LIC Jeevan Utsav Plan : ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ ప్లాన్, ఏటా రూ. 1 లక్ష 100 ఏళ్ల వరకు ఆదాయం
LIC Jeevan Utsav Plan : పరిమిత కాలం ప్రీమియం చెల్లించి 100 ఏళ్ల వరకు బీమా పొందేందుకు ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ ప్లాన్ అందిస్తుంది. నిర్ణీత కాలంపాటు ప్రీమియం చెల్లించి, ఆ తర్వాత కొంత లాక్ ఇన్ పీరియడ్ తర్వాత పాలసీదారుడికి తిరిగి చెల్లింపు ప్రారంభం అవుతుంది. పాలసీ మొత్తంలో ఏటా 10 శాతం జీవితాంతం చెల్లిస్తారు.
LIC Jeevan Utsav Plan : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వ్యక్తిగత పొదుపు, జీవిత బీమాతో ఒక ప్లాన్ ను అందిస్తుంది. నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ 'ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్' ప్లాన్ ద్వారా జీవితకాలం పాటు బీమా కవరేజీని అందిస్తుంది. పరిమిత కాలం పాటు ప్రీమియం చెల్లిస్తారు, ఆ తర్వాత కొంత కాలం లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అనంతరం ప్రతి ఏడాది రిటర్స్న్ పొందుతారు. ఈ ప్లాన్ ను 90 రోజుల నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి అందుబాటులో ఉంది. ఇది జీవితకాల ఆదాయాన్ని, బీమా కవరేజీని అందిస్తుంది. ప్రీమియం చెల్లింపు వ్యవధి తప్పనిసరిగా కనీసం ఐదు సంవత్సరాలు, గరిష్టంగా 16 సంవత్సరాలు ఉండాలి.
ప్రీమియం చెల్లిస్తున్న సమయంలో ప్రతి వెయ్యికి రూ. 40 చొప్పున జమ అవుతుంది. కొన్ని సంవత్సరాలు ప్రీమియం చెల్లించి, ఆ తర్వాత కొంత కాలానికి పాలసీదారుకు తిరిగి చెల్లింపు ప్రారంభం అవుతుంది. ప్రతి ఏటా పాలసీ మొత్తంలో 10 శాతం అందిస్తారు. పాలసీదారు ఎంపికలను బట్టి ఇన్ కమ్ బెనిఫిట్స్ ఉంటాయి.
- రెగ్యులర్ ఇన్‌కమ్ బెనిఫిట్: ఇది వాయిదా వ్యవధి తర్వాత మూడు నుంచి ఆరు సంవత్సరాల తర్వాత ప్రారంభమవుతుంది. పాలసీదారుడు చెల్లించిన మొత్తంలో 10 శాతం ప్రతీ ఏటా చెల్లిస్తాయి. ఇలా పాలసీదారుడి జీవితాంతం చెల్లింపు ఉంటుంది. ఉదాహరణకు పాలసీదారుడు రూ.5 లక్షల పాలసీ తీసుకుని ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే...లాక్ ఇన్ పీరియడ్ తర్వాత అంటే పాలసీ 11వ సంవత్సరం నుంచి ఏటా రూ.50 వేలు(పాలసీలో 10 శాతం) జీవితాంతం(100 సంవత్సరాలు) చెల్లిస్తారు.
- ఫ్లెక్సీ ఇన్ కమ్ బెనిఫిట్ : పాలసీదారులు ఫ్లెక్సీ ఇన్‌కమ్ బెనిఫిట్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో పాలసీ నిబంధనలకు అనుగుణంగా ఏటా 10 శాతం పాలసీదారుడికి అందిస్తారు. ఒకవేళ ఈ 10 శాతం తనకు అప్పుడే అవసరంలేదు అనుకుంటే...అతడు ఎల్ఐసీ వద్దే ఉంచుకోవచ్చు. ఈ ఫ్లెక్సీ ఆదాయ చెల్లింపులపై సంవత్సరానికి 5.5 శాతం చొప్పున కాంపౌండ్ వడ్డీని అందిస్తారు.
- ఒకవేళ పాలసీదారు మరణించిన సందర్భంలో పాలసీ యాక్టివ్‌గా ఉన్నట్లయితే, నామినీకి డెత్ బెనిఫిట్ చెల్లిస్తాయి. డెత్ బెనిఫిట్ మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలో 105 శాతం కంటే తక్కువ కాకుండా చెల్లిస్తారు. బేసిక్ సమ్ అష్యూర్డ్ లేదా వార్షిక ప్రీమియం కంటే 7 రెట్లు ఏది ఎక్కువ అయితే అది నామినీకి చెల్లిస్తారు.
- ఈ ప్లాన్ కింద మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉండవు. ఎంపిక ఆధారంగా సాధారణ/ఫ్లెక్సీ ఆదాయ ప్రయోజనాలు జీవితకాలం పొందుతారు. జీవితకాలం అంటే ఓ వ్యక్తికి 100 సంవత్సరాలు వచ్చే వరకు చెల్లిస్తారు.
- ఈ ప్లాన్ పై లోన్ ద్వారా అదనపు లిక్విడిటీని పొందవచ్చు.
- తక్కువ సమయంలో చెల్లించాలనుకుంటే ఎక్కువ ప్రీమియం ఉంటుంది. ఎక్కువ కాలవ్యవధి అనే ప్రీమియం తక్కువగా ఉంటుంది.
- ఈ ప్లాన్‌తో ఐదు ఆప్షనల్ రైడర్‌లు అందిస్తున్నారు. పాలసీదారు యాక్సిడెంటల్ డెత్, డిసెబిలిటీ బెనిఫిట్ లేదా యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్‌ని ఎంచుకోవచ్చు. కొత్త టర్మ్ అస్యూరెన్స్ రైడర్, కొత్త క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్, ప్రీమియం మినహాయింపు బెనిఫిట్ రైడర్ ను ఎంచుకోవచ్చు. షరతులకు లోబడి అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ఇవి పొందవచ్చు.
- ఈ పాలసీ ద్వారా పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా, ఎంచుకున్న ఎంపికను బట్టి సాధారణ ఆదాయ ప్రయోజనం లేదా ఫ్లెక్సీ ఆదాయ ప్రయోజనం రూపంలో అధిక ప్రయోజనాలు పొందవచ్చు.
35 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 10 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లింపు కాలాన్ని నిర్ణయించుకుని, రూ. 10 లక్షల పాలసీ ఎంచుకుంటే అతడు వార్షిక ప్రీమియం రూ. 1,11,050 చెల్లించాల్సి ఉటుంది. అతడికి సాధారణ ఆదాయ ఎంపిక కింద పాలసీ తీసుకున్న 13వ సంవత్సరం నుంచి జీవితాంతం ఏటా రూ. 1 లక్ష చెల్లిస్తారు.
సంబంధిత కథనం