AP Mega DSC Free Coaching : ప్రముఖ కోచింగ్ సెంటర్లలో డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ, దరఖాస్తు గడువు పెంపు
AP Mega DSC Free Coaching : ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉచితంగా డీఎస్సీ కోచింగ్ అందిస్తు్న్నారు. ఈ మేరకు విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. తాజాగా దరఖాస్తుల చివరి తేదీని అక్టోబర్ 25 వరకు పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు జ్ఞానభూమి వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు డీఎస్సీ ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు విద్యాశాఖ ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రముఖ కోచింగ్ సెంటర్ లలో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ఇస్తారు. టెట్ మార్కులు, అక్టోబర్ 27న నిర్వహించే అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విద్యాశాఖ తాజాగా దరఖాస్తు గడువును పెంచింది. అక్టోబర్ 21తో దరఖాస్తు గడువు ముగియగా, మరో నాలుగు రోజులు అక్టోబర్ 25వ తేదీ వరకు దరఖాస్తులు పెంచారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్, ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు https://jnanabhumi.ap.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ కోరింది.
మెగా డీఎస్సీ 2024 ఉచిత కోచింగ్ కు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత కోచింగ్, ఉచిత భోజనం, వసతి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రముఖ కోచింగ్ సెంటర్ లలో 3 నెలల పాటు అభ్యర్థులకు తరగతులు నిర్వహించారు. టీచర్ల అభ్యర్థులకు ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ పేపర్ 1, 2 ఎగ్జామ్స్ కు కోచింగ్ ఇస్తారు. మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ కు మొత్తం 5,050 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో ఎస్సీలకు 3,050 సీట్లు, ఎస్టీలకు 2000 సీట్లు కేటాయిస్తారు. ఎస్‌జీటీ పోస్టులకు కోచింగ్ కోసం ఇంటర్, డీఈడీ, టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు డిగ్రీ, బీఈడీ, టెట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు, తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు. స్క్రీనింగ్ టెస్ట్, టెట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్జీటీ అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.26,500, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.28,500 వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
ముఖ్య వివరాలు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ 2024-25
- ఎంపిక చేసే అభ్యర్థుల సంఖ్య : SC- 3050, ST - 2000
- మొత్తం అభ్యర్థులు : 5050
- కోచింగ్ విధానం: రెసిడెన్షియల్
- విద్యార్థుల ఎంపిక విధానం : స్క్రీనింగ్ టెస్ట్(85%), టెట్ స్కోర్ (15%)
- కోచింగ్ వ్యవధి: 3 నెలలు
- కోచింగ్ : ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్
- జిల్లాల వారీగా మెరిట్ జాబితాలు, ఎంపిక జాబితాలు రూపొందిస్తారు.
- మహిళా రిజర్వేషన్లు పాటిస్తారు.
- విద్యార్థులు ఎంపిక మేరకు, ఆయా కోచింగ్ సెంటర్ల ప్రవేశ సామర్థ్యం ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంప్యానెల్డ్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు విద్యార్థులను కేటాయిస్తారు.
నవంబర్ 2న టెట్ ఫలితాలు!
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024(టెట్) ప్రశాంతంగా ముగిశాయి. 17 రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో పరీక్షల్ని నిర్వహంచారు. టెట్ పరీక్షలు పూర్తి కావడంతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గత జులైలోనే నోటిఫికేషన్ వెలువడాల్సి ఉన్నా టెట్ కోసం వాయిదా పడింది. నవంబర్ 2న టెట్ ఫలితాలు విడుదల చేసి, నవంబర్ 3న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.
సంబంధిత కథనం