LIC Jeevan Anand Policy : ఈ ఎల్ఐసీ పాలసీలో ప్రతి రోజు రూ.42 పెట్టుబడితో రూ. 25 లక్షల రాబడి, పూర్తి వివరాలు ఇలా
LIC Jeevan Anand Policy : ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో రోజుకు కేవలం రూ.45 పెట్టుబడి పెడితే... రూ. 25 లక్షలు పొందవచ్చు. దీంతో పాటు జీవితాంతం బీమా కవరేజీ పొందవచ్చు. ఇందులో టర్మ్ పాలసీ, బోనస్, డెత్ బెనిఫిట్, యాక్సిడెంటల్ డెత్, డిసెబిలిటీ రైడర్ లు కూడా ఉన్నాయి.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) వినియోగదారులకు అందిస్తున్న లైఫ్ ఎండోమెంట్ ప్లాన్ జీవన్ ఆనంద్ పాలసీ. ఈ పాలసీతో పాలసీదారులకు అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పాలసీలో ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిన తర్వాత కూడా బీమా కవరేజీ కొనసాగుతుంది. ప్రతి రోజు కేవలం రూ. 45 పెట్టుబడి పెడితే పాలసీదారులు 35 ఏళ్లలో రూ. 25 లక్షల మొత్తాన్ని పొందవచ్చు. ఇందులో టర్మ్ పాలసీ, బోనస్, డెత్ బెనిఫిట్‌లను మాత్రమే కాకుండా అదనంగా యాక్సిడెంటల్ డెత్ , డిసెబిలిటీ రైడర్‌తో సహా అదనపు రైడర్‌లను కూడా అందిస్తుంది.
జీవన్ ఆనంద్ పాలసీలో అనువైన ప్రీమియం చెల్లింపు ఎంపికతో పాటు, రెండేళ్ల కాలపరిమితితో సరెండర్ చేయవచ్చు. ఈ పాలసీతో సురక్షితమైన ఆర్థిక ప్రణాళికతో పాటు తగినంత రాబడి, లైఫ్ కవర్ హామీ లభిస్తుంది. ప్రమాదవశాత్తు పాలసీదారుడు మరణిస్తే ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ రూ. 5 లక్షల వరకు అదనపు కవరేజీని అందిస్తుంది. ప్రమాదంలో శాశ్వత వైకల్యానికి దారితీసినట్లయితే విడతల వారీగా బీమా మొత్తాన్ని పాలసీదారుడికి అందిస్తారు.
ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ ప్లాన్ వివరాలు
- ఎండోమెంట్ పాలసీ : అదనపు బోనస్‌లతో పాటు పాలసీదారుడికి హామీ ఇచ్చిన మొత్తాన్ని అందిస్తారు.
- మెచ్యూరిటీ ప్రయోజనాలు: పాలసీదారుడు పూర్తి కాలం ప్రీమియం చెల్లిస్తే మెచ్యూరిటీ ప్రయోజనాలు లభిస్తాయి.
- డెత్ బెనిఫిట్స్ : పాలసీదారు మరణిస్తే నామినీకి హామీ ఇచ్చిన మొత్తాన్ని చెలిస్తారు.
- టాప్-అప్ కవర్ : చాలా తక్కువ మొత్తానికి అదనపు టాప్-అప్ కవర్‌లను అందిస్తారు.
- జీవితకాల ఆర్థిక రక్షణ: బీమా చేసుకున్న వ్యక్తి మొత్తం జీవితకాలానికి ఆర్థిక భద్రతను లభిస్తుంది.
- లంప్ సమ్ పేమెంట్: ఎంచుకున్న టర్మ్ పీరియడ్ ముగింపులో ఒకేసారి అధిక మొత్తాన్ని పొందవచ్చు.
- ప్రవేశ వయస్సు : కనీస ప్రవేశ వయస్సు 18 సంవత్సరాలు, గరిష్టంగా 50 సంవత్సరాలు
- ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో ప్రతి నెలా రూ. 1,358 ప్రీమియం చెల్లిస్తే 35 ఏళ్లలో రూ. 25 లక్షలను పొందవచ్చు. ప్రీమియం వ్యవధి 15 నుంచి 35 సంవత్సరాల వరకు ఉంటుంది.
జీవన్ ఆనంద్ పాలసీ బోనస్
ఈ పాలసీలో 35 సంవత్సరాల వ్యవధిలో రూ.5,70,500 మొత్తం డిపాజిట్ చేస్తే రూ.5 లక్షల హామీతో రెండు బోనస్‌లు లభిస్తాయి. మెచ్యూరిటీ తర్వాత పాలసీదారు డిపాజిట్ చేసిన మొత్తంపై అదనంగా రూ.8.60 లక్షల రివిజనరీ బోనస్, రూ.11.50 లక్షల తుది బోనస్‌కు పొందవచ్చు. ఈ బోనస్‌లకు అర్హత సాధించాలంటే 15 సంవత్సరాల కాలవ్యవధి ఉండాలి.
సంబంధిత కథనం