CSIR UGC NET 2024 Results : సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఫలితాలు విడుదల, స్కోర్ కార్డు డౌన్ లోడ్ ఇలా
CSIR UGC NET 2024 Results : సీఎస్ఐఆర్, యూజీసీ జాయింట్ నెట్ ఎగ్జామ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ లో అభ్యర్థులు స్కోర్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రోల్ నంబర్, పుట్టిన తేదీతో లాగిన్ అవ్వాలి. అభ్యర్థుల మార్కులు, క్వాలిఫై వివరాలు స్కోర్ కార్డులపై పేర్కొన్నారు.
సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ (CSIR UGC NET 2024) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ విడుదల చేసింది. జులై 25, 26, 27 తేదీల్లో దేశవ్యాప్తంగా 187 నగరాల్లో 348 కేంద్రాల్లో నెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 2,25,335 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఎలిజిబిటీ టెస్ట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://csirnet.nta.ac.in/ అధికారిక వెబ్ సైట్ లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. రోల్ నంబర్, సబ్జెక్ట్ వారీగా మార్కులు విడుదల చేశారు. నెట్ ఫలితాలను చెక్ చేసుకునేందుకు అభ్యర్థులు వారి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి వెబ్‌సైట్‌కి లాగిన్ చేయాలి. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షల అర్హత సాధించిన అభ్యర్థులు త్వరలో నెట్ సర్టిఫికేట్, జేఆర్ఎఫ్ అవార్డు లెటర్ ను అందుకుంటారు.
సైన్స్ సబ్జెక్టుల్లో రీసెర్చ్ కు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో జేఆర్‌ఎఫ్ అర్హత సాధిస్తే సీఎస్‌ఐఆర్ పరిధిలోని రీసెర్చ్ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. జేఆర్‌ఎఫ్ అర్హత పొందిన అభ్యర్థులు యూనివర్సిటీలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులు అవుతారు.
సీఎస్ఐఆర్ నెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి.
Step 1 : సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ అధికారిక వెబ్ సైట్ https://csirnet.nta.ac.in/ పై క్లిక్ చేయండి.
Step 2 : హోమ్‌పేజీలో సీఎస్ఐఆర్ స్కోర్ కార్డు లింక్ పై క్లిక్ చేయండి.
Step 3 : అభ్యర్థి రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
Step 4 : CSIR NET ఫలితాలు స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతాయి.
Step 5 : ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్ అవసరాలకు ప్రింట్ అవుట్ తీసుకోండి.
సీఎస్ఐఆర్ నెట్ స్కోర్ కార్డుపై సబ్జెక్ట్ వారీగా మార్కులు, మొత్తం మార్కులు, క్వాలిఫై, ర్యాంక్, కట్ ఆఫ్ వంటి వివరాలు పేర్కొన్నారు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వర్గాలకు కనీస అర్హత మార్కులు 33%, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వర్గాలకు 25% నిర్ణయించారు.ఈ ఏడాది 2,25,335 మంది అభ్యర్థులు సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష కోసం నమోదు చేసుకున్నారు. జులై 25 నుంచి జులై 27 వరకు జరిగిన పరీక్షకు 1,63,529 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఇవాళే యూజీసీ నెట్ ఫలితాలు
యూజీసీ నెట్ ఫలితాలను ఎన్టీఏ విడుదల చేయనుంది. ఇప్పటికే ఫైనల్ కీ విడుదల చేసింది. ఆన్సర్ కీ ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంది. జూన్ లో యూజీసీ నెట్ పరీక్షను నిర్వహించగా, పలు కారణాలతో రద్దు చేశారు. అనంతరం ఆగస్టు, సెప్టెంబర్ లో రీఎగ్జామ్స్ నిర్వహించారు. వీటికి సంబంధించి ప్రాథమిక , ఫైనల్ కీ విడుదల చేశారు.
సంబంధిత కథనం