Cyclone Dana Effect On AP : ఏపీపై 'దానా' తుపాను ఎఫెక్ట్, రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
Cyclone Dana Effect On AP : తూర్పుమధ్య బంగాళాఖాతంలో ‘దానా’ తుపాను కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి తెల్లవారుజాములోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా, ధమ్రా (ఒడిశా) సమీపంలో తీవ్ర తుపాను తీరం దాటే అవకాశం ఉందంది. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
తూర్పుమధ్య బంగాళాఖాతంలో ‘దానా’ తుపాను కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో వాయువ్య దిశగా తుపాను కదులుతుందని వెల్లిడించింది. పారాదీప్ కు 460 కిమీ, ధమ్రాకు 490 కిమీ, సాగర్ ద్వీపానికి 540 కిమీదూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని ఐఎంపీ తెలిపింది.
రేపు(గురువారం) తెల్లవారుజామునకు వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్లుండి తెల్లవారుజాములోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా, ధమ్రా (ఒడిశా) సమీపంలో తీవ్ర తుపాను తీరం దాటే అవకాశం ఉందన్నారు.
రేపు(గురువారం) ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతమై ఉండి చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి గంటకు 80-100 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బలమైన ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతమై ఉండి చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి గురువారం రాత్రి వరకు గంటకు 80-100కిమీ వేగంతో వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. బలమైన ఈదురుగాలుల ప్రభావం నుంచి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
భారీగా రైళ్లు రద్దు
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుపాను ప్రభావంతో ఈస్ట్ కోస్టు రైల్వే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భారీగా రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటించారు. పలు రైళ్లను దారి మళ్లించారు. సుమారు 200 సర్వీసులను రద్దు, దారి మళ్లించినట్లు తెలిపారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో రైళ్లు రద్దు చేశారు. రద్దైన రైళ్ల వివరాలను ప్రయాణికులకు తెలియజేసేందుకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాయగడ రైల్వేస్టేషన్లలో హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో 08912746330, 08912744619, 8712641255, 7780787054 నంబర్లకు కాల్ చేసి రైళ్ల వివరాలను తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.
రద్దైన రైళ్లు
1. 03430 - మాల్దా టౌన్ - సికింద్రాబాద్ - 29.10.2024
2. 12551 -SMVT బెంగళూరు - కామాఖ్య - 26.10.2024
3. 12864 - SMVT బెంగళూరు - హౌరా - 23.10.2024
4. 18048 - వాస్కో డగామా షాలిమార్ - 27.10.2024
5. 18463 - భువనేశ్వర్ - KSR బెంగళూరు - 25.10.2024
6. 20896 - భువనేశ్వర్ రామేశ్వరం- 25.1.2024
7. 11020- భువనేశ్వర్ - CSMT ముంబై- 24.10.2024
8. 12829-MGR చెన్నై సెంట్రల్ భువనేశ్వర్- 25.10.2024
9. 22888- SMVT బెంగళూరు - హౌరా - 24.10.2024
10. 06087- తిరునెల్వేలి - షాలిమార్- 24.10.2024
11. 12830- భువనేశ్వర్ - MGR చెన్నై సెంట్రల్- 24.10.2024
12. 22606- తిరునెల్వేలి - పురూలియా- 23.10.2024
సంబంధిత కథనం