Andhra Pradesh News Live October 23, 2024: YS Sharmila Letter : సొంత తల్లిపై కేసు, చెల్లి ఆస్తిని లాక్కోవాలని చూస్తున్నారు- వైఎస్ జగన్ కు షర్మిల సంచలన లేఖ
23 October 2024, 22:30 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
YS Sharmila Letter To YS Jagan : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మిడి ఆస్తులపై వివాదం నెలకొంది. ఈ విషయంపై వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో జగన్..ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. వైఎస్ జగన్ రాసిన లేఖపై ఘాటుగా స్పందిస్తూ షర్మిల రాసిన లేఖను టీడీపీ ఎక్స్ వేదికగా బయటపెట్టింది.
Cyclone Dana Effect On AP : తూర్పుమధ్య బంగాళాఖాతంలో ‘దానా’ తుపాను కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి తెల్లవారుజాములోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా, ధమ్రా (ఒడిశా) సమీపంలో తీవ్ర తుపాను తీరం దాటే అవకాశం ఉందంది. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు, శారదాపీఠం భూములు వెనక్కి, ఉచిత ఇసుక విధానంపై పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్ అనురాధ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
APSRTC Apprenticeship 2024 : ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటీస్ షిప్ నకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్థులు అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు https://www.apprenticeshipindia.gov.in/ లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
AP Free Gas Cylinders Scheme : ఏపీ ప్రభుత్వం మహిళలకు దీపావళి కానుకగా 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తుంది. ఈ పథకానికి ఇవాళ మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఈ పథకానికి అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం.
AP Mega DSC Free Coaching : ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉచితంగా డీఎస్సీ కోచింగ్ అందిస్తు్న్నారు. ఈ మేరకు విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. తాజాగా దరఖాస్తుల చివరి తేదీని అక్టోబర్ 25 వరకు పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు జ్ఞానభూమి వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. విజయనగరం నుంచి పంచారామాలకు స్పెషల్ సర్వీసులను ప్రకటించింది. ఇందులో భాగంగా ఐదు ప్రముఖ అధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించవచ్చు. నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో విజయనగరం నుంచి బస్సులు బయల్దేరుతాయి. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి….
PM Internship Scheme 2024 : పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 3న ప్రారంభించింది. అక్టోబర్ 12 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 25 దరఖాస్తులకు చివరి తేదీ. అక్టోబర్ 26న దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అయితే ఆఫర్ లెటర్ పొందితే అభ్యర్థులు ఏం చేయాలో తెలుసుకుందాం.
- AP Dana Effect: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపటికి దానా తుఫానుగా మారనుంది. ఉత్తరాంధ్ర నుంచి పశ్చిమ బెంగాల్ వరకు తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలతో పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
- ప్రకాశం జిల్లాలో సమగ్ర శిక్షా అభియాన్‌లో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం ఆరు పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 24వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ పోస్టులకు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు మాత్రమే అర్హులవుతారు.
- వైఎస్ జగన్ కుటుంబంలో ఆస్తి పంపకాలు తెరపైకి వచ్చాయి. న్యాయపరంగా ముందుకెళ్లే దిశగా వైఎస్ జగన్ అడుగు ముందుకేశారు. సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లపై వివాదం నెలకొంది .
- Vasireddy Padma: వైసీపీ నాయకురాలు, మాజీ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు వాసిరెడ్మి పద్మ వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. జగ్గయ్యపేట నియోజక వర్గ బాధ్యతలు అప్పగించకపోవడంపై కినుక వహించిన వాసిరెడ్డి పద్మ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు
- Balayya Unstoppable: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఓటీటీలో ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ షోలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ ఆసక్తి రేపుతోంది. అక్టోబర్ 25న ప్రసారమయ్యే ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. గత ఏడాది అరెస్ట్ సమయంలో పరిణామాలను చంద్రబాబు వివరించారు.
- AP LAWCET Counselling 2024: ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది.ధ్రువపత్రాల పరిశీలన అక్టోబర్ 24వ తేదీన ఉంటుంది. నవంబర్ 2వ తేదీన తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. https://lawcet-sche.aptonline.in/ లింక్ పై క్లిక్ ప్రాసెస్ చేసుకోవాలి.
- Pinipe Srikanth: కోనసీమ జిల్లాలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త, వాలంటీర్ జనుపల్లి దుర్గా ప్రసాద్ హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడికి 14రోజుల రిమాండ్ విధించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే మిగిలిన నిందితుల్ని అరెస్ట్ చేశారు.
- Vijayawada Murder: మద్యం మత్తులో ప్రాణస్నేహితుడే మిత్రుడి ప్రాణం తీసిన ఘటన విజయవాడలో జరిగింది. మంగళవారం రాత్రి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని లోటస్ ల్యాండ్ మార్క్ విల్లాల్లో అర్థరాత్రి తర్వాత జరిగిన హత్యపై నిందితుడే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
- Fee Reimbursement: ఆంధ్రప్రదేశ్‌లో కోర్సులు పూర్తైనా ఫీజులు చెల్లించకపోవడంతో లక్షలాది విద్యార్థులు సర్టిఫికెట్లు అందక అవస్థలకు గురవుతున్నారు.ఏడాది కాలంగా కాలేజీలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించక పోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి.ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి శుభవార్త వింటారని లోకేష్ ట్వీట్ చేశారు.