Free Certificates: వరద ముంపు బాధితులకు ఉచితంగా సర్టిఫికెట్లు జారీ చేయనున్న ఏపీ ప్రభుత్వం
Free Certificates: విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరదల్లో లక్షలాది మంది ప్రజలు ముంపుకు గురయ్యారు. చాలామంది కట్టుబట్టలతో మిగిలారు. విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు పనికిరాకుండా పోయాయి. సర్వం కోల్పోయిన బాధితుల్ని ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా
Free Certificates: విజయవాడ వరదల్లో నీట మునిగి సర్వం కోల్పోయిన బాధితుల్ని ఆదుకోడానికి ఏపీ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. వరదల్లో అన్ని రకాల సర్టిఫికెట్లు కోల్పోవడంతో పలువురు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దాదాపు 10రోజుల పాటు వరద ముంపులో ఇళ్లు ఉండిపోవడంతో ముఖ‌్యమైన పత్రాలు కూడా మిగల్లేదు.
ఈ నేపథ్యంలో ఇళ్లు మునిగిన వారికి ఉచితంగా ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వరదల్లో ఇళ్లు మునిగి వివిధ రకాల ధ్రువపత్రా లను కోల్పోయిన వారికి... ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించి వాటిని ఉచితంగా అందించాలని నిర్ణయించింది.
విజయవాడలో 32 డివిజన్లలో వరద ముంపు కారణంగా.. ఇళ్లలోకి నీరు చేరడంతో పలువురి విద్యార్హత సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహ నాల రిజిస్ట్రేషన్ పత్రాలు, దస్తావేజులు, ఆధార్ కార్డులు, కీలక పత్రాలు జనన, మరణ నమోదు పత్రాలు, వివాహ పత్రాలు పూర్తిగా తడిచి పోయాయి.
కొన్నిచోట్ల సామాన్లతో పాటు అన్ని రకాల పత్రాలు నీటిలో కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయాయి. దీంతో బాధితులు గుర్తింపు కోసం అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. సంబంధిత సర్టిఫికెట్ల నకలు ధ్రువపత్రాలను ఉచితంగా ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితులు కోల్పోయిన పత్రాల కోసం దరఖాస్తులు తీసుకుని వాటి అధీకృత కాపీలు, డూప్లి కేట్ సర్టిఫికెట్లు, పత్రాలను ఉచితంగా ఇవ్వాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఏపీ సర్కారు ఆదేశించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్టిఫికెట్ల జారీ కోసం డివిజన్ల వారీగా క్యాంపులు నిర్వహించాలని రెవెన్యూ- విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఉత్తర్వులు జారీ చేశారు.