యూజీసీ నెట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట@కు హాజరైన అభ్యర్థులు యూజీసీ నెట్ అధికారిక వెబ@సైట్ ద్వారా ఫైనల్ ఆన్సర్ కీని ugcnet.nta.ac.in డౌన@లోడ్ చేసుకోవచ్చు.
యూజీసీ నెట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకునేందుకు డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రకటించిన ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా ఫలితాలను రూపొందిస్తారు. యూజీసీ - నెట్ జూన్ 2024 ఫలితాలు/ఎన్టీఏ స్కోర్ ప్రకటించిన తర్వాత ఆన్సర్ కీ(లు)కు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించరని గుర్తుపెట్టుకోవాలి.
యూజీసీ నెట్ పరీక్షని ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4, 2024 వరకు నిర్వహించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. ప్రొవిజనల్ ఆన్సర్ కీని సెప్టెంబర్లో విడుదల చేయగా, అభ్యంతరాలు తెలిపేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 14, 2024గా నిర్ణయించారు. ఇక తాజాగా ఫైనల్ ఆన్సర్ కీ బయటకు వచ్చింది.
ఐఐటీ జామ్ 2025 రిజిస్ట్రేషన్ తేదీని ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పొడిగించింది. 2025 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో మాస్టర్స్ చేరాలనుకునే విద్యార్థులు ఐఐటీ ఢిల్లీ నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ కు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ ఐఐటీ జామ్ కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ jam2025.iitd.ac.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఐఐటీ జామ్ కు దరఖాస్తు చేసుకునే గడువును 2024 అక్టోబర్ 18 వరకు పొడిగించారు. పరీక్ష తేదీలు/ పరీక్ష పేపర్లు/ కేటగిరీ/ జెండర్ మార్చుకోవడానికి చివరి తేదీ 2024 నవంబర్ 18. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం