CM Chandrababu: సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.400కోట్ల విరాళాలు..30లోగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానన్న చంద్రబాబు-donations of rs 400 crores to the cms relief fund chandrababu said that justice will be given to every victim ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu: సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.400కోట్ల విరాళాలు..30లోగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానన్న చంద్రబాబు

CM Chandrababu: సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.400కోట్ల విరాళాలు..30లోగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానన్న చంద్రబాబు

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 25, 2024 01:02 PM IST

CM Chandrababu: విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్‌లో పరిహారం విడుదల చేశారు. బాధితుల్ని ఆదుకోవాలని ఇచ్చిన పిలుపుతో ఏకంగా రూ.400కోట్ల రుపాయల విరాళాలు వచ్చాయని చివరి బాధితుడి వరకు న్యాయం చేస్తామని, మిగిలిన దరఖాస్తుల్ని 30లోగా పరిష్కరించాలన్నారు.

వరద సహాయక చర్యలపై ప్రజల ఫీడ్ బ్యాక్‌ పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు
వరద సహాయక చర్యలపై ప్రజల ఫీడ్ బ్యాక్‌ పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu: చిట్టచివరి బాధితుడికి సాయం అందించే వరకు వరద సహాయక చర్యల ఆపరేషన్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఫేజ్‌1 సహాయక చర్యలు, బాధితులకు పరిహారం చెల్లించిన తర్వాత మరోసారి సమీక్షిస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వరదల్లో సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి ఉచితంగా వాటిని అందించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను ఉచితంగా అందించాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.

వరదల ముగిసిన తర్వాత ప్రభుత్వాల యంత్రాంగాల పనితీరుపై 146గంటల పాటు అన్ని ప్రభుత్వ శాఖల పనితీరును ప్రత్యక్షంగా సమీక్షించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. వరద సహాయక చర్యల్లో తనకంటే అధికారులు చాలా ఎక్కువగా శ్రమించారని సిఎం వివరించారు. సింగరేణి కాలరీస్‌లో ప్రమాదాలు జరిగి, 25-30మంది చనిపోయినప్పుడు, ఐదారు కిలోమీటర్లు గనుల్లోకి వెళ్లానని గుర్తు చేసుకున్నారు. అధికారులు వారించినా తాను గనుల్లోకి వెళ్లానని, హుద్‌హుద్‌ తుఫానులో సైతం సహాయక చర్యలు చేపట్టామన్నారు. విజయవాడలో వచ్చిన విపత్తు ముందెన్నడూ ఎరుగనిదని సీఎం చంద్రబాబు చెప్పారు.

రాష్ట్రంలో  లక్షా 18వేల ఇళ్లు మునిగితే విజయవాడలో 78వేల ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయని  చెప్పారు. పూర్తిగా మునిగిన ఇళ్లు 64,599మునిగాయని, గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లకు 25వేల పరిహారం చెల్లిస్తున్నట్లు చెప్పారు. 13,759మంది 10వేల చొప్పున చెల్లిస్తున్నట్టు చెప్పారు. 

వరద నీటిలో లక్షలమంది మునిగిపోయారని, అన్నిరకాల నీళ్లు కలిసిపోయాయని, డ్రెయిన్లు పొంగి, మురుగునీరు కలిసిపోయి కనీసం మంచినీరు తాగే పరిస్థితి కూడా లేదని, కనీవిని ఎరుగని విపత్తును ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో సిబ్బంది భయపడకుండా సహాయక చర్యల్లో పాల్గొన్నారని చెప్పారు. అంతా సర్వశక్తులు ఒడ్డి సహాయక చర్యల్లో పాల్గొన్నారని చెప్పారు.

ప్రభుత్వ చర్యలు చివరి దశకు చేరుకున్న తరుణంలో చిన్నచిన్న పొరపాట్లు జరగడం సహజమని, దానిని కూడా సరిచేయాల్సిన బాధ్యత ఉందన్నారు. విపత్తును విజయవంతంగా ఎదుర్కొన్న వైనంపై వచ్చే వారం అభినందన కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెప్పారు.

మరోవైపు వరద బాధితుల్ని ఆదుకోవాలనే విజ్ఞప్తికి స్పందించిన ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి విరాళాలు అందించారని, ఏకంగా 400కోట్ల రుపాయలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళాలు వచ్చాయని, ఇది దేశంలోనే అత్యధిక విరాళాలు అన్నారు. వరద బాధితుల కోసం ఎక్కడెక్కడి నుంచో స్వయంగా వచ్చి తోచిన నగదు ఇచ్చారని సీఎం చెప్పారు. ఈ త్యాగాలు, స్ఫూర్తిని మర్చిపోలేమని, అలాంటి స్ఫూర్తిదాయక సమయంలో ఏ ఒక్కరిని విస్మరించడానికి వీల్లేదన్నారు.

