తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jagan Plan For 2024 Poll : టీడీపీ ఛాలెంజ్ కు జగన్ ఓకే.. వచ్చే ఎన్నికలకు అదే అజెండా

Jagan Plan For 2024 Poll : టీడీపీ ఛాలెంజ్ కు జగన్ ఓకే.. వచ్చే ఎన్నికలకు అదే అజెండా

Anand Sai HT Telugu

18 September 2022, 14:53 IST

    • Andhra Pradesh Next Election : వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు జనాల్లోకి వెళ్తున్నాయి. ఎవరి అజెండాతో వాళ్లు జనాల్లోకి వెళ్తున్నారు. అయితే వైసీపీ మాత్రం టీడీపీ ఇచ్చిన ఛాలెంజ్ తో ప్రజల్లోకి  వెళ్లెలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ (twitter)

ఏపీ సీఎం జగన్

2024 ఎన్నికల్లో అధికార పోరాడేందుకు మూడు రాజధానుల అంశమే ప్రధాన నినాదమని జగన్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతి కంటే మూడు రాజధానులు ఎక్కువ మంది ఇష్టపడతారని వైసీపీ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం, ఇతర ప్రతిపక్షాలు దెబ్బ కొట్టేందుకు ఇదే సరైన పని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో వికేంద్రీకృత అభివృద్ధిపై చర్చ ద్వారా శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై మాటల దాడి చేయడం ద్వారా జగన్ మోహన్ రెడ్డి సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తమ ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

మూడు రాజధానులపై ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. ఈ సవాలును జగన్ సీరియస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో మూడు రాజధానులు వర్సెస్ అమరావతి అనే అంశంతో వైసీపీ, టీడీపీల అజెండాగా పోరు సాగుతుందని ఇప్పుడు స్పష్టమైంది.

ఏపీ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని ప్రధాన ప్రతిపక్షం గట్టిగా ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ ఆ ప్రాంత రైతుల పక్షాన నిలబడింది. ఈ సమస్యపై తిరుమల-తిరుపతి వరకు లాంగ్ మార్చ్‌కు మద్దతు ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం అమరావతి రైతులు చేపట్టిన అమరావతి-అరసవల్లి పాదయాత్రకు ఇతర ప్రతిపక్ష పార్టీలతో పాటు తెలుగుదేశం కూడా మద్దతు పలుకుతోంది. ఈ పాదయాత్ర గుంటూరు, కృష్ణా జిల్లాల మీదుగా కూడా పెద్దగా నిరసనలు ఎదుర్కోకుండా సాఫీగా సాగింది.

అయితే ప్రతిపక్షాల విమమర్శలకు సమాధానం చెప్పి.. తమ నిర్ణయం సరైనదేనని చెప్పేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మిషన్ 2024లో భాగంగా మూడు రాజధానుల అంశాన్ని ఎన్నికల ముందు ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉంది. ఇదే వ్యూహంతో మూడు రాజధానుల అజెండాతో ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.

2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి నవరత్నాలే ప్రధాన అజెండా. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో చాలా వరకు నెరవేర్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల అజెండాగా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి కొత్త హాట్ టాపిక్ కావాలి. మూడు రాజధానుల ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఉత్తర ఆంధ్ర, రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రజలను ఆకర్షిస్తుందని నమ్మకం. ఇంకా, ఏపీకి శాసనసభ రాజధానిగా అమరావతి కొనసాగుతుందని వైసీపీ మెుదటి నుంచి చెబుతూనే ఉంది.

ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. 2024 ఎన్నికల్లో మూడు రాజధానుల ద్వారా అభివృద్ధి అని తమ ప్రధాన అజెండాతో వైసీపీ ముందుకు వెళ్తుంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్‌లు, ఇతర నేతలు కూడా మూడు రాజధానులు తమ ప్రభుత్వ విధానమని, దానిని అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూడు రాజధానులు అంటే సర్వతోముఖాభివృద్ధి చెబుతున్నారు.