Andhra Pradesh News Live October 15, 2024: Bhuma Akhila Priya Vs SV Jagan : కర్నూల్ జిల్లాలో మామకోడళ్ల వార్, కుర్చీలో నుంచి కదపండి చూద్దామని వార్నింగ్
15 October 2024, 22:35 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Bhuma Akhila Priya Vs SV Jagan : కర్నూలు జిల్లాలో మామకోడళ్ల వార్ నడుస్తుంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ నంద్యాల విజయ డెయిరీ పర్యటన ఉద్రిక్తంగా మారింది. డెయిరీలో వైఎస్ జగన్ ఫొటోలు ఉండడం, ఎన్టీఆర్ శిలాఫలకం తొలగించడంపై అఖిలప్రియ, ఎస్వీ జగన్ మధ్య వాగ్వాదం జరగింది.
Sathya Sai Accident : శ్రీ సత్యసాయి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య సీమంతం జరిగిన మరుసటి రోజే భర్త మృతి చెందాడు. తల్లిదండ్రులు, భార్యను బస్సులో పంపి, అతడు బైక్ వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
- 99 liquor Brand: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం బ్రాండ్ వచ్చేసింది. కూటమి హామీ ఇచ్చినట్టు చౌక మద్యం ఎంట్రీ ఇచ్చేసింది. రూ.99 క్వార్టర్ బ్రాండ్‌గా కేరళా మాల్టెడ్ ఫైన్ విస్కీ ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు ఏపీలో అన్ని బ్రాండ్లపై 2శాతం అదనంగా సెస్ విధిస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
CSIR UGC NET 2024 Results : సీఎస్ఐఆర్, యూజీసీ జాయింట్ నెట్ ఎగ్జామ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ లో అభ్యర్థులు స్కోర్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రోల్ నంబర్, పుట్టిన తేదీతో లాగిన్ అవ్వాలి. అభ్యర్థుల మార్కులు, క్వాలిఫై వివరాలు స్కోర్ కార్డులపై పేర్కొన్నారు.
DGP Dwaraka Tirumalarao : వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డిపై లుకౌట్ నోటీసు ఉందని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఒక కేసు విషయంలో గుంటూరు జిల్లా ఎస్పీ...సజ్జలకు లుకౌట్ నోటీసు జారీ చేశారన్నారు. ఈ కేసులో సజ్జలను చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.
AP Rains Schools Holiday : రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్ష సూచన చేసింది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
Prakasam Jobs : ప్రకాశం జిల్లా మహిళా,శిశు సంక్షేమ కార్యాలయంలో 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 21 నాటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు.
AP Liquor Tender 2024 : ఏపీలో మద్యం షాపుల లక్కీ డ్రాలో దుకాణాల పొందిన వారిపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. రంగంలోకి దిగిన సిండికెట్లు...షాపుల విజేతలకు భారీ ఆఫర్లు ఇస్తున్నారు. ఒక్కో చోట రూ.1 కోటి వరకు ఆఫర్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల వాటాలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు.
- AP Wine Shop Tenders 2024 : ఏపీలో వైన్ షాపుల టెండర్లు, లాటరీ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ ప్రక్రియలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వారికి భారీగా మద్యం దుకాణాలు దక్కాయి. ఏపీలో ఎక్కువ డిమాండ్ ఉన్న వైన్ షాపులు తెలంగాణ వారికి దక్కడం విశేషం.
LIC Jeevan Anand Policy : ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో రోజుకు కేవలం రూ.45 పెట్టుబడి పెడితే... రూ. 25 లక్షలు పొందవచ్చు. దీంతో పాటు జీవితాంతం బీమా కవరేజీ పొందవచ్చు. ఇందులో టర్మ్ పాలసీ, బోనస్, డెత్ బెనిఫిట్, యాక్సిడెంటల్ డెత్, డిసెబిలిటీ రైడర్ లు కూడా ఉన్నాయి.
- AP Liquor Shop : ఏపీలో రేపటి నుంచి కొత్త వైన్ షాప్‌లు ప్రారంభం కానున్నాయి. ఇందు కోసం మద్యం దుకాణాలను దక్కించుకున్నవారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. తాడేపల్లిలో మద్యం వ్యాపారులకు చుక్కెదురైంది. ఆశ్రమం రోడ్డులో ఏర్పాటు చేయబోయే వైన్ షాపును అక్కడి మహిళలు అడ్డుకున్నారు.
- AP Incharge Ministers: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత జిల్లాలకు ఇంఛార్జి మంత్రులను నియమించారు. 26 జిల్లాలకు మంత్రులను బాధ్యతలు అప్పగించారు. నలుగురు మంత్రులకు రెండేసి జిల్లాల బాధ్యతలు అప్పగించారు.
- AP Transport Department: ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖలో కొత్త రగడ మొదలైంది. ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదం కొనసాగుతుండగానే రవాణా శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదం అయ్యాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా కమిషనర్ ఏకపక్ష ఆదేశాలపై ఉద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- Government Schools: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలలోని ప్రభుత్వ పాఠశాలలలో 2024-2025 విద్యా సంవత్సరంలో 7, 10 వ తరగతి చదువుతున్న ప్రతిభా వంతులైన విద్యార్థులను గుర్తించి లక్షలాది రుపాయల నగదు బహుమతులతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
- Minister Narayna: ఏపీ మద్యం దుకాణాల వేలంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రమంతటా మద్యం దుకాణాల సిండికేట్లను రాజకీయ నాయకులు శాసిస్తే, నెల్లూరులో మంత్రి నారాయణ తరపున వేసిన దరఖాస్తులకు దక్కిన మద్యం దుకాణాలను అనుచరులకు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.
- AP Wine Shop Tenders 2024 : ఏపీలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ పూర్తయ్యింది. రేపటి నుంచి కొత్త వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో.. మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియపై మాజీ సీఎం జగన్ చంద్రబాబుకు 7 ప్రశ్నలు సంధించారు. మద్యం మాఫీయాకు ఏపీ అడ్డాగా మారిందని ఆరోపించారు.
- AP TET SGT Key: ఏపీలో టెట్ 2024 పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. టెట్ పరీక్షలు పూర్తైన వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టెట్ పరీక్షలు ఇప్పటికే పది రోజులుగా జరుగుతున్నాయి. దీంతో నేడు ఎస్జీటీకి సంబంధించిన కీ విడుదల చేయనున్నారు.
- AP LAWCET Counselling 2024: ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన లాసెట్- 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. లాసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 20 లోపు కౌన్సెలింగ్, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కన్వీనర్ సూచించారు.
- AP Rains Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడనుంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురవనున్నాయి. మరోవైపు అల్పపీడనం తమిళనాడు, ఆంధ్ర తీరాల వైపు దూసుకొస్తుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. నష్టాన్ని తగ్గించేందుకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.
- AP TG Roads: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీలో 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ.400, తెలంగాణలో నాలుగు లైన్ల బైపాస్ నిర్మాణానికి రూ.516 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితీన్ గడ్కరీ వెల్లడించారు.
- Vizianagaram: ఉత్తరాంధ్రా ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం 40 రోజుల పాటు నిర్విరామంగా జరుగుతోంది. లక్షలాది మంది ప్రజలు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అక్టోబర్ 30 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.