Prakasam District SSA Recruitment 2024 : సమగ్ర శిక్షా అభియాన్‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు
ప్రకాశం జిల్లాలో సమగ్ర శిక్షా అభియాన్‌లో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం ఆరు పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 24వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ పోస్టులకు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు మాత్రమే అర్హులవుతారు.
ప్రకాశం జిల్లాలో సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఎ) కార్యాలయంలో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు మాత్రమే అర్హులు. దరఖాస్తు దాఖలకు ఆఖరు తేదీ అక్టోబర్ 24గా నిర్ణయించారు.
సెక్టోరల్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్టోరల్ ఆఫీసర్ల హోదాకు సంబంధించిన కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్, ఇన్‌క్లూజివ్ ఎడ్యూకేషన్ కో ఆర్డినేటర్, ఆల్టర్‌నేటివ్ స్కూలింగ్ కో ఆర్డినేటర్ పోస్టులు ఉన్నాయి. ఇవే కాకుండా గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, పీఎల్‌జీ అండ్ ఎంఐఎస్ కో ఆర్డినేటర్, అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.
ఈ పోస్టులకు ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ యాజమాన్య పరిధిలోని స్కూల్స్‌లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు మాత్రమే అర్హులు. అర్హత, ఆసక్తి గల స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు ఈనెల 24వ తేదీ లోగా దరఖాస్తు దాఖలు చేయాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులతో ధ్రువీకరించిన దరఖాస్తును, అర్హత, అనుభవానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జిరాక్స్ కాపీలను జత చేసి జిల్లా సమగ్ర కార్యాలయంలో సమర్పించాలి.
పోస్టులు:
మొత్తం ఆరు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఐదు సెక్టోరల్ ఆఫీసర్ పోస్టులు కాగా, ఒకటి అసిస్టెంట్ సెక్టోరల్ ఆఫీసర్ పోస్టును భర్తీ చేస్తున్నారు. సెక్టోరల్ ఆఫీసర్ పోస్టుల్లో కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ (సీఎంవో) -1, ఇన్‌క్లూజివ్ ఎడ్యూకేషన్ (ఐఈ) కో ఆర్డినేటర్-1, ఆల్టర్‌నేటివ్ స్కూలింగ్ (ఏఎల్ఎస్) కో ఆర్డినేటర్ -1, గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (జీసీడీవో) -1, పీఎల్‌జీ అండ్ ఎంఐఎస్ కో ఆర్డినేటర్ -1 కాగా, అసిస్టెంట్ సెక్టోరల్ ఆఫీసర్ పోస్టుల్లో అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్ (ఏఎస్‌వో) -1 పోస్టులను భర్తీ చేస్తారు. గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (జీసీడీవో) పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు.
అర్హతలు…
1. కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ పోస్టుకు స్కూల్ అసిస్టెంట్‌గా ఎనిమిదేళ్ల అనుభవం, అలాగే స్కూల్ సబ్జెట్‌లో పోస్టు గ్రాడ్యూషన్ పూర్తి చేసి ఉండాలి.
2. ఇన్‌క్లూజివ్ ఎడ్యూకేషన్ (ఐఈ) కో ఆర్డినేటర్ పోస్టుకు స్కూల్ అసిస్టెంట్‌గా ఎనిమిదేళ్ల అనుభవం, అలాగే స్కూల్ సబ్జెట్‌లో పోస్టు గ్రాడ్యూషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే డీఈడీలో స్పెషల్ ఎడ్యూకేషన్, బీఈడీ, లేదంటే స్పెషల్ ఎడ్యూకేషన్‌లో 90 రోజుల ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
3. ఆల్టర్‌నేటివ్ స్కూలింగ్ (ఏఎల్ఎస్) కో ఆర్డినేటర్ పోస్టుకు స్కూల్ అసిస్టెంట్‌గా ఎనిమిదేళ్ల అనుభవం, అలాగే స్కూల్ సబ్జెట్‌లో పోస్టు గ్రాడ్యూషన్ పూర్తి చేసి ఉండాలి.
4. గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (జీసీడీవో) పోస్టుకు స్కూల్ అసిస్టెంట్‌గా ఎనిమిదేళ్ల అనుభవం, అలాగే స్కూల్ సబ్జెట్‌లో పోస్టు గ్రాడ్యూషన్ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు మహిళలకు మాత్రమే అవకాశం.
5. పీఎల్‌జీ అండ్ ఎంఐఎస్ కో ఆర్డినేటర్ పోస్టుకు స్కూల్ అసిస్టెంట్‌గా ఎనిమిదేళ్ల అనుభవం, గుర్తింపు పొందిన యూనివర్శటీ, సంస్థల్లో మ్యాథమిటిక్స్, స్టాటస్టిక్స్‌లో పోస్టు గ్రాడ్యూషన్, కంప్యూటర్స్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
6. అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్ (ఏఎస్‌వో) పోస్టుకు స్కూల్ అసిస్టెంట్‌గా ఐదేళ్ల అనుభవం, గుర్తింపు పొందిన యూనివర్శటీ, సంస్థల్లో మ్యాథమిటిక్స్, స్టాటస్టిక్స్‌లో పోస్టు గ్రాడ్యూషన్, కంప్యూటర్స్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు దాఖలుచేసేందుకు అక్టోబర్ 18 నాటికి 55 ఏళ్లకంటే తక్కువ వయస్సు ఉండాలి. అలాగే దరఖాస్తు చేసే అభ్యర్థులకు కనీస కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. సమగ్ర శిక్ష అభియాన్ (డీపీఈపీ, ఆర్‌వీఎం, ఎస్ఎస్ఏ)లో ఐదేళ్ల డిప్యూటేషన్ ప్రాతిపధిక పని చేసే వారు సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు.
అప్లికేషన్ దాఖలు చేయాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింకు https://cdn.s3waas.gov.in/s3f3f27a324736617f20abbf2ffd806f6d/uploads/2024/10/2024101984.pdf క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకుని, దరఖాస్తులోని ఖాళీలను పూర్తి చేసి, సంబంధిత ధ్రువీకరణ పత్రాల జెరాక్స్ కాపీలను జత చేసి జిల్లా సమగ్ర కార్యాలయంలో సమర్పించాలి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జారజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.