ ఉద్యోగులను రిలీవ్ చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు
Govt Employees Transfers: మ‌ళ్లీ ఆగిన బ‌దిలీల ప్రక్రియ‌, అక్టోబర్ 2 వరకు ఆ ఉద్యోగులను రిలీవ్ చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు
Govt Employees Transfers: మ‌ళ్లీ ఆగిన బ‌దిలీల ప్రక్రియ‌, అక్టోబర్ 2 వరకు ఆ ఉద్యోగులను రిలీవ్ చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు

Andhra Pradesh News Live September 25, 2024: Govt Employees Transfers: మ‌ళ్లీ ఆగిన బ‌దిలీల ప్రక్రియ‌, అక్టోబర్ 2 వరకు ఆ ఉద్యోగులను రిలీవ్ చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు

25 September 2024, 22:36 IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

25 September 2024, 22:36 IST

Andhra Pradesh News Live: Govt Employees Transfers: మ‌ళ్లీ ఆగిన బ‌దిలీల ప్రక్రియ‌, అక్టోబర్ 2 వరకు ఆ ఉద్యోగులను రిలీవ్ చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు

  • Govt Employees Transfers : జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోల బదిలీల ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. పలు ప్రభుత్వ కార్యక్రమాల దృష్ట్యా అక్టోబర్ 2 వరకు బదిలీ అయిన ఉద్యోగులను రిలీవ్ చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు బదిలీలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
పూర్తి స్టోరీ చదవండి

25 September 2024, 22:08 IST

Andhra Pradesh News Live: AP IPS Transfers : ఏపీలో 16 మంది ఐపీఎస్ లు బదిలీ, సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్

  • AP IPS Transfers : ఏపీలో 16 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ ను ఏపీ సర్కార్ నియమించింది.
పూర్తి స్టోరీ చదవండి

25 September 2024, 18:54 IST

Andhra Pradesh News Live: Vedurupaka Vijaya Durga Peetham : వెదురుపాక విజయదుర్గా పీఠంలో అక్టోబర్ 3 నుంచి 12 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు

  • Vedurupaka Vijaya Durga Peetham : తూర్పుగోదావరి జిల్లా వెదురుపాక విజయదుర్గా పీఠంలో అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలు జ‌రిగే తొమ్మిది రోజులు వేలాది మంది భ‌క్తులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

25 September 2024, 17:49 IST

Andhra Pradesh News Live: Leopard In Rajahmundry : కడియం పరిసరాల్లో చిరుత సంచారం, తీవ్ర భయాందోళనలో ప్రజలు

  • Leopard Movement In Rajahmundry : గత 20 రోజులుగా రాజమంత్రి పరిసరాల్లో తిష్ఠవేసిన చిరుత...తాజాగా కడియం మండలంలోని నర్సరీలో కనిపించింది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తు్న్నారు. చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు.
పూర్తి స్టోరీ చదవండి

25 September 2024, 17:11 IST

Andhra Pradesh News Live: AP KGBV Recruitment 2024 : కేజీబీవీల్లో 604 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ - దరఖాస్తులకు అక్టోబ‌ర్ 10 ఆఖ‌రు తేదీ

  • ఏపీ క‌స్తూర్బా గాంధీ బాలిక విద్యాల‌యాల్లో  ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ జారీ అయింది. మొత్తం 604 ఖాళీలను భర్తీ చేస్తారు. ఆన్ లైన్ దరఖాస్తులకు అక్టోబ‌ర్ 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు https://apkgbv.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి.
పూర్తి స్టోరీ చదవండి

25 September 2024, 17:03 IST

Andhra Pradesh News Live: HDFC Scholarship 2024 : ఒకటో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు- హెచ్డీఎఫ్సీ స్కాలర్ షిప్ లు, ఇలా అప్లై చేసుకోండి

  • HDFC Parivartan Scholarship 2024 : ఒకటో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ముందుకొచ్చింది. హెచ్డీఎఫ్సీ పరివర్తన్ ప్రోగ్రామ్ పేరిట స్కాలర్ షిప్ లకు దరఖాస్తులు ఆహ్వానించింది. విద్యార్థులకు రూ.75 వేల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