వరదల్లో సర్టిఫికెట్లు కోల్పోయిన వారందరికి డూప్లికేట్ పత్రాలను వీలైనంత త్వరగా అందించాలని సిఎం ఆదేశించారు. కొత్తగా పరిహారం కోసం 18వేల దరఖాస్తులు వచ్చాయని వాటన్నింటిని 30వ తేదీలోపు పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి దరఖాస్తును క్షేత్ర స్థాయిలో పరిశీలించి అభ్యంతరాలు నమోదు చేయాలన్నారు. డూప్లికేట్ దరఖాస్తులు మినహాయించిన తర్వాత 13,300వేల దరఖాస్తులను ఇంకా పరిష్కరించాల్సి ఉందన్నారు.

మిగిలిన దరఖాస్తుల్ని తాసీల్దార్లతో క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపించాలని నిర్ణయించారు. రెండు రోజుల్లో ఎవరెవరికి పరిహారం చెల్లించాలనేది స్పష్టత వస్తుందని, శనివారంలోగా ఈ ప్రక్రియ ముగిస్తామని చెప్పారు. ఫిర్యాదులను, తిరస్కరించడానికి , ముగించడానికి స్పష్టమైన కారణాలు వివరించాలని సీఎం ఆదేశించారు.

విజయవాడలో సెప్టెంబర్‌లో సాధారణంగా 20మి.మీ వర్షపాతం కురవాల్సి ఉంటే వెయ్యిశాతం అధికంగా 3145 మి.మీ వర్షపాతం నమోదైందని సీఎస్‌ నీరబ్‌కుమార్‌ వివరించారు. మరోవైపు కృష్ణానదికి మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, 11.43 లక్షల క్యూసెక్కుల వరద నీటిని కృష్ణా నది నుంచి విడుదల చేసినట్టు చెప్పారు. గోదావరిలో కూడా వరదలు వచ్చాయని చెప్పారు. అక్కడ కూడా వరద ముంపు ప్రభావం ఉందన్నారు.

11రోజుల పాటు ముఖ్యమంత్రి కలెక్టరేట్‌లో ఉంటూ వరద సహాయక చర్యల్ని పర్యవేక్షించారని సీఎస్ గుర్తు చేశారు. ముఖ‌్యమంత్రి, ఎమ్మెల్యేలు,మంత్రులు ప్రత్యక్షంగావరద సహాయక చర్యల్లో పాల్గొన్నారన గర్తు చేశారు. వరద సహాయక చర్యలల డ్రోన్లను వినియోగించి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందినట్టు చెప్పారు. సీనియర్ ఐఏఎస్‌ అధికారుల్ని నియమించి వరద సహాయక సహాయక చర్యల్ని పర్యవేక్షించినట్టు సీఎస్ తెలిపారు.

వరదల్లో విజయవాడలో 14వేల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించినట్టు అధికారులు వివరించారు. 2.20లక్షల మందికి వరదల సమయంలో వైద్య సేవలు అందించినట్టు చెప్పారు. ప్రతి ఇంటికి వైద్య ఆరోగ్య సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి వ్యాధులు వ్యాప్తి చెందకుండా వైద్య పరీక్షలు నిర్వహించి, 2.30లక్షల మెడికల్ కిట్లను బాధితులకు పంపిణీ చేసినట్టు స్పెషలాఫీసర్ కృష్ణబాబు సమీక్షలో చెప్పారు.

వరద సహాయక చర్యల కోసం ఫైరింజన్లు వినియోగించామని చెప్పారు.  తాను స్వయంగా ప్రతి ఒక్క ప్రాంతంలో పరిశీలించానని, ప్రమాదకర ప్రాంతాలకు తాను స్వయంగా పరిశీలించానని, చాలా వరకు ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగినట్టు చెప్పారు. ప్రజలకు భరోసా ఇవ్వడం ద్వారా స్వంతన కలిగించామన్నారు. 

డ్రోన్లు వాడటం, ఫైరింజన్లు వాడటం దేశంలోనే ఇదే తొలిసారి అని చెప్పారు.  780 ప్రోక్లెయిన్లను సహాయక చర్యల్లో వాడామని అన్నారు. 2.30లక్షల అగ్గిపెట్టెలు, మూడున్నర లక్షల క్యాండిల్స్‌, 1.14కోట్ల వాటర్ బాటిల్లు, 37లక్షల లీటర్ల పాలు పంపిణీ చేశామన్నారు. 

వరద సహాయక చర్యల్లో  1.15కోట్ల ఆహార పొట్లాలను పంపిణీ చేశామని, 5వేల క్వింటాళ్ల కూరగాయలు పంపిణీ చేశామని, నీటి ట్యాంకర్లకు లెక్కే లేదన్నారు. 2.45లక్షల మంది నిత్యావసర వస్తువుల వరద సాయం పంపిణీ చేశామన్నారు. 75వేల ఇళ్లను అగ్నిమాపక సిబ్బంది శుభ్రం చేశారన్నారు. 330కిలోమీటర్ల రోడ్లను ఫైర్‌ సిబ్బంది శుభ్రం చేశారని చెప్పారు. వరదల్లో  20వేల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించినట్టు చెప్పారు.  భవిష్యత్తులో ఇలాంటి వరదలు వస్తే ఆహారా పదార్ధాలను నేరుగా బాధితులకు ఇళ్లకు చేరవేసే పరిస్థితి వస్తుందన్నారు. 47మంది ప్రాణాలు కోల్పోయారని చంద్రబాబు చెప్పారు.

సంబంధిత కథనం