AP TET SGT Key: కొనసాగుతున్న ఏపీ టెట్ 2024 పరీక్షలు, నేడు ఎస్జీటీ కీ విడుదల, 18వరకు అభ్యంతరాల స్వీకరణ-ongoing ap tet 2024 exams sgt key released today objections accepted till 18 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet Sgt Key: కొనసాగుతున్న ఏపీ టెట్ 2024 పరీక్షలు, నేడు ఎస్జీటీ కీ విడుదల, 18వరకు అభ్యంతరాల స్వీకరణ

AP TET SGT Key: కొనసాగుతున్న ఏపీ టెట్ 2024 పరీక్షలు, నేడు ఎస్జీటీ కీ విడుదల, 18వరకు అభ్యంతరాల స్వీకరణ

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 15, 2024 08:19 AM IST

AP TET SGT Key: ఏపీలో టెట్ 2024 పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. టెట్‌ పరీక్షలు పూర్తైన వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టెట్‌ పరీక్షలు ఇప్పటికే పది రోజులుగా జరుగుతున్నాయి. దీంతో నేడు ఎస్జీటీకి సంబంధించిన కీ విడుదల చేయనున్నారు.

నేడు ఏపీ టెట్‌ ఎస్జీటీ కీ విడుదల
నేడు ఏపీ టెట్‌ ఎస్జీటీ కీ విడుదల

AP TET SGT Key: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పదో రోజు జరిగిన పరీక్షల్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పరీక్షలు నిర్వహించారు. దసరా పండుగ నేపథ్యంలో రెండు రోజుల విరామం తర్వాత సోమవారం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు విభాగంలో ఉదయం జనరల్ అభ్యర్థులకు, మధ్యాహ్నం పేపర్ 2 ఏ మాథ్స్ & సైన్స్ అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి.

ఈ పరీక్షలలో మొత్తం 21203 మందికి గాను 17937 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పదో రోజు హాల్‌ టిక్కెట్లు జారీ చేసిన వారిలో 84.59 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 24 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 5460 మందికి గాను 4830 మంది అనగా 88.46 శాతం మంది హాజరయ్యారు.

మధ్యాహ్నం 61 సెంటర్లలో పేపర్ 2 ఏ.మాథ్స్ & సైన్స్ అభ్యర్థుల ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు 15743 మందికి గాను13107 మంది అనగా 83.29 శాతం మంది హాజరయ్యారు. పదవ రోజు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి.

నేటి నుంచి అందుబాటులో కీ, రెస్పాన్స్‌ షీట్లు..

సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లతో పాటు ప్రైమరీ కీను నేటి నుంచి వెబ్సైటులో అందుబాటులో ఉంచుతారు . ప్రాధమిక కీ పై అభ్యర్థుల నుండి అభ్యంతరాలను అక్టోబర్‌ 18వరకు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. ప్రైమరీ కీపై అభ్యంతరాలను https://aptet.apcfss.in/ ద్వారా మాత్రమే స్వీకరిస్తారని ఏపీ టెట్ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి తెలియజేసారు.

ఆంధ్రప్రదేేశ్‌ టెట్ 2024 పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల ఒక సెషన్‌, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు జరుగుతాయి.

ఏపీలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష- టెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.

అక్టోబర్ 3 నుంచి 21 వరకు రోజుకు రెండు సెషన్లలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు హాజరయ్యే వికలాంగులకు అదనంగా సమయం కేటాయిస్తారు. సొంతంగా పరీక్షలు రాయలేని 813 మంది వికలాంగులు పరీక్ష రాయడానికి సహాయకులను ఏర్పాటు చేసుకున్నారు. పరీక్షా సమయానికి గంటన్నర ముందుగానే కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్‌ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి తమతో తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. టెట్‌ అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తమతో తీసుకువెళ్లడానికి అనుమతించరు. అభ్యర్థులు ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో హాల్ టికెట్లను పొంది ఉంటే ఏదో ఒక కేంద్రంలో మాత్రమే హాజరుకావాల్సి ఉంటుంది. హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే పరీక్షా కేంద్రంలోని డిపార్టుమెంట్ అధికారికి ఆధారాలు చూపించి, వాటిని సరిచేసుకునే సదుపాయం కల్పించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు.

ఏపీ టెట్‌ 2024 పరీక్షకు 4,27,300 దరఖాస్తు చేసుకున్నారు. వారిలో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నవారు: 4,09,955 మంది ఉన్నారు. మొత్తం 108 పరీక్షా కేంద్రాల్లో టెట్‌ నిర్వహిస్తారు. ఏపీలోని 22 జిల్లాల్లో 95 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బరంపురం, గంజాంలో ఏర్పాటు చేసిన కేంద్రాలు 13 ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో పరీక్ష రాసేవారు 24,396 మంది ఉన్నారు.

Whats_app_banner