Hyderabad ESIC Jobs : హైదరాబాద్ ఈఎస్ఐసీలో 146 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ఇంటర్వ్యూలు ఎప్పుడంటే?
Hyderabad ESIC Jobs : హైదరాబాద్ సనత్ నగర్ లోని ఈఎస్ఐసీలో 146 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చని అధికారులు తెలిపారు.
Hyderabad ESIC Jobs : హైదారాబాద్‌లోని ఈఎస్ఐసీలో కాంట్రాక్టు ప్రాతిపదికన 146 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్/ట్యూటర్, స్పెషలిస్ట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 వరకు వాక్-ఇన్- ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ,ఎస్టీ,మహిళలు, ఎక్స్ సర్వీస్‌మెన్, దివ్యాంగ అభ్యర్థులు దరఖాస్తుకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
ఇంటర్వ్యూలు ఎప్పుడంటే?
హైదరాబాద్ సనత్ నగర్ లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ఫ్యాకల్టీ, స్పెషాలిటీలు, ఇతర పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈఎస్ఐసీ అధికారిక వెబ్‌సైట్ esic.gov.in లో నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం డిపార్ట్‌మెంట్ల వారీగా అభ్యర్థులకు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 08 వరకు ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేశారు. అయితే అభ్యర్థులు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఉద్యోగానికి అర్హతను నిర్థారించుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
- ఫ్యాకల్టీ- 55
- సూపర్ స్పెషలిస్ట్-05
- స్పెషలిస్ట్- 02
- సీనియర్ రెసిడెంట్-78
- ట్యూటర్లు-06
వయోపరిమితి వివరాలు
ఫ్యాకల్టీ పోస్టులకు నిబంధనల ప్రకారం టీచీంగ్ అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 69 ఏళ్లు మించకూడదు. వయో సడలింపు ఉంటుంది. సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవెల్/ సీనియర్ లెవెల్) పోస్టులకు ఎంబీబీఎస్ అర్హత సాధించాలి. అభ్యర్థుల వయోపరిమితి 74 ఏళ్లు మించకూడదు. సీనియర్ రెసిడెంట్, ట్యూటర్ పోస్టుల భర్తీకి టీచీంగ్ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి సీనియర్ రెసిడెంట్ పోస్టులకు 45 సంవత్సరాలు కాగా, ట్యూటర్లకు 37 ఏళ్లు మించకూడదు. నిబంధనల ప్రకారం అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది. స్పెషలిస్ట్ ఉద్యోగాలకు ఎంబీబీఎస్ అర్హత సాధించాలి. వయోపరిమితి 69 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీలు
ఇంటర్వ్యూలను జనవరి 29, జనవరి 30, 31, ఫిబ్రవరి 1, 2, 3, 5, 6, 7,8 తేదీల్లో నిర్వహించనున్నారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ రోజున అభ్యర్థుల ఉదయం 9 నుంచి 10.30 లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన విద్యార్హత, వయోపరిమితిని కలిగి ఉండాలి. సెలక్షన్ బోర్డ్ ముందు ఇంటర్వ్యూలో అభ్యర్థి పనితీరు ఆధారంగా ఎంపిక చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ ఆఫర్ అందిస్తుంది.
ఇంటర్వ్యూలు ఎక్కడంటే?
ఇంటర్వ్యూలను హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలోని అడకమిక్ బ్లాక్ లో నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఈఎస్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ నుంచి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాదిలో జనవరి - ఫిబ్రవరి సెషన్ కు సంబంధించిన ప్రకటన వచ్చింది. దూర విద్యా ద్వారా డిగ్రీ, పీజీ, లైబ్రరీ సైన్స్, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. జనవరి 31, 2024 వరకు గడువు విధించారు. www.braouonline.in, www.braou.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను చెక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.