AP Incharge Ministers: 26 జిల్లాలకు ఇంఛార్జి మంత్రుల నియామకం, నలుగురికి 2 జిల్లాల బాధ్యతలు
AP Incharge Ministers: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత జిల్లాలకు ఇంఛార్జి మంత్రులను నియమించారు. 26 జిల్లాలకు మంత్రులను బాధ్యతలు అప్పగించారు. నలుగురు మంత్రులకు రెండేసి జిల్లాల బాధ్యతలు అప్పగించారు.
AP Incharge Ministers: ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలకు ఇంఛార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లాకు మంత్రి సవిత, తిరుపతి అనగాని సత్యప్రసాద్, శ్రీకాకుళం జిల్లాకు కొండపల్లి శ్రీనివాస్, విజయనగరంకు వంగలపూడి అనిత, కాకినాడకు నారాయణ, తూర్పు గోదావరి జిల్లాకు నిమ్మల రామానాయుడు, కోనసీమ జిల్లాకు అచ్చెన్నాయుడును నియమించారు.
కృష్ణా జిల్లాకు వాసంసెట్టి సుభాష్, గుంటూరుకు కందుల దుర్గేష్, బాపట్లకు పార్థ సారథి, కర్నూలు జిల్లాకు నిమ్మల రామానాయుడు, అనంతపురంకు టీజీ భరత్, చిత్తూరుకు రాంప్రసాద్ రెడ్డి, పార్వతీపురం జిల్లాకు అచ్చెన్నాయుడు, విశాఖకు డోలా బాల వీరాంజయనేయస్వామి, అల్లూరి జిల్లాకు గుమ్మడి సంధ్యారాణి , తూర్పుగోదావరికి నిమ్మలరామానాయుడులను నియమించారు.
ఏలూరుకు నాదెండ్ల, పశ్చిమకు గొట్టిపాటి, ఎన్టీఆర్ జిల్లాకు సత్యకుమార్, పల్నాడుకు గొట్టిపాటి, ప్రకాశంకు ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు ఫరూక్ అహ్మద్, నంద్యాలకు పయ్యావుల కేశవ్, శ్రీసత్యసాయి జిల్లాకు అనగాని, అన్నమయ్య కు బీసీ జనర్దాన్ రెడ్డి, పార్వతీపురం అచ్చెన్నాయుడు, అనకాపల్లికి కొల్లు రవీంద్రలను బాధ్యులుగా నియమించారు.
నలుగురు మంత్రులకు రెండేసి జిల్లాల బాధ్యతలు అప్పటించారు. సత్యసాయి, తిరుపతి జిల్లాలకు అనగాని సత్యప్రసాద్,అచ్చన్నాయుడుకు పార్వతీపురం మన్యం, కోనసీమ జిల్లాలు, నిమ్మలకు తూర్పు, కర్నూలు బాధ్యతలు, గొట్టిపాటికి పశ్చిమ, పల్నాడు జిల్లాలు బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ సిఎం పవన్, లోకేష్ లకు జిల్లా బాధ్యతలు అప్పగించలేదు. ఏలూరు, గుంటూరు జిల్లాలకు జనసేన మంత్రిని, బీజేపీ మంత్రికి ఎన్టీఆర్ జిల్లా కేటాయించారు.