LIC Jeevan Labh : ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ, ఒకేసారి చేతికి రూ.కోటికి పైగా- రోజుకు ఎంత పొదుపు చేయాలంటే?-lic jeevan labh policy features maturity benefits life insurance death benefits ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Lic Jeevan Labh : ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ, ఒకేసారి చేతికి రూ.కోటికి పైగా- రోజుకు ఎంత పొదుపు చేయాలంటే?

LIC Jeevan Labh : ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ, ఒకేసారి చేతికి రూ.కోటికి పైగా- రోజుకు ఎంత పొదుపు చేయాలంటే?

Bandaru Satyaprasad HT Telugu
Sep 25, 2024 01:41 PM IST

LIC Jeevan Labh : ఎల్ఐసీ జీవిత బీమాతో పాటు మెచ్యూరిటీ బెనిఫిట్ పొందేలా జీవన్ లాభ్ ప్లాన్ అందిస్తుంది. పాలసీదారుడికి మెచ్యూరిటీ బెనిఫిట్ తో పాటు అకాల మరణం సంభవిస్తే...నామినీకి ప్రయోజనం కలిగేలా ఈ పాలసీ ఉపయోగపడుతుంది. పాలసీపై లోన్ సదుపాయం కూడా పొందవచ్చు.

ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ, ఒకేసారి చేతికి రూ.కోటికి పైగా- రోజుకు ఎంత పొదుపు చేయాలంటే?
ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ, ఒకేసారి చేతికి రూ.కోటికి పైగా- రోజుకు ఎంత పొదుపు చేయాలంటే?

LIC Jeevan Labh : జీవిత బీమాతో పాటు పొదుపుపై రాబడికి ఎల్ఐసీ జీవన్ లాభ్ ప్లాన్ మంచి ఎంపిక. ఇది పరిమిత ప్రీమియం చెల్లించే ఎండోమెంట్ ప్లాన్. సాధారణంగా ఈ ప్లాన్ పాలసీ వ్యవధిలో పాలసీదారుడికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. పాలసీ వ్యవధి ముగిస్తే ఒకేసారి మొత్తం చెల్లింపు చేస్తారు. ఎల్ఐసీ జీవన్ లాభ్ బీమా పథకం పాలసీదారునికి జీవిత బీమా రక్షణను అందించడమే కాకుండా మెచ్యూరిటీ తర్వాత అధిక రాబడి ప్రయోజనం అందిస్తుంది.

ఈ పాలసీలో చేరేందుకు కనీస ప్రవేశ వయస్సు 8 సంవత్సరాలు కాగా, గరిష్ట వయస్సు ప్రీమియం చెల్లింపు వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. 16 సంవత్సరాల పాలసీ కాలానికి 59 సంవత్సరాలు, 21 సంవత్సరాల పాలసీ కాలానికి 54 సంవత్సరాలు, 25 సంవత్సరాల పాలసీ కాలానికి 50 సంవత్సరాలు గరిష్ట వయస్సు ఉంటుంది. ప్లాన్ మెచ్యూరిటీకి గరిష్ట వయస్సు 75 ఏళ్లు. ప్రీమియం చెల్లింపు వ్యవధి 10, 15, 16 సంవత్సరాలు ఉంటుంది.

పాలసీ టర్మ్

  • 16 సంవత్సరాలు (10 ఏళ్ల ప్రీమియం )
  • 21 సంవత్సరాలు (15 ఏళ్ల ప్రీమియం)
  • 25 సంవత్సరాలు (16 ఏళ్ల ప్రీమియం)

జీవన్ లాభ్ పాలసీ మొత్తం కనిష్టంగా రూ.2 లక్షలు, గరిష్ట పరిమితి లేదు. ఈ పాలసీలో మెచ్యూరిటీ బెనిఫిట్, డెత్ బెనిఫిట్, సింపుల్ రివర్షనరీ బోనస్, ఫైనల్ బోనస్ ఉంటాయి.

