హైదరాబాద్ లోని తెలంగాణ ఎస్టీ స్టడీ సర్కిల్ అర్హులైన ST, SC, BC అభ్యర్థులకు ఐబీపీఎస్ క్లర్క్, పీవో ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ అందిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఈ https://studycircle.cgg.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
1. ST, SC, BC అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
2. విద్యార్హత - IBPS నోటిఫికేషన్ ప్రకారం
3. వయో పరిమితి - IBPS నోటిఫికేషన్ ప్రకారం
4. అభ్యర్థి, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 3 లక్షల కంటే తక్కువ
5. ఉద్యోగం చేస్తున్న లేదా రెగ్యులర్/కరస్పాండెన్స్ కోర్సులు చదువుతున్న అభ్యర్థులు అనర్హులు
6. ఇప్పటికే ఏదైనా ప్రభుత్వ స్డటీ సర్కిల్ నుంచి కోచింగ్ తీసుకున్న వారు అనర్హులు
7. తెలంగాణ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
8. కోచింగ్ తీసుకునే అభ్యర్థులు ఐబీపీఎస్ సూచించిన నిబంధనల ప్రకారం అర్హులై ఉండాలి
కమ్యూనిటీ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం, మార్క్స్ మెమో, ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ లేదా తత్సమానం, తాత్కాలిక/ కాన్వొకేషన్, టీసీ స్కాన్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
సంబంధిత కథనం