తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Irctc Announced Weekend Trip To Tirumala Darshan From Vizag Here Is Package Details

IRCTC Tirupati Tour : ఐఆర్‌సీటీసీ వీకెండ్ ట్రిప్ టూ తిరుమల దర్శనం

Anand Sai HT Telugu

11 October 2022, 22:13 IST

    • Visakhapatnam Tirumala Tour Package: విశాఖ నుంచి తిరుమల టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.
తిరుమల టూర్ ప్యాకేజీ
తిరుమల టూర్ ప్యాకేజీ

తిరుమల టూర్ ప్యాకేజీ

IRCTC Tourism Vizag To Tirumala Package : ఐఆర్‌సీటీసీ టూరిజం పలు ప్యాకేజీలను ప్రకటిస్తోంది. దర్శనీయ స్థలాలకు అందుబాటు ధరలో అందిస్తోంది. తాజాగా విశాఖ నుంచి తిరుమలకు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'WEEKEND TRIP TO TIRUMALA DARSHAN ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. అక్టోబర్ 21వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి శుక్రవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తారు. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Day 01: విశాఖ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు టూర్ ప్రారంభం అవుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.

Day 02: ఉదయం 04.5 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. హెటల్ కి చెకిన్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత కాణిపాకం, శ్రీపురం వెళ్తారు. సొంత ఖర్చులతో భోజనం చేయాల్సి ఉంటుంది. తిరిగి హోటల్ కి చేరుకున్న తర్వాత రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు.

Day 03: ఉదయం 6 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత ఉదయం 7 గంటలకు తిరుమల కొండకు చేరుకుంటారు. శ్రీవారి స్పెషల్ దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత... తిరుచానూరు, శ్రీకాళహస్తికి వెళ్తారు. రాత్రి 8 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరుతారు.

Day 04: ఉదయం 11.30 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

IRCTC Tour Prices : సింగిల్ షేరింగ్ కు రూ. 17,860 ధర ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 11,720 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.10,495 3AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ వెళ్లొచ్చు.