25 September 2024, 16:01 IST

Andhra Pradesh News Live: Devara Ticket Rates : రిలీజ్ కు ముందు దేవరకు షాక్, టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

  • Devara Ticket Rates : రిలీజ్ కు ముందు దేవర టీమ్ కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై కీలక తీర్పు ఇచ్చింది. రెండు వారాల ధరల పెంపును 10 రోజులకు పరిమితం చేస్తూ తీర్పు ఇచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

25 September 2024, 15:19 IST

Andhra Pradesh News Live: Anantapur Chariot Burned : రాములోరి రథానికి నిప్పు పెట్టిన ఘటన, వైసీపీ నేత అరెస్ట్- చందాలు వసూలు చేయలేదని!

  • Anantapur Chariot Burned : అనంతపురం జిల్లాలో రాములోరి రథానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత ఈశ్వర్ రెడ్డి ఈ నేరానికి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. రథం తయారీకి చందాలు వసూలు చేయలేదని ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

25 September 2024, 15:18 IST

Andhra Pradesh News Live: Tirumala Laddu : 'అబద్ధాలతో తిరుమల విశిష్టతను అపవిత్రం చేశారు' - ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చిన జగన్

  • తిరుమల శ్రీవారి విశిష్టతను దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు వ్యవహారించారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. చంద్రబాబు చేసిన తప్పును ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో సెప్టెంబరు 28న పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

25 September 2024, 14:19 IST

Andhra Pradesh News Live: CRDA Jobs: ఏపీ సిఆర్‌డిఏలో కాంట్రాక్ట్, డిప్యూటేషన్‌ కొలువులు, దరఖాస్తు చేయండి ఇలా..

  • CRDA Jobs: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాధికార సంస్థ సిఆర్‌డిఏను బలోపేతం చేసే క్రమంలో పలు పోస్టులను కాంట్రాక్టు, డిప్యూటేషన్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి డిప్యూటేషన్‌పై కూడా ఉద్యోగుల్ని సిఆర్‌‌డిఏలో  చేర్చుకోనున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

25 September 2024, 13:35 IST

Andhra Pradesh News Live: LIC Jeevan Labh : ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ, ఒకేసారి చేతికి రూ.కోటికి పైగా- రోజుకు ఎంత పొదుపు చేయాలంటే?

  • LIC Jeevan Labh : ఎల్ఐసీ జీవిత బీమాతో పాటు మెచ్యూరిటీ బెనిఫిట్ పొందేలా జీవన్ లాభ్ ప్లాన్ అందిస్తుంది. పాలసీదారుడికి మెచ్యూరిటీ బెనిఫిట్ తో పాటు అకాల మరణం సంభవిస్తే...నామినీకి ప్రయోజనం కలిగేలా ఈ పాలసీ ఉపయోగపడుతుంది. పాలసీపై లోన్ సదుపాయం కూడా పొందవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

25 September 2024, 13:28 IST

Andhra Pradesh News Live: Akshayapatra Donations: సర్కారీ స్కూల్ విద్యార్థుల చిత్రాలతో విరాళాల సేకరణ, చర్యలు తీసుకుంటామన్న ఏపీ ప్రభుత్వం

  • Akshayapatra Donations: ఏపీ ప్ర‎భుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల చిత్రాలతో మధ్యాహ్న భోజనానికి విరాళాలు సేకరించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిధులతో మధ్యాహ్న భోజనం పథకం అమలవుతుండగా, విరాళాల వసూలు వ్యవహారంపై చర్యలు తీసుకుంటామని ఏపీ పాఠశాల విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
పూర్తి స్టోరీ చదవండి

25 September 2024, 12:47 IST

Andhra Pradesh News Live: CM Chandrababu: సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.400కోట్ల విరాళాలు..30లోగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానన్న చంద్రబాబు

  • CM Chandrababu: విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్‌లో పరిహారం విడుదల చేశారు. బాధితుల్ని ఆదుకోవాలని ఇచ్చిన పిలుపుతో ఏకంగా రూ.400కోట్ల రుపాయల విరాళాలు వచ్చాయని  చివరి బాధితుడి వరకు న్యాయం చేస్తామని, మిగిలిన దరఖాస్తుల్ని 30లోగా పరిష్కరించాలన్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

