ఈ ఆహారాల విషయంలో జాగ్రత్త.. లేకపోతే బెస్ట్ క్యాన్సర్ ఖాయం! -breast cancer overview causes symptoms signs stages ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఈ ఆహారాల విషయంలో జాగ్రత్త.. లేకపోతే బెస్ట్ క్యాన్సర్ ఖాయం!

ఈ ఆహారాల విషయంలో జాగ్రత్త.. లేకపోతే బెస్ట్ క్యాన్సర్ ఖాయం!

HT Telugu Desk HT Telugu
Jul 25, 2022 05:28 PM IST

మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. DNA దెబ్బతినడం లేదా జన్యు పరివర్తన కారణంగా రొమ్ము క్యాన్సర్ వస్తుంది. ఇవి కాకుండా మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌కు అనేక కారణాలు ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు, వాటిలో ఒకటి ఆహారం.

బెస్ట్ క్యాన్సర్
బెస్ట్ క్యాన్సర్

స్కిన్ క్యాన్సర్ తర్వాత మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఫిబ్రవరి 2021లో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) రొమ్ము క్యాన్సర్.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను అధిగమించిందని.. ఇప్పుడు మహిళల్లో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా పరిగణించబడుతుంది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) విడుదల చేసిన డేటా ప్రకారం ఇండియాలో ప్రతి 4 నిమిషాలకు ఒక భారతీయ మహిళ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతుండగా, ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్‌తో మరణిస్తోంది. రొమ్ము క్యాన్సర్, వయస్సు, ఊబకాయం, జన్యు కారణంగా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో మహిళలు చాలా జాాగ్రత్తగా ఉండాలని జీవనశైలిలో పలు మార్పులు చేయడం ద్వారా దీనిని నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

న్యూట్రిషన్ 2022 లైవ్ ఆన్‌లైన్‌లో సమర్పించిన ఓ అధ్యయనంలో రోమ్ము క్యాన్సర్ సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడయ్యాయి. మొక్కల ఆధారిత ఆహారాలలో ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్ళు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చని పరిశోధకులు సూచించారు.

రొమ్ము క్యాన్సర్‌కు కారకాలు

WHO ప్రకారం, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కారకాలలో.. పెరుగుతున్న వయస్సు, ఊబకాయం, అధిక మద్యపానంతో కుటుంబ చరిత్ర, రేడియేషన్, పోస్ట్ మెనోపాజ్ శస్త్రచికిత్స, పొగాకు వినియోగం వంటివి ఉన్నాయి.

రొమ్ము క్యాన్సర్‌ను నివారించే మార్గాలు

గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ ప్రకారం, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. తల్లిపాలు, సాధారణ శారీరక శ్రమ, బరువును అదుపులో ఉంచుకోవడం, మద్యం సేవించకపోవడం, పొగాకు తాగకపోవడం, హార్మోన్ల వినియోగం తగ్గించడం , అధిక రేడియేషన్‌కు దూరంగా ఉండటం.

రొమ్ము క్యాన్సర్ లక్షణాలు

రొమ్ము నొప్పి, రొమ్ము చర్మంలో ఎరుపు లేదా మార్పు, రొమ్ము చుట్టూ వాపు, చనుమొన ఉత్సర్గ , చనుమొన నుండి రక్తస్రావం , రొమ్ము లేదా చనుమొన చర్మంపై పొట్టు, రొమ్ము పరిమాణంలో ఆకస్మిక మార్పు, మార్పు చనుమొన పరిమాణం, చనుమొన పరిమాణంలో మార్పు లేదా చేయి కింద వాపు వంటివి.

WhatsApp channel

సంబంధిత కథనం