TG Staff Nurse Recruitment 2024 : స్టాఫ్ నర్స్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - రాత పరీక్ష తేదీ మార్పు, వివరాలివే-telangana staff nurse recruitment 2024 exam date changed latest updates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Staff Nurse Recruitment 2024 : స్టాఫ్ నర్స్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - రాత పరీక్ష తేదీ మార్పు, వివరాలివే

TG Staff Nurse Recruitment 2024 : స్టాఫ్ నర్స్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - రాత పరీక్ష తేదీ మార్పు, వివరాలివే

TG Staff Nurse Notification Updates : తెలంగాణ సర్కార్ 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పరీక్ష తేదీకి సంబంధించి అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 17వ తేదీ కాకుండా…23వ తేదీన ఎగ్జామ్ ఉంటుందని పేర్కొన్నారు.

స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ - రాత పరీక్ష తేదీ మార్పు

స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ వైద్యారోగ్యశాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయగా… ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 5 గంటలతో అప్లికేషన్ గడువు కూడా ముగియనుంది. అక్టోబర్ 16, 17 తేదీల్లో దరఖాస్తులను ఎడిట్ చేసుకునే వీలు ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా రూ. 500 చెల్లించాలి. ఈ కేటగిరీ కింద ఎలాంటి ఫీజు మినహాయింపు లేదు.

రాత పరీక్ష తేదీ మార్పు…

వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాల ప్రకారం… నవంబర్ 17వ తేదీన రాత పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ తేదీని మార్పు చేస్తున్నట్లు అధికారులు తాజాగా మరో ప్రకటన విడుదల చేశారు. 17వ తేదీన కాకుండా నవంబర్ 23వ తేదీన నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు ఈ మార్పును గమనించాలని కోరారు. సీబీటీ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు.

2050 ఉద్యోగాలు….

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 2050 నర్సింగ్‌ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ మెడికల్ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో 1576 ఖాళీలు ఉండగా.. వైద్య విధాన పరిషత్ లో 332 పోస్టులు ఉన్నాయి. ఇక ఆయుష్ శాఖలో 61 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో 1 నర్సింగ్ ఆఫీసర్ ను భర్తీ చేయనున్నారు. ఎంఎన్జీ క్యాన్సర్ ఆసుపత్రిలో 80 మంది నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేస్తారు. అన్ని కలిపి 2050 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

రిక్రూట్ మెంట్ ఇలా….

అభ్యర్థులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో పొందిన మార్కుల శాతానికి గరిష్టంగా 80 పాయింట్లు(80 మార్కులకు పరీక్ష నిర్వహణ), మిగిలిన 20 పాయింట్లు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో సేవలు(కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆసుపత్రులు/ సంస్థలు/ కార్యక్రమాలు) అందించిన వారికి కేటాయిస్తారు.

NOTE : ఈ లింక్ పై క్లిక్ చేసి స్టాఫ్ నర్సింగ్ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు.

త్వరలోనే మరో నోటిఫికేషన్:

రాష్ట్రంలోని కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ పరిధిలోని ఉన్న ESI ఆస్పత్రుల్లో కూడా ఖాళీలను భర్తీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఆర్థిక శాఖ ఇచ్చిన అనుమతుల ప్రకారం.. మొత్తం 600 ఖాళీలను భర్తీ చేస్తారు.

ఇందులో అత్యధికంగా 272 స్టాఫ్ నర్సుల పోస్టులు న్నాయి. ఆ తర్వాత సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు 124గా పేర్కొన్నారు.గ్రేడ్‌-2 ఫార్మాసిస్ట్‌ 99 ఖాళీలు ఉండగా…ల్యాబ్‌టెక్నీషియన్‌ ఉద్యోగాలు 34 ఉన్నాయి. డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లు 7, ANM 54 ఖాళీలు ఉండగా.. రేడియోగ్రాఫర్‌ 5, మూడు డెంటల్‌ టెక్నీషియన్ ఖాళీలు ఉన్నాయి.ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌ ఒకటి ఉండగా డెంటల్‌ హైజనిస్ట్ ఒక్క ఖాళీ ఉంది.

త్వరలోనే వీటి భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.ఈ ఉద్యోగాలను వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు(MHSRB) ద్వారానే భర్తీ చేయనున్నారు.

సంబంధిత కథనం