AP LAWCET Counselling 2024: ఏపీ లాసెట్‌ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్-ap law cet counseling schedule released registration till 20th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Lawcet Counselling 2024: ఏపీ లాసెట్‌ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్

AP LAWCET Counselling 2024: ఏపీ లాసెట్‌ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 15, 2024 07:33 AM IST

AP LAWCET Counselling 2024: ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన లాసెట్- 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. లాసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 20 లోపు కౌన్సెలింగ్, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కన్వీనర్ సూచించారు.

ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ 2024 షెడ్యూల్‌ ఖరారు.
ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ 2024 షెడ్యూల్‌ ఖరారు.

AP LAWCET Counselling Schedule 2024 : ఏపీ లాసెట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్ ఖరారైంది. లాసెట్‌ అడ్మిషన్ల ప్రక్రియలో ఇప్పటికే ఆలస్యమైంది. ఏపీలో మూడేళ్లు, ఐదేళ్ళ ఎల్‌ఎల్‌బి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన లాసెట్- 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్‌‌ను కన్వీనర్‌ విడుదల చేశారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన లాసెట్- 2024లో అర్హత సాధించిన అభ్యర్థులంతా అక్టోబర్‌ 16 నుంచి 20 లోపు కౌన్సెలింగ్, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కన్వీనర్ సూచించారు. అక్టోబర్‌ 22 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల ద్వారా కళాశాలలు ఎంపిక చేసుకోవాలని, 26న మార్పులు చేసుకోడానికి అనుమతిస్తారు. 28న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. లాసెట్‌లో సీట్లు పొందిన విద్యా ర్థులు 29, 30 తేదీల్లో ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో న్యాయ కళాశాలాల్లో ప్రవేశాలకు సంబంధించి లాసెట్ 2024 నిర్వహించిన సంగతి తెలిసిందే. జూన్ 27వ తేదీన ఫలితాలు విడుదలయ్యాయి. కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు కావడంలో తీవ్ర జాప్యం జరిగింది. మిగిలిన పీజీ కోర్సులు పూర్తైన తర్వాత లాసెట్‌ అడ్మిషన్లు చేపట్టాలని భావించడంతో ఆలస్యమైంది. మరోవైపు తెలంగాణలో చూస్తే లాసెట్ ప్రవేశాల ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ప్రస్తుతం ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ నడుస్తోంది.

కౌన్సెలింగ్ ఎప్పుడు...?

గతేడాది చూస్తే ఏపీలో లాసెట్ కౌన్సెలింగ్ నవంబర్‌లో ప్రారంభమైంది. ఈసారి అక్టోబర్‌లోనే నిర్వహిస్తున్నారు. ఏపీ లాసెట్‌ను 19,224 మంది అభ్యర్థులు రాశారు. అందులో 17,117 మంది (89.04 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో రెండేళ్ల పీజీ కోర్స్ లో 99.51 శాతం, మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్స్ లో 89.74 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్స్ లో 80.06 శాతం ఉతీర్ణత సాధించారు. ఎంట్రెన్స్ లో పాస్ అయిన వారితో పాటు మేనేజ్ మెంట్ కోటాలో చేరాలనుకునే చాలా మంది అభ్యర్థులు... కౌన్సెలింగ్ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు.

లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించాలంటే ఆయా కాలేజీలకు బార్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఏపీలో కొన్నికాలేజీల అనుమతుల ప్రక్రియ కొనసాగడంతో షెడ్యూల్‌ విడుదలలో జాప్యం జరిగింది.

లాసెట్ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి…

-అభ్యర్థులు మొదటగా https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

-Download Rank Card అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

-Registration Number , Hall Ticket Number, పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.

-గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.

-ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.

-అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంత కీలకం.

ఈసారి విడుదలైన ఫలితాలను చూస్తే… రెండేళ్ల పీజీ కోర్సులో(LLM) పురుషులు 99.51 శాతం, స్త్రీలు 99.51 శాతం ఉత్తీర్ణత సాధించారు. మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో పురుషులు 91.28 శాతం, స్త్రీలు 86.26 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో పురుషులు 81.91 శాతం, స్త్రీలు 78.17 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Whats_app_banner