IIT JAM 2025: ఐఐటీల్లో పీజీ కోర్సులకు అప్లై చేశారా? ‘ఐఐటీ జామ్’ లాస్ట్ డేట్ ను పొడిగించారు. చూడండి..
IIT JAM 2025: భారత్ లోని వివిధ ఐఐటీ కాలేజీల్లో పోస్ట్ గ్యాడ్యుయేట్ కోర్సులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ను పొడిగించారు. ఐఐటీ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్ష ‘ఐఐటీ జామ్’ కు అక్టోబర్ 18వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
IIT JAM 2025: ఐఐటీ జామ్ 2025 రిజిస్ట్రేషన్ తేదీని ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పొడిగించింది. 2025 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో మాస్టర్స్ చేరాలనుకునే విద్యార్థులు ఐఐటీ ఢిల్లీ నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ కు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ ఐఐటీ జామ్ కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ jam2025.iitd.ac.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
లాస్ట్ డేట్
ఐఐటీ జామ్ కు దరఖాస్తు చేసుకునే గడువును 2024 అక్టోబర్ 18 వరకు పొడిగించారు. పరీక్ష తేదీలు/ పరీక్ష పేపర్లు/ కేటగిరీ/ జెండర్ మార్చుకోవడానికి చివరి తేదీ 2024 నవంబర్ 18. అడ్మిట్ కార్డును 2025 జనవరిలో అధికారిక వెబ్ సైట్లో అప్ లోడ్ చేస్తారు. వాటిని విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఐఐటీ జామ్ పరీక్ష 2024 ఫిబ్రవరి 2న జరగనుంది.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
జామ్ 2025 పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తారు. బయోటెక్నాలజీ (BT), కెమిస్ట్రీ (CY), ఎకనామిక్స్ (EN), జియాలజీ (GG), మ్యాథమెటిక్స్ (MA), మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ (MS), మరియు ఫిజిక్స్ (PH) సబ్జెక్టుల్లో మాస్టర్స్ కు అప్లై చేసుకోవచ్చు.
ఇలా రిజిస్టర్ చేసుకోవాలి
పరీక్షకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.
- ఐఐటీ జామ్ అధికారిక వెబ్సైట్ jam2025.iitd.ac.in ను సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఐఐటీ జామ్ 2025 రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.
- అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- సబ్మిట్ పై క్లిక్ చేసి కన్ఫర్మేషన్ పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.
దరఖాస్తు ఫీజు
దరఖాస్తు ఫీజుగా మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు ఒక టెస్ట్ పేపర్ కు రూ.900, రెండు టెస్ట్ పేపర్లకు రూ.1250 చెల్లించాలి. ఇతరులు అందరు ఒక టెస్ట్ పేపర్ కు రూ.1800, రెండు టెస్ట్ పేపర్లకు రూ.2500 చెల్లించాలి.
ఐఐటీల్లో సుమారు 3000 సీట్లు
ఐఐటీ జామ్ 2025 (IIT JAM 2025)లో అర్హత సాధించిన అభ్యర్థులు 2025-26 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లోని సుమారు 3000 సీట్లలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీరు వేరే ఏ ఇతర పరీక్ష రాయనవసరం లేదు. ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐఐటీ జామ్ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.