తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan Review : వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan Review : వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

HT Telugu Desk HT Telugu

13 September 2022, 17:04 IST

    •  AP Medical and Health Department : ప్రస్తుతం ఉన్న క్యాన్సర్ విభాగాలను పటిష్టం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి మెడికల్ కాలేజీలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ, అనంతపురం, కాకినాడ, గుంటూరు బోధనాసుపత్రుల్లో 4 లినాక్ మిషన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ (twitter)

ఏపీ సీఎం జగన్

వైద్య, ఆరోగ్య శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న క్యాన్సర్ విభాగాలను పటిష్టం చేయాలన్నారు. ప్రతి మెడికల్ కాలేజీలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ, అనంతపురం, కాకినాడ, గుంటూరు బోధనాసుపత్రుల్లో 4 లినాక్ మిషన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. మిగతా చోట్ల కూడా దశలవారీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలులో లైనర్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 7 మెడికల్ కాలేజీల్లో క్యాన్సర్ విభాగాలను ఆధునీకరించి బలోపేతం చేయాలని చెప్పారు. కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీల్లో కూడా అత్యాధునిక క్యాన్సర్ విభాగాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు

RTE Admissions: ఏపీలో 25125 మంది బాలలకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు

APPSC Marks: ఏపీపీఎస్సీ టౌన్‌ ప్లానింగ్, ఏఈఈ, పాలిటెక్నిక్ లెక్చరర్‌ పరీక్షల మార్కుల విడుదల

Dindi Resorts Package : కోనసీమ కేరళ దిండి అందాలు చూసొద్దామా?-ఏపీ టూరిజం ప్యాకేజీ వివరాలివే!

AP Power Cuts: మోదీ పర్యటన ఏర్పాట్లు, బెజవాడలో కరెంటు కోతలు….అల్లాడిపోయిన జనం, ముందస్తు సమాచారం ఇవ్వక ఇబ్బందులు

ఫ్యామిలీ డాక్టర్స్ కార్యక్రమంపై ముఖ్యమంత్రి సీఎం జగన్ సమీక్షించారు. ఏడాదిలోగా రక్తహీనత సమస్యను రూపుమాపేందుకు పిలుపునిచ్చిన కుటుంబ వైద్యుల కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాల్లో ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.

'విజయవాడ, అనంతపురం, కాకినాడ, గుంటూరు బోధనాసుపత్రుల్లో 4 లైనాక్‌ మెషీన్ల ఏర్పాటుకు చేయాలి. మిగిలిన చోట్ల కూడా దశలవారీగా ఏర్పాట్లు చేయాలి. ఏడు మెడికల్‌ కాలేజీల్లో క్యాన్సర్‌ విభాగాల ఆధునీకరణ, బలోపేతానికి చర్యలు తీసుకోవాలి. కొత్తగా నిర్మించనున్న మెడికల్‌ కాలేజీల్లోనూ అత్యాధునిక క్యాన్సర్‌ విభాగాల ఏర్పాటు చేయాలి. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం పర్యవేక్షణకు జిల్లాల్లో ప్రత్యేక అధికారిని నియమించాలి. ఏడాదిలోగా రక్తహీనత సమస్యను నివారించాలి.' అని సీఎం జగన్ అన్నారు.

ఈ సమావేశంలో ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజినీ, వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ (కోవిడ్ మేనేజ్‌మెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, ఆర్థిక కార్యదర్శి ఎన్ గుల్జార్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జీఎస్ నవీన్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.