Bhuma Akhila Priya Vs SV Jagan : కర్నూల్ జిల్లాలో మామకోడళ్ల వార్, కుర్చీలో నుంచి కదపండి చూద్దామని వార్నింగ్-kurnool political heat mla bhuma akhila priya vs vijaya dairy chairman sv jagan oral debate ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bhuma Akhila Priya Vs Sv Jagan : కర్నూల్ జిల్లాలో మామకోడళ్ల వార్, కుర్చీలో నుంచి కదపండి చూద్దామని వార్నింగ్

Bhuma Akhila Priya Vs SV Jagan : కర్నూల్ జిల్లాలో మామకోడళ్ల వార్, కుర్చీలో నుంచి కదపండి చూద్దామని వార్నింగ్

Bandaru Satyaprasad HT Telugu
Oct 15, 2024 10:36 PM IST

Bhuma Akhila Priya Vs SV Jagan : కర్నూలు జిల్లాలో మామకోడళ్ల వార్ నడుస్తుంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ నంద్యాల విజయ డెయిరీ పర్యటన ఉద్రిక్తంగా మారింది. డెయిరీలో వైఎస్ జగన్ ఫొటోలు ఉండడం, ఎన్టీఆర్ శిలాఫలకం తొలగించడంపై అఖిలప్రియ, ఎస్వీ జగన్ మధ్య వాగ్వాదం జరగింది.

కర్నూల్ జిల్లాలో మామకోడళ్ల వార్, కుర్చీలో నుంచి కదపండి చూద్దామని వార్నింగ్
కర్నూల్ జిల్లాలో మామకోడళ్ల వార్, కుర్చీలో నుంచి కదపండి చూద్దామని వార్నింగ్

కర్నూలు జిల్లాలో రాజకీయం హీటెక్కింది. మామ వర్సెస్ కోడలు సవాళ్లు కొనసాగుతున్నాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ...మంగళవారం నంద్యాల పర్యటించారు. ఈ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే అఖిల ప్రియ, ఆమె మామ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఫోన్ సంభాషణ నెట్టింట వైరల్ అవుతుంది. టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాలలో ఉన్న విజయ పాల డెయిరీని మంగళవారం తనిఖీ చేశారు. అయితే డెయిరీలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటోలు ఉండటంపై అఖిల ప్రియ అభ్యంతరం వ్యక్తం చేశారు.

విజయ డెయిరీలో వైఎస్ జగన్ ఫొటోలు

ప్రభుత్వ మారిన తర్వాత కూడా జగన్ ఫొటోలు పెట్టడం ఏంటని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి, జగన్ ఫొటోలు తొలగించి, సీఎం చంద్రబాబు ఫొటోలను ఉంచారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ శిలాఫలకాన్ని తొలగించి పక్కన పడేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అఖిల ప్రియ...ఆ శిలఫలాకాన్ని తీసి పాలాభిషేకం చేశారు. శిలాఫలకం తొలగించిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

శిలాఫలకాన్ని తొలగించిన వైసీపీ నేత, విజయ డెయిరీ ఛైర్మన్‌ ఎస్వీ జగన్ మోహన్‌రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అఖియ ప్రియ డిమాండ్ చేశారు. ప్రొటోకాల్ విస్మరించి ఎన్టీఆర్‌ పేరున్న శిలాఫలకం తొలగించడం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. విజయ డెయిరీ వద్ద పక్కన పెట్టిన శిలాఫలకానికి అఖిల ప్రియ పాలాభిషేకం చేశారు. అనంతరం విజయ డెయిరీ ఆఫీసుల ఎండీతో మాట్లాడుతున్న సమయంలో అఖిల ప్రియకు డెయిరీ ఛైర్మన్‌, తన మామ ఎస్వీ జగన్‌ మోహన్‌ రెడ్డి నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.

నన్ను కుర్చీలో నుంచి కదపండి చూద్ధాం- ఎస్వీ జగన్ వార్నింగ్

తన సీట్లో ఎలా కూర్చుంటావని ఎమ్మెల్యే అఖిలప్రియను ఎస్వీ జగన్ ప్రశ్నించారు. కార్యాలయ సిబ్బంది కూర్చోమంటే కూర్చుకున్నానని ఆమె సమాధానం ఇచ్చారు. అయితే తనను అడగకుండా తన సీటులో కూర్చోవడానికి నువ్వెవరంటూ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. అందుకు అఖిల ప్రియ సమాధానం ఇస్తూ గతంలో మా కుర్చీలో మీరు కుర్చేలేదా అని ప్రశ్నించారు. 'ఏంటి బెదిరిస్తున్నావా? నన్ను కుర్చీలో నుంచి కదపండి చూద్దాం' అని అఖిల ప్రియకు జగన్ సవాల్ విసిరారు. మామ, కోడలి మధ్య ఫోన్ సంభాషణ కర్నూల్ రాజకీయాల్లో కాకపుట్టిస్తుంది.

మామగా ఫోన్ చేశావా? విజయ డైరీ ఛైర్మన్‌గా ఫోన్ చేశావా? అంటూ భూమా అఖిలప్రియ మామ ఎస్వీ జగన్ ను ప్రశ్నించారు. తన మామగా ఫోన్ చేస్తే సరే కానీ, డెయిరీ ఛైర్మన్ గా ఫోన్ చేస్తే కంప్లైంట్ చేసుకోవచ్చని సూచించారు. ఎన్టీఆర్ శిలాఫలకం తొలగింపుపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు అఖిలప్రియ. వైసీపీ నాయకులు ఇంకా భ్రమలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయ డెయిరీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వాటన్నింటిని బయటకు తీస్తామని స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం