AP LAWCET Counselling 2024 : ఏపీ లాసెట్ అడ్మిషన్లు - రిజిస్ట్రేషన్ కు ఇవాళే చివరి తేదీ, నవంబర్ 2న సీట్ల కేటాయింపు-today is the last date for ap lawcet counseling online registrations 2024 allotment of seats on november 2 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Lawcet Counselling 2024 : ఏపీ లాసెట్ అడ్మిషన్లు - రిజిస్ట్రేషన్ కు ఇవాళే చివరి తేదీ, నవంబర్ 2న సీట్ల కేటాయింపు

AP LAWCET Counselling 2024 : ఏపీ లాసెట్ అడ్మిషన్లు - రిజిస్ట్రేషన్ కు ఇవాళే చివరి తేదీ, నవంబర్ 2న సీట్ల కేటాయింపు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 23, 2024 09:27 AM IST

AP LAWCET Counselling 2024: ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది.ధ్రువపత్రాల పరిశీలన అక్టోబర్ 24వ తేదీన ఉంటుంది. నవంబర్ 2వ తేదీన తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. https://lawcet-sche.aptonline.in/ లింక్ పై క్లిక్ ప్రాసెస్ చేసుకోవాలి.

ఏపీ లాసెట్ ప్రవేశాలు 2024
ఏపీ లాసెట్ ప్రవేశాలు 2024

ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి విడత ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల గడవు ఇవాళ్టితో(అక్టోబర్ 23) పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. అక్టోబర్ 20వ తేదీతోనే గడువు పూర్తి అయినప్పటికీ… 3 రోజులు పొడిగించారు. ఈ గడవు కూడా ఇవాళ్టితో పూర్తి అవుతుంది. ధ్రువపత్రాలను కూడా అప్ లోడ్ చేయాలని సూచించారు.

25 నుంచి వెబ్ ఆప్షన్లు….

ఆన్ లైన్ ధ్రువపత్రాల పరిశీలన అక్టోబర్ 24వ తేదీన ఉంటుంది. అక్టోబర్ 25వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభమవుతాయి. ఇందుకు అక్టోబర్ 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.అక్టోబర్ 29వ తేదీన వెబ్ ఆప్షన్లు ఎడిట్ చేసుకోవచ్చు. నవంబర్ 2వ తేదీన తొలి విడత సీట్లు కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ 4వ తేదీ నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు నవంబర్ 7వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

  • ఏపీ లాసెట్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లకు తుది గడవు - 23 అక్టోబర్ 2024.
  • ధ్రువపత్రాల పరిశీలన - 24 అక్టోబర్ 2024.
  • వెబ్ ఆప్షన్లు - 25 అక్టోబర్ నుంచి 28 అక్టోబర్ ,2024.
  • వెబ్ ఆప్షన్లు ఎడిట్ - 29 అక్టోబర్ 2024.
  • ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - 2 నవంబర్ 2024.
  • రిపోర్టింగ్ సమయం - 4 నవంబర్ నుంచి 7 నవంబర్ 2024.
  • అధికారిక వెబ్ సైట్ - https://cets.apsche.ap.gov.in/

ఈ ఏడాది ఏపీ లాసెట్‌ పరీక్షను 19,224 మంది అభ్యర్థులు రాశారు. అందులో 17,117 మంది (89.04 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో రెండేళ్ల పీజీ కోర్స్ లో 99.51 శాతం, మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్స్ లో 89.74 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్స్ లో 80.06 శాతం ఉతీర్ణత సాధించారు. ఈ ఏడాది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లాసెట్- 2024 ప్రవేశ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని న్యాయ కళాశాలాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ఫలితాలు జూన్ 27న వెల్లడించారు.

ఈసారి విడుదలైన ఫలితాలను చూస్తే… రెండేళ్ల పీజీ కోర్సులో(LLM) పురుషులు 99.51 శాతం, స్త్రీలు 99.51 శాతం ఉత్తీర్ణత సాధించారు. మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో పురుషులు 91.28 శాతం, స్త్రీలు 86.26 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో పురుషులు 81.91 శాతం, స్త్రీలు 78.17 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఏపీ లాసెట్ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి…

  • అభ్యర్థులు మొదటగా https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • Download Rank Card ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • Registration Number , Hall Ticket Number, పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.
  • గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
  • కౌన్సెలింగ్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంత కీలకం.

Whats_app_banner

సంబంధిత కథనం