ఎల్ఐసీ జీవన్ లాభ్ ప్రయోజనాలు

  • మెచ్యూరిటీ బెనిఫిట్ - పాలసీ మెచ్యూరిటీని పాలసీదారుడు ఒకసారి పెద్ద మొత్తంలో పొందవచ్చు. ఇందులో బేసిక్ సమ్ అష్యూర్డ్, అదనపు బోనస్ లు ఉంటాయి.
  • డెత్ బెనిఫిట్ - డెత్ బెనిఫిట్ కూడా ఉంటుంది. పాలసీదారుడి మరణానంతరం 'సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్' తో పాటు సింపుల్ రివర్షనరీ బోనస్‌, అదనపు బోనస్ ఒకేసారి చెల్లిస్తారు. మరణం సంభవిస్తే మొత్తం వార్షిక ప్రీమియానికి పది రెట్లు లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్‌ ఏది అధికంగా ఉంటే అది చెల్లిస్తారు. మరణించిన తేదీ నాటికి చెల్లించిన ప్రీమియం మొత్తంలో 105% తక్కువ కాకుండా నామినీకి చెల్లిస్తారు.
  • ప్రాఫిట్ పార్టిసిపేషన్ - ఈ పాలసీ పూర్తికాలం ప్రీమియం చెల్లిస్తే కంపెనీ ప్రకటించిన విధంగా సింపుల్ రివర్షనరీ బోనస్‌లను పొందేందుకు పాలసీదారులు అర్హులు. మెచ్యూరిటీ లేదా డెత్ క్లెయిమ్ ఫైల్ చేయబడినప్పుడు అదనపు బోనస్ వస్తుంది.
  • పన్ను ప్రయోజనాలు - ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ల ప్రకారం పన్ను ప్రయోజనాలు ఉంటాయి.
  • లోన్ - ఈ పాలసీపై నిబంధనలు అనుసరించి పాలసీదారుడు రుణాలు పొందవచ్చు.
  • రిబేట్ - ప్రీమియం ఫ్రీక్వెన్సీ పరంగా...ఏడాది ప్రీమియంలో 2%, హాఫ్ ఇయర్లీ ప్రీమియం చెల్లింపుల్లో 1% రాయితీ ఉంటుంది. రూ.2 లక్షల నుంచి రూ.4.9 లక్షల సమ్ అష్యూర్డ్‌లో 1.25%, రూ.10 లక్షల నుంచి రూ.14.9 లక్షల వరకు 1.50%, రూ.15 లక్షలు అంతకంటే ఎక్కువ ఉన్నవారు 1.75% రిబేట్ పొందుతారు.
  • సరెండర్ విలువ - ఈ జీవిత బీమా పాలసీలో కనీసం మూడు సంవత్సరాలు వరుసగా ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా సరెండర్ చేయవచ్చు. గ్యారెంటీడ్ సరెండర్ వాల్యూ మొత్తం ప్రీమియం ఆధారంగా ఉంటుంది.

జీవన్ లాభ్ పాలసీకి ఉదాహరణ

ఓ వ్యక్తి ఎల్ఐసీ జీవన్ లాభ్ ప్లాన్‌ను 25 సంవత్సరాలకు 16 ఏళ్ల ప్రీమియం చెల్లింపుతో వార్షిక ప్రీమియం విధానంలో రూ.2 లక్షల హామీ మొత్తాన్ని ఎంచుకున్నారు. అతని వయస్సు 35 సంవత్సరాలు, వార్షిక ప్రీమియం సుమారు రూ.9,980(మొదటి ప్రీయమం) చెల్లిస్తున్నారు. 25 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీపై అతను రూ.2.35 లక్షలు బోనస్ తో కలిపి రూ.5.25 లక్షలు అందుకుంటాడు. 22వ పాలసీ సంవత్సరంలో అతను దురదృష్టవశాత్తూ మరణిస్తే నామినీలు రూ.4.6 లక్షలు వరకు ప్రయోజనంగా అందుకుంటారు. వడ్డీ రేట్లు ఎల్ఐసీ విధానాలకు లోబడి ఉంటాయి.

కోటి రూపాయిలు రావాలంటే?

ఓ వ్యక్తి ఎల్ఐసీ జీవన్ లాభ్ ప్లాన్‌ను 25 సంవత్సరాలకు 16 ఏళ్ల ప్రీమియం చెల్లింపుతో వార్షిక ప్రీమియం విధానంలో రూ.50 లక్షల సబ్ అష్యూర్డ్ ఎంచుకున్నారు. అతని వయస్సు 33 సంవత్సరాలు, వార్షిక ప్రీమియం సుమారు రూ.2,38,312(మొదటి ప్రీయమం) చెల్లించాలి. రోజుకు సుమారు రూ.650 పొదుపు చేయాల్సి ఉంది. 25 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీపై అతడు సుమారు రూ.1.31 కోటి పొందే అవకాశం ఉంది.

సంబంధిత కథనం