IRCTC kathmandu Tour: విశాఖ టు నేపాల్ టూర్... చూసే ప్రాంతాలు, ధరలివే-irctc tourism announced kathmandu tour package from visakhapatnam city ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Irctc Tourism Announced Kathmandu Tour Package From Visakhapatnam City

IRCTC kathmandu Tour: విశాఖ టు నేపాల్ టూర్... చూసే ప్రాంతాలు, ధరలివే

Mahendra Maheshwaram HT Telugu
Sep 24, 2022 02:24 PM IST

visakha kathmandu tour package: విశాఖ నుంచి ఖట్మాండ్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

విశాఖ ఖట్మాండ్ టూర్,
విశాఖ ఖట్మాండ్ టూర్, (irctctourism.com)

irctc tourism announced kathmandu tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా విశాఖ నుంచి నేపాల్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'CENIC BEAUTY OF NEPAL EX VISHAKHAPATNAM' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో ఖట్మాండ్,పొకారాతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.

visakha kathmandu tour: ఈ నెల నవంబర్ 24వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

Day 01: విశాఖ విమానాశ్రయం నుంచి ఉదయమే బయల్దేరుతారు. మధ్యాహ్నం వరకు ఖట్మాండ్ చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అవుతారు. రాత్రి ఖట్మాండ్ లోనే బస చేస్తారు.

Day 02: బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. బుద్ధనాథ్ స్తూపా, పఠాన్, దర్బార్ స్క్వేర్, టిబెటిన్ రెఫ్యూజ్ సెంటర్, స్వయంభూనాత్ స్తూపా సందర్శిస్తారు. రాత్రి ఖట్మాండ్ లోనే బస చేస్తారు.

Day 03: బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. పొకారాకు బయల్దేరుతారు. మార్గమధ్యలో Manakamana ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడ్నుంచి పొకారాకు చేరుకుంటారు. రాత్రి డిన్నర్ తర్వాత పొకారాలోనే బస చేస్తారు.

Day 04: ఉదయం సురంగ్ కోట్ నుంచి హిమాలయాల నుంచి వచ్చే సూర్యోదయాన్ని చూస్తారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత.... స్థానికంగా కొన్ని ప్రాంతాలను చూస్తారు. బింద్యాబాసిని మందిర్, డేవిల్స్ ఫాల్, గుప్తాశ్వేర్ మహాదేవ్ కేవ