Tirumala Rush : శ్రీవారి దర్శనానికి రెండ్రోజుల సమయం… కిక్కిరిసిన తిరుమల-heavy rush in tirumala due to tamil peratasi month and 48 hours for darshan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Heavy Rush In Tirumala Due To Tamil Peratasi Month And 48 Hours For Darshan

Tirumala Rush : శ్రీవారి దర్శనానికి రెండ్రోజుల సమయం… కిక్కిరిసిన తిరుమల

HT Telugu Desk HT Telugu
Oct 08, 2022 11:42 AM IST

Tirumala Rush తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. తమిళనాట పెరటాసి మాసం మూడో శనివారం నేపథ్యంలో తమిళనాడు నుంచి భక్తులు వేలాదిగా తిరుమలకు తరలి వచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. గోగర్భం డ్యాం వరకు భక్తులు క్యూలైన్లలో స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దాదాపు 6 కిలోమీటర్ల పొడవుెన భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ పెరగడంతో వసతి గదులు సరిపోక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తిరుమలలో ఉన్న పార్కులు, ఫుట్‌పాత్‌లు, వసతి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లలో స్వామి వారి దర్శనానికి 48గంటల సమయం పడుతోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.

పెరటాసి మూడో శనివారం సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు.

ట్రెండింగ్ వార్తలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏడుకొండలు భక్తజన సంద్రంగా మారాయి. పెరటాసి మాసం మూడో శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వేలాదిగా భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. దీంతో 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయారు. 35వేల మంది భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు దాదాపు 48 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుమల వైకుంఠనాథుని దర్శనానికి వచ్చిన భక్తులకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి ఉద్యాన వనాల్లో నిర్మించిన షెడ్లు నిండిపోవడంతో బాహ్యవలయ రహదారిపై కిలోమీటర్ల మేర బారులు తీరారు.

క్యూలైన్లలోకి భక్తులను నిలిపివేసిన అధికారులు

నారాయణగిరి ఉద్యానవనాల నుంచి గోగర్భం జలాశయం వరకు దాదాపు ఆరు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న క్యూలైన్లలో దర్శనాలకు వెళ్తున్న భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. శిలాతోరణం కూడలి, బాటగంగమ్మ ఆలయం సమీపం, నారాయణగిరి ఉద్యానవనాల కూడలిలోని 3 ప్రాంతాల్లో మాత్రమే భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. నిదానంగా కదులుతున్న క్యూలైన్లతో ఆయా ప్రాంతాలకు చేరడానికి గంటల సమయం పడుతుండటంతో ఆహారం కోసం భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో శనివారం ఉదయం వరకు క్యూ లైన్లలోకి భక్తుల అనుమతి నిలిపివేసినట్టు తితిదే అధికారులు తెలిపారు.

శుక్రవారం రాత్రి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులను శనివారం ఉదయం 6గంటలకు రావాలని తిప్పి పంపుతున్నారు. భక్తులు తమ వంతు వచ్చే వరకు సంయమనంతో ఉండాలని అధికారులు కోరారు. అప్పటి వరకు తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయాల్లో విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులను విశ్రాంతి తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. క్యూలైన్లలో తొక్కిసలాట జరుగకుండా ఎక్కడికక్కడ భక్తులను నియంత్రిస్తున్నారు.

పెరటాసి మాసం మూడోె శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడంతో రద్దీ పెరిగిందని తితిదే ఈవో ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి గోగర్భం వద్ద అధికారులతో కలిసి క్యూలైన్లను ఈవో పరిశీలించారు. భక్తులతో మాట్లాడి తితిదే అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం క్యూలైన్‌లో ఉన్న భక్తులు శ్రీవారి దర్శనానికి రెండ్రోజుల సమయం పడుతుందని తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు రేపు ఉదయం క్యూలైన్లలోకి రావాలని సూచించారు.

తితిదే ఏర్పాటు చేసిన ఆవాస కేంద్రాల్లో భక్తులు విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఉచిత బస్సుల ద్వారా భక్తులను ఆవాస కేంద్రాలకు పంపిస్తున్నామన్నారు. తితిదేలో విభాగాలు, పోలీసుల సమన్వయంతో భక్తులకు మెరుగైన సేవ అందిస్తున్నామన్నారు. భక్తుల రద్దీ వల్ల కొద్దిగా అసౌకర్యం కలుగుతోందని, భక్తులు స్వామివారిని స్మరిస్తూ ముందుకు వెళ్లి దర్శనం చేసుకోవాలని కోరారు. భక్తులు తమ వంతు వచ్చే వరకు వేచి ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్