CRDA Jobs: ఏపీ సిఆర్‌డిఏలో కాంట్రాక్ట్, డిప్యూటేషన్ కొలువులు, దరఖాస్తు చేయండి ఇలా..
CRDA Jobs: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాధికార సంస్థ సిఆర్‌డిఏను బలోపేతం చేసే క్రమంలో పలు పోస్టులను కాంట్రాక్టు, డిప్యూటేషన్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి డిప్యూటేషన్‌పై కూడా ఉద్యోగుల్ని సిఆర్‌డిఏలో చేర్చుకోనున్నారు.
CRDA Jobs: వచ్చే జనవరి నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనుల్ని తిరిగి ప్రారంభించాలని భావిస్తున్న నేపథ్యంలో సీఆర్డీఏలో కీలకమైన పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. గత ప్రభుత్వంలో సిఆర్‌డిఏ ఉద్యోగుల్లో శాశ్వత ఉద్యోగుల్ని మాతృ సంస్థలకు పంపేశారు. సిఆర్‌డిఏ పరిధిని కుదించడంతో పాటు రాజధాని నిర్మాణ పనుల్ని ఎక్కడికక్కడ నిలిపివేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థలో కదలిక వచ్చింది. రాజధానిలో త్వరలో పనులు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఆర్డీఏలోని అన్ని విభాగాలలో సిబ్బంది నియామకాలు చేపట్టారు. ఇందులో భాగంగా సీఆర్డీఏలోకి ప్రతిభావంతులైన అధికారులు, సిబ్బందిని డిప్యుటేషన్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించనున్నారు.
మంగళవారం ఈ ఉద్యోగాలకు సంబంధించిన రెండు నోటిఫికేషన్లు కమిషనర్ కాటమనేని భాస్కర్ జారీ చేశారు. సీఆర్డీఏలోని ఐదు శాఖల్లో 778 పోస్టులను మంజూరు చేశారు. అప్పట్లో 494 మంది అధికారులు, సిబ్బంది పనిచేశారు. వీరిలో సీఆర్డీఏ రెగ్యులర్ ఉద్యోగులు 83 మంది ఉన్నారు. వారిలో వీజీటీఎం ఉడా సిబ్బంది 43మంది, సీఆర్డీఏ కాంట్రాక్ట్ సిబ్బంది 112, , ఔట్ సోర్సింగ్ సిబ్బంది140 మంది, ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్లపై 116 మంది ఉండేవారు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను ఆపేయడంతో పాటు ఉద్యోగుల్ని ఎక్కడి వారినక్కడకు పంపేశారు. చాలా మంది తమ మాతృ శాఖ లకు వెళ్లిపోయారు. గతంలో మంజూరైన అన్ని పోస్టులను భర్తీ చేస్తామని ఇటీవల పురపాలక శాఖ మంత్రి నారా యణ పలు సార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఖాళీ పోస్టులను నింపేందుకు కసరత్తు చేస్తున్నారు.
డిప్యుటేషన్ పై పనిచేయడానికి 108 పోస్టులు, కాంట్రాక్టు పద్ధతిలో 12 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని డిప్యుటేషన్పై సీఆర్డీఏకు వచ్చేందుకు ఆసక్తి చూపి స్తున్న వారి కోసంఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎస్ఈ, ఈఈ, డీఈఈ, ఏఈఈ హోదాల్లో మూడేళ్ల కాలానికి పనిచే సేందుకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇండస్ట్రియల్, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, స్ట్రక్చరల్ విభాగాల్లో ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు.
పోస్టులను బట్టి రెండు నుంచి 12 ఏళ్ల అనుభవం ఉన్న వారు కావాలని ఉద్యోగ ప్రకటనలో కోరారు. అక్టోబర్ నెల 4 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. 108 పోస్టులను డిప్యు టేషన్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఏడాది కాలానికి ఒప్పంద పద్ధతిన పనిచే సేందుకు 12 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. కమ్యునికేషన్స్ జేడీ పోస్టుల కోసం దరఖాస్తులను పిలిచారు.
సీఆర్డీఏ లో కాంట్రాక్టు ప్రాతిపదికన 12 పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సంస్థలో లీగల్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు లీగల్ మేనేజర్, ఫైనాన్స్ అకౌంట్స్ నిర్వ హించేందుకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ మేనేజర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అసిస్టెంట్ మేనే జర్, ఎన్విరాన్మెంటలిస్ట్, ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్, పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్, ఇంగ్లీషు కంటెంట్ రైటర్, తెలుగు కంటెంట్ రైటర్, క్రియేటివ్ గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్, ఎంఐఎస్ ఆపరేటర్, జాయింట్ డైరెక్టర్ కమ్యూనికేషన్స్ వంటి పోస్టులకు కాంట్రాక్టు పద్ద తిన తీసుకోవటానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా పోస్టులకు 3ఏళ్ల నుంచి పోస్టు లను బట్టి 15 ఏళ్ల అనుభవాన్ని కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సీఆర్డీఏ వెబ్సైట్లో అక్టోబరు 7లోపు తమ దరఖాస్తులను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.