PM Internship Scheme 2024: పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్, దరఖాస్తుకు ఎల్లుండే చివరి తేదీ? ఆఫర్ లెటర్ పొందిన తర్వాత ఏం చేయాలి?
PM Internship Scheme 2024 : పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 3న ప్రారంభించింది. అక్టోబర్ 12 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 25 దరఖాస్తులకు చివరి తేదీ. అక్టోబర్ 26న దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అయితే ఆఫర్ లెటర్ పొందితే అభ్యర్థులు ఏం చేయాలో తెలుసుకుందాం.
ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. ఈ స్కీమ్ కు నిరుద్యోగుల నుంచి భారీగా స్పందన వస్తుంది. ఇంటర్న్ ఫిప్ దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రెండు వారాల్లోనే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం 1,25,000 కంటే ఎక్కువ మంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు కంపెనీలు ముందువచ్చాయి. డిసెంబర్ 2 నుంచి ఇంటర్న్‌షిప్‌లు ప్రోగ్రామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇంటర్న్‌షిప్‌లను అందించే ప్రముఖ కంపెనీలలో లార్సెన్ & టూబ్రో, మహీంద్రా & మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్, మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, ఐషర్ మోటార్స్ ఉన్నాయి.
ఐదేళ్లలో కోటి మంది యువతకు ఉపాధి నైపుణ్యాల్లో శిక్షణ అందించే లక్ష్యంతో పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.800 కోట్ల వ్యయంతో పైలట్ ప్రాజెక్టును ఇటీవల ప్రారంభించింది. అక్టోబర్ 12 నుంచి 25వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ స్కీమ్ అక్టోబర్ 3న ప్రారంభమైంది. పీఎం ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని రెండు దశల్లో అమలుచేయనున్నారు. ఇంటర్న్‌షిప్‌లు ప్రోగ్రామ్ 12 నెలల పాటు కొనసాగుతుంది. నెలకు రూ.5 వేలు చొప్పున ఏడాదికి రూ. 60 వేలు స్టైఫండ్ ఇస్తారు.
పీఎం ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కు ఎంపికైన తర్వాత తీసుకోవలసిన చర్యలు
- ఆఫర్ లెటర్ ను సమీక్షించండి- మీ ఇంటర్న్‌షిప్ ప్లేస్, కంపెనీ, స్టైఫండ్, వ్యవధికి సంబంధించిన అన్ని వివరాలు సరైనవేనా అని నిర్ధారించుకోండి.
- ఆఫర్‌ను అంగీకరించండి- మీ ఆఫర్ లేఖలో పేర్కొన్న నిబంధనలతో ఏకీభవిస్తే, సూచించిన విధంగా ఆఫర్ కు అధికారంగా అంగీకారం తెలపండి. ఆఫర్ లెటర్ పై సంతకం చేసి, తిరిగి పంపడం లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ధృవీకరించడం చేయాలి.
- అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి -మీ ఇంటర్న్‌షిప్ ను ప్రారంభించే ముందు కంపెనీకి అందించాల్సిన పత్రాలను సిద్ధం చేసుకోండి. ఐడెంటిటీ కార్డు, విద్యార్హత పత్రాలు, ఇతర సంబంధిత పత్రాలను సిద్ధం చేసుకోండి.
- ఆన్-బోర్డింగ్ పూర్తి చేయండి - కంపెనీ నిబంధనల మేరకు ఆన్-బోర్డింగ్ సూచనలను పాటించండి. ఇందులో ఆన్-బోర్డింగ్ ఫారమ్‌లను పూర్తి చేయడం, ఓరియంటేషన్ సెషన్‌లకు హాజరు కావడం లేదా శిక్షణ మాడ్యూల్‌లను పూర్తి చేయడం వంటివి ఉండవచ్చు.
- స్టైఫండ్ చెల్లింపు విధానం- స్టైపెండ్ చెల్లింపుల కోసం మీ బ్యాంక్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థి కంపెనీ CSR ఫండ్స్ నుంచి రూ.500, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.500 నెలవారీ స్టైఫండ్‌ను అందుకుంటారు.
- మీ ప్రయాణం, షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకోండి - మీరు ఇంటర్న్‌షిప్ ప్రదేశానికి ఎలా ప్రయాణించాలో ప్లాన్ చేసుకోండి. పని గంటలకు అనుగుణంగా మీ రోజువారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేయండి.
- కమ్యూనికేషన్‌లో ఉండాలి - ఇంటర్న్ షప్ గురించి ఏవైనా అప్‌డేట్‌లు లేదా అదనపు అవసరాల కోసం కంపెనీతో కాంటాక్ట్ లో ఉండాలి.
ఇంటర్న్‌షిప్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ పోర్టల్ https://pminternship.mca.gov.in/login/ లో అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 12 నుంచి 25 వరకు ఈ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 26 న షార్ట్‌లిస్ట్ చేస్తారు.
సంబంధిత కథనం