Balayya Unstoppable: జైల్లో పవన్‌తో జరిగిన చర్చలలో ఏమి జరిగిందంటే.. బాలకృష్ణ అన్ స్టాపబుల్‌లో చంద్ర బాబు
Balayya Unstoppable: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఓటీటీలో ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ షోలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ ఆసక్తి రేపుతోంది. అక్టోబర్ 25న ప్రసారమయ్యే ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. గత ఏడాది అరెస్ట్ సమయంలో పరిణామాలను చంద్రబాబు వివరించారు.
Balayya Unstoppable: ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఓటీటీలో విడుదల కానున్న ఇంటర్వ్యూ ఆసక్తి రేపుతోంది. జైలు గోడల మధ్య ఏం జరిగిందంటూ చంద్రబాబును బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్నాయి.
అన్ స్టాపబుల్-4వ సీజన్ ప్రోమో మంగళవారం విడుదలైంది. అన్‌స్టాపబుల్ ఓత్ అంటూ బాబుతో బాలయ్య ప్రమాణం చేయించారు.
చంద్రబాబు నాయుడు అనే నేను బాలకృష్ణ మీద ప్రేమతో ఏది అడిగితే దానికి నవ్వుతూ సమాధానం చెప్పాలని కోరితే చంద్రబాబు సమయస్ఫూర్తిగా సమాధానం చెబుతానని బదులిచ్చారు.
బాలకృష్ణ ప్రశ్నకు మీ చమత్కారం మీది, మా సమయ స్పూర్తి మాదని బాబు బదులిచ్చా.
గత ఏడాది జరిగిన అరెస్ట్‌పై ముందే ఇన్ఫర్మేషన్ ఉందా అని బాలకృష్ణ చంద్రబాబును అడిగారు. ఆ సమయంలో తాను బస్‌లో ఉన్నానని, మిమ్మల్ని అరెస్ట్ చేశామన్నారని గుర్తు చేసుకున్నారు. తప్పు చేసిన వాడిని వదిలి పెట్టనని బాబు శపథం చేశారు.
“ఆకాశంలో సూర్యచంద్రులు,ఆంధ్రాలో బాబుగారు పవన్ కళ్యాణ్ అంటున్నారని, రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన మీటింగ్‌లో ఏమి జరిగిందని , లోపల, జైలు గోడల మధ్య ఏమి జరిగిందో ప్రజలకు తెలియాలని బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు కూడా బాబు సమాధానం చెప్పారు.”
జైలు గోడల మధ్య ఏమి జరిగిందని అడిగారు.. పవన్ కళ్యాణ్ తాను జైల్లో రెండు నిమిషాల పాటు మాట్లాడుకున్నామని ఆ తర్వాత నూతనమైన చరిత్ర రాయడానికి సమయస్ఫూర్తిగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
బాలకృష్ణ ఎక్కడ ఉంటే అక్కడ హాస్యం ఉంటుందని, ధోనీ, కోహ్లీలలో విరాట్ కోహ్లీని ప్రిఫర్ చేస్తానని చెప్పారు. భువనేశ్వరి, బ్రాహ్మణిలో ఎవరు అంటే పెద్ద సమస్య అయిపోయిందని చంద్రబాబు నవ్వుతూ చెప్పారు.
ఒకప్పుడు థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అని చెప్పే వాడినని, ఇప్పుడు తాను థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అని చెబుతానని చంద్రబాబు వివరించారు. తెలుగు జాతి నంబర్ వన్‌గా ఉండాలన్నది తన అకాంక్ష అని చెప్పారు. ఈ ఎపిసోడ్అ క్టోబర్ 25 శుక్రవారం రాత్రి 8.30కు ప్రసారం కానుంది.
'గీత దాటని మనిషి మీరు.. మీ కోసం వారు గీత దాటారు బావ ఆ సమయంలో మీకు ముందే సమాచారం ఉందా?' అంటూ బాలకృష్ణ అడిగిప ప్రశ్నలు, జైల్లో కూటమి జట్టు కట్టడంపై బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తి రేపాయి.