Chandrababu | పులివెందులలో బస్ స్టాండ్ కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారా?-chandrababu naidu comments on cm jagan in kurnool tour ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu | పులివెందులలో బస్ స్టాండ్ కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారా?

Chandrababu | పులివెందులలో బస్ స్టాండ్ కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారా?

HT Telugu Desk HT Telugu
May 19, 2022 03:34 PM IST

పులివెందులలో బస్ స్టాండ్ కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కర్నూలుకు హైకోర్టు తెచ్చేది జగన్ చేతిలో ఉందా అని అడిగారు. హైకోర్టు రేపు వస్తుంది.. ఎల్లుండి వస్తుందని ఎవరిని మోసం చేస్తున్నారని నిలదీశారు.

<p>కర్నూలులో చంద్రబాబు పర్యటన</p>
కర్నూలులో చంద్రబాబు పర్యటన

ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యకర్తల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ప్రసగించారు. 2 మంది ఎంపిలు ఉంటే ఎందుకు ప్రత్యేక హోదా తీసుకు రాలేకపోయారని ప్రశ్నించారు. ప్రతి దానికి టీడీపీనే కారణం అంటున్నారని.. వాళ్ల ఇంట్లో భార్యాభర్తల సంసారం చెయ్యకపోయినా నేనే కారణం అంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ తప్పులు దిద్దుకోకపోతే చరిత్ర హీనులుగా నిలిచిపోతారని చంద్రబాబు అన్నారు.

'కొందరు నేతలు నా చుట్టూ తిరిగితే ఉపయోగం లేదు.. ప్రజల చుట్టూ తిరగాలి. కొందరు వలస పక్షులు మనం అధికారంలోకి వస్తున్నాం అని మన వైపు వస్తారు. కష్టకాలంలో మనవైపు ఉన్న వాళ్లనే నేను గుర్తుంచుకుంటా.. వాళ్లకే న్యాయం చేస్తా. ఇకపై పార్టీలో గుర్తింపుకు ఎవరి రికమండేషన్ అవసరం లేదు.. మీరు చేసిన పనే మీరు గుర్తింపు ఇస్తుంది. చనిపోయిన కార్యకర్తలకు ఇన్ స్యూరెన్స్ ద్వారా 100 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసింది టీడీపీ.' అని చంద్రబాబు అన్నారు.

అనారోగ్యం పాలైన కార్యకర్తలకు తక్కువ ఖర్చుతో వైద్యం చేయించే ప్రయత్నం కూడా మొదలు పెట్టామని చంద్రబాబు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఒకరు బెంజ్ మంత్రి.. ఇంకొకరు అప్పుల, హరికథల మంత్రి అని విమర్శించారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు అవినీతిపై పోటీ పడుతున్నారు.. అందరి అవినీతి కక్కిద్దామని చంద్రబాబు హెచ్చరించారు. పేకాట, గనుల ద్వారా మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అప్పుల మంత్రి చెప్పులు అరిగేలా తిరిగినా రాష్ట్రానికి అప్పు ఇచ్చేవారు లేరని విమర్శించారు. ఒకప్పుడు అంతా ఏపీలో పెట్టుబడులు పెట్టారని.., ఇప్పుడు 8 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం