AP CM in Vizag : పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌…. సీఎం జగన్-ap cm participates in ground breaking cermony in visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Cm Participates In Ground Breaking Cermony In Visakhapatnam

AP CM in Vizag : పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌…. సీఎం జగన్

HT Telugu Desk HT Telugu
Aug 16, 2022 01:20 PM IST

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అచ్యుతాపురం సెజ్‌ యోకోహమా టైర్ల కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పలు కంపెనీల విస్తరణ, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఏటీసీ టైర్ల కంపెనీ రెండో దశ నిర్మాణ పనుల్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. జపాన్‌కు చెందిన టైర్ల కంపెనీ సమీప భవిష్యత్తులో టాప్‌ 3 స్థానానికి చేరుకోవాలని అకాంక్ష వ్యక్తం చేశారు.

విశాఖ విమానాశ్రయంలో సిఎం జగన్మోహన్‌ రెడ్డి
విశాఖ విమానాశ్రయంలో సిఎం జగన్మోహన్‌ రెడ్డి

పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారికి ఆంధ్రా ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉందని సిఎం పిలుపునిచ్చారు . పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఏపీలో చట్టం చేశారని, పారిశ్రామిక వేత్తలు ఏపీకి సంతోషంగా రావడానికి స్థానిక ప్రజానీకం కూడా సహకరించాలని సిఎం జగన్ విజ్ఞప్తి చేశారు. చిన్నచిన్న సమస్యలు పెద్దవి చేయకుండా ప్రజలు పారిశ్రామికవేత్తలకు, అధికారులకు సహకరించాలని కోరారు. ఆంధ్రా ప్రజానీకం ఎలాంటి ఇబ్బందులు కలిగించరని పారిశ్రామిక వేత్తలకు వస్తే మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నారు.

ట్రెండింగ్ వార్తలు

2020 సెప్టెంబర్‌లో ఏపీలో పనులు ప్రారంభించిన యకోహమా సంస్థ 2021 ఫిబ్రవరిలో పనులు ప్రారంభించి 15నెలలో ప్రొడక్షన్ ప్రారంభించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో రెండో దశ శంకుస్థాపనకు కంపెనీ సిద్ధమైందని, 12నెలల్లో రెండో దశను కూడా పూర్తి చేసుకునేలా కార్యచరణ రూపొందించుకున్నారని చెప్పారు. మొదటి దశలో 1200మంది ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. మొత్తం 2200కోట్ల రుపాయల పెట్టుబడులతో 2200మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

రాష్ట్రంలో మూడేళ్లల రూ.39,350కోట్ల పెట్టుబడులతో 60,541 మంది ఉద్యోగాలు కల్పించేలా 98 భారీ పరిశ్రమలు వచ్చాయన్నారు . రానున్న సంవత్సరాల్లో రూ.1.54లక్షల కోట్ల పెట్టుబడులతో 1.64లక్షల మందికి భారీ పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ మూడేళ్లుగా అవార్డు తీసుకుంటుందని చెప్పారు. 31,671 ఎంఎస్‌ఎంఇ లలో 8285కోట్ల రుపాయల పెట్టుబడుతలతో 1,09,521 మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు.

మూడేళ్లుగా సర్టిఫికెషన్ ఇచ్చే తీరును కూడా మార్చారని, పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్ ఇస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లో కూడా ఏపీ వరుసగా మూడేళ్లుగా నంబర్ వన్ ర్యాంక్ సాధిస్తోందని చెప్పారు. పరిశ్రమల్ని ప్రోత్సహించేలా ముందుకు సాగుతున్నామన్నారు. పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సహకాలు ఏళ్లకేళ్లు పెండింగ్‌లో ఉండంటంతో లక్షకు పైగా ఎంఎస్‌ఎంఇలలో 10లక్షల మంది పని చేస్తున్నా ప్రభుత్వాలు వాటిని విస్మరించాయని చెప్పారు.

తాము అధికారంలోకి వచ్చాక ఎంఎస్‌ఎంఇలకు ఇవ్వాల్సిన అన్ని బకాయిలు సకాలంలో చెల్లిస్తున్నామని చెప్పారు. మూడేళ్లలో రూ.1480 కోట్లను ఎంఎస్‌ఎంఇ సెక్టార్‌కు చెల్లించినట్లు చెప్పారు. ఏపీలో 11.43 జిఎస్‌డిపి వృద్ధి రేటు సాధించిందని, దేశంలో 8.94శాతం మాత్రమే వృద్ధిని సాధించిందని చెప్పారు.

ఎగుమతుల విషయంలో కూడా పురోగతి సాధించమని ఆరు పోర్టులకు అదనంగా నాలుగు పోర్టులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కొత్త పోర్టులతో 9ఫిషింగ్ హార్బర్‌ నిర్మిస్తున్నట్లు చెప్పారు. సెంచురి ఫ్లైవుడ్‌ కడపలో కంపెనీ పెడుతోందని, గతంలో విని ఉండని సంస్థలు ఇప్పుడు ఏపీలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని చెప్పారు. ఆదిత్య బిర్లా సంస్థ కూడా ఏపీకి వచ్చిందన్నారు. అదానీ సంస్థ గతంలో ఏపీకి రాలేదని, జగన్ సిఎం అయ్యాకే అదానీ ఆంధ్రాలో అడుగులు ముందుకు వేశారని చెప్పారు. గతంలో మాదిరి కాకుండా పారిశ్రామికవేత్తలకు అనువైన వాతావరణాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. పరిశ్రమలు పెట్టే వారికి అన్ని రకాల అనుమతుల్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. త్వరలోనే అదానీ డేటా సెంటర్‌ విశాఖపట్నంలో ఏర్పాటవుతుందన్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి విశాఖపట్నం సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. అచ్యుతాపురం సెజ్‌లో పలు పరిశ్రమలకు భూమి పూజ నిర్వహించారు.

IPL_Entry_Point

టాపిక్