PGCIL Trainee Recruitment 2024: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు పీజీసీఐఎల్ అధికారిక వెబ్సైట్ powergrid.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 795 డిప్లొమా ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు 2024 అక్టోబర్ 22 వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 నవంబర్ 12. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.
పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇక్కడ అందుబాటులో ఉన్న వివరణాత్మక నోటిఫికేషన్ ద్వారా విద్యార్హత, వయోపరిమితిని తనిఖీ చేయవచ్చు.
అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), కంప్యూటర్ స్కిల్ టెస్ట్ (CST), ప్రీ ఎంప్లాయిమెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. మెరిట్ క్రమంలో, అవసరాన్ని బట్టి తగిన అభ్యర్థులకు నియామక ఆఫర్ జారీ చేస్తారు.
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్-ఎస్ఎం అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు పీజీసీఐఎల్ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.