IIT JAM Result 2024: ఐఐటీ జామ్ ఫలితాలను ప్రకటించిన ఐఐటీ మద్రాస్; ఇలా చెక్ చేసుకోండి..
IIT JAM 2024 Results: ఐఐటీ జామ్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ జామ్ ఫలితాలను బుధవారం ఐఐటీ మద్రాసు విడుదల చేసింది.
IIT JAM 2024 Results: ఐఐటీ జామ్ 2024 ఫలితాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ విడుదల చేసింది. ఈ మాస్టర్స్ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ కు హాజరైన అభ్యర్థులు ఐఐటీ జామ్ అధికారిక వెబ్ సైట్ jam.iitm.ac.in లో ఫలితాలను చూసుకోవచ్చు. ఫైనల్ మార్కులతో పాటు ఫైనల్ ఆన్సర్ కీని కూడా ఇన్ స్టిట్యూట్ విడుదల చేసింది. నిజానికి ఐఐటీ జామ్ ఫలితాలు (IIT JAM 2024 Results) 2024 మార్చి 22న విడుదల కావాల్సి ఉండగా, రెండు రోజులు ముందుగానే, 2024 మార్చి 20న విడుదల చేశారు.
7 పేపర్లు
ఐఐటీ జామ్ 2024 (IIT JAM 2024) పరీక్షను 2024 ఫిబ్రవరి 11న నిర్వహించారు. ఈ పరీక్షలో బయోటెక్నాలజీ (BT), కెమిస్ట్రీ (CY), ఎకనామిక్స్ (EN), జియాలజీ (GG), మ్యాథమెటిక్స్ (MA), మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ (MS), ఫిజిక్స్ (PH) పేపర్లు ఉంటాయి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐఐటీ జామ్ అధికారిక వెబ్సైట్ jam.iitm.ac.inను చూడవచ్చు.
పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం..
వివిధ ఐఐటీల్లోని వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో అడ్మిషన్ల కోసం ఈ ఐఐటీ జామ్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఐఐటీ జామ్ 2024 పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఐఐటీల్లోని సుమారు 3,000 పీజీ సీట్లను, అలాగే, ఐఐఎస్సీ, ఎన్ఐటీ, షిబ్ పూర్ లోని ఐఐఎస్టీ , ఎస్ఎల్ఐఈటీ, డీఐఏటీల్లోని 2,000 సీట్లను భర్తీ చేస్తారు. ఐఐటీ జామ్ 2024 రాసిన అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో కావడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఐఐటీ జామ్ రిజల్ట్ 2024
- ముందుగా ఐఐటీ జామ్ అధికారిక వెబ్సైట్ jam.iitm.ac.in ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఐఐటీ జామ్ రిజల్ట్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- లాగిన్ వివరాలు నమోదు చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
- దాంతో, మీ రిజల్ట్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది.
- రిజల్ట్ చెక్ చేసుకుని పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.