Ovarian Cancer : అండాశయ క్యాన్సర్​ను త్వరగా గుర్తించకపోతే.. ప్రాణాలు హరి..-ovarian cancer symptoms and causes and treatment in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ovarian Cancer : అండాశయ క్యాన్సర్​ను త్వరగా గుర్తించకపోతే.. ప్రాణాలు హరి..

Ovarian Cancer : అండాశయ క్యాన్సర్​ను త్వరగా గుర్తించకపోతే.. ప్రాణాలు హరి..

Ovarian Cancer : అండాశయాలలో కణాల అవాంఛిత పెరుగుదలనే అండాశయ క్యాన్సర్ అంటారు. ఇవి శరీరంలోని ఆరోగ్యకరమైన కణజాలాలపై దాడి చేసి.. వాటిని నాశనం చేస్తాయి. ఈ క్యాన్సర్​తో ప్రపంచంలోని చాలా మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. మరణించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే రోగ నిర్ధారణ, చికిత్సల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అండాశయ క్యాన్సర్​

Ovarian Cancer : అండాశయ క్యాన్సర్​తో చాలా మంది మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను త్వరగా గుర్తించకపోవడం వల్ల, సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల మృత్యువాత పడుతున్నారు. సాధారణంగా అండాశయ క్యాన్సర్ స్ట్రోమల్ లేదా ఎపిథీలియల్ కణాల్లో వస్తుంది. స్ట్రోమల్ కణాలు అండాశయంలోని పదార్థాన్ని తయారు చేస్తాయి. ఎపిథీలియల్ కణాలు అండాశయం బయటిపొర. ఇవి అండాశయంలోని వివిధ భాగాలలోని కణాలపై దాడి చేస్తాయి. ఈ కణాలు గుడ్లుగా మారి క్యాన్సర్​కు దారితీస్తాయి. ఇంతటి ప్రమాదకరమైన అండాశయ క్యాన్సర్ కారణాలు, లక్షణాలు, నిర్ధారణ, చికిత్స గురించి తెలుసుకుందాం.

అండాశయ క్యాన్సర్ లక్షణాలు

అండాశయ క్యాన్సర్ లక్షణాలు క్యాన్సర్ మొదలైన ప్రారంభ నెలల్లో గుర్తించలేకపోవచ్చు. మాయో క్లినిక్ వైద్యుల ప్రకారం.. అండాశయ క్యాన్సర్ సంకేతాలు.. లక్షణాలు వీటిని కలిగి ఉండవచ్చని తెలిపారు. అవి ఏంటంటే..

* పొత్తికడుపు ఉబ్బరం లేదా వాపు

* తినేటప్పుడు కడుపు నిండిన అనుభూతి

* బరువు తగ్గడం

* కటి ప్రాంతంలో అసౌకర్యం

* అలసట

* వెన్నునొప్పి

* జీర్ణవ్యవస్థలో మార్పులు

* తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లడం

* సెక్స్ సమయంలో నొప్పి

* పీరియడ్స్‌లో మార్పులు

అండాశయ క్యాన్సర్ కారణాలు

క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ వైద్యుల ప్రకారం.. అండాశయ క్యాన్సర్‌కు కచ్చితమైన కారణాలు ఇప్పటికీ తెలియలేదు. కానీ వైద్యులు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కారకాలను కనుగొన్నారు. అవి ఏంటంటే..

* 40 నుంచి 63 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలు అండాశయ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

* ఊబకాయం ఉన్న స్త్రీలు కూడా ఎక్కువగా ఈ ప్రమాదంలో పడొచ్చు.

* 35 ఏళ్ల తర్వాత మొదటి గర్భం పొందిన మహిళలు అండాశయ క్యాన్సర్‌తో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

* హార్మోనల్ థెరపీ తీసుకునే స్త్రీలకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.

అండాశయాలలో లేదా సమీపంలోని కణాల DNA లో మార్పులు సంభవించినప్పుడు అండాశయ క్యాన్సర్ ప్రారంభమవుతుందని వైద్యులకు తెలుసు. ఈ మార్పుల కారణంగా కణాలు త్వరగా పెరుగుతాయి. క్యాన్సర్ కణాల ద్రవ్యరాశిని (కణితి) సృష్టిస్తాయి. ఆరోగ్యకరమైన కణాలు చనిపోయిన తర్వాత కూడా క్యాన్సర్ కణాలు జీవిస్తూనే ఉంటాయి. అవి సమీపంలోని కణజాలాలపై దాడి చేసి.. శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతాయి. అయితే ప్రారంభ కణితి నుంచి వాటిని విచ్ఛిన్నం చేయవచ్చు.

సంబంధిత కథనం