25 September 2024, 11:30 IST

Andhra Pradesh News Live: AP Universities: ఏపీ వర్శిటీల్లో ఉద్యోగ నియామకాలకు కొత్త నోటిఫికేషన్, అన్ని యూనివర్శిటీలు కొత్త చట్టం పరిధిలోకి…

  • AP Universities: ఆంధ్రప్రదేశ్‌ యూనివర‌్శిటీల్లో అధ్యాపకుల నియామకాలకు కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు.  వివాదాలకు తావు లేకుండా రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలను ఒకే చట్టం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. 
పూర్తి స్టోరీ చదవండి

25 September 2024, 11:21 IST

Andhra Pradesh News Live: Free Certificates: వరద ముంపు బాధితులకు ఉచితంగా సర్టిఫికెట్లు జారీ చేయనున్న ఏపీ ప్రభుత్వం

  • Free Certificates: విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరదల్లో లక్షలాది మంది ప్రజలు ముంపుకు గురయ్యారు. చాలామంది కట్టుబట్టలతో మిగిలారు. విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు పనికిరాకుండా పోయాయి.  సర్వం కోల్పోయిన బాధితుల్ని ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం  ఉచితంగా 
పూర్తి స్టోరీ చదవండి

25 September 2024, 10:52 IST

Andhra Pradesh News Live: TDP Nominated Posts: నామినేటెడ్ పోస్టుల్లో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట,పార్టీ కేడర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు ప్రాధాన్యత

  • TDP Nominated Posts: ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో టిడిపి అధిష్టానం అసలు సిసలైన కార్యకర్తలకు అగ్ర తాంబూలం ఇచ్చింది. తొలివిడతగా ప్రకటించిన 99 మందితో నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ లకు పెద్ద పీట వేసింది. 
పూర్తి స్టోరీ చదవండి

25 September 2024, 10:35 IST

Andhra Pradesh News Live: BRAU Recruitment 2024 : శ్రీకాకుళం అంబేడ్కర్ యూనివ‌ర్శిటీలో ఫ్యాక‌ల్టీ పోస్టులు - కేవలం ఇంటర్వ్యూనే..!

  • ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి శ్రీకాకుళంలోని అంబేడ్కర్ యూనివ‌ర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. కేవ‌లం ఇంట‌ర్వ్యూల ద్వారానే వీటిని భర్తీ చేయనున్నారు. సెప్టెంబ‌ర్ 30వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు ఇంట‌ర్వ్యూలు జరుగుతాయి. మొత్తం 22 ఖాళీలు ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

25 September 2024, 9:57 IST

Andhra Pradesh News Live: APPSC Posting Cancellation: తప్పుడు ధృవపత్రాలతో డిఎస్పీ పోస్టింగ్.. స్పోర్ట్స్ కోటా డిఎస్పీ నియామకం రద్దు..

  • APPSC Posting Cancellation: ఏపీపీఎస్పీ ద్వారా 2018 గ్రూప్‌1 నియామకాల్లో ఎంపికైన ఓ డిఎస్పీ నియామకాన్ని ఏపీపీఎస్సీ ఉపసంహరించుకుంది.  సివిల్ డిఎస్పీగా ఎంపికైన దాస్యం దనుర్బా సమర్పించిన ధృవపత్రాలపై సందేహాలు వ్యక్తం కావడంతో  విచారణ జరిపి ఏపీపీఎస్పీ ఆమె పోస్టింగ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 
పూర్తి స్టోరీ చదవండి

25 September 2024, 6:08 IST

Andhra Pradesh News Live: Flood Compensation: నేడు వరద బాధితులకు పరిహారం..ముంపు బాధితుల ఖాతాలకు చెల్లింపు

  • Flood Compensation: ఇటీవలి వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు  రాష్ట్రప్రభుత్వం నేడు పరిహారం చెల్లించనుంది. విజయవాడలో బుడమేరు ముంపు, కృష్ణానదిలో ముంపుకు గురైన లక్షలాదిమంది ప్రజలకు వరద పరిహారం చెల్లించనున్నారు. ముఖ‌్యమంత్రి చంద్రబాబు నేడు నష్టపరిహారం చెక్కులు విడుదల చేస్తారు. 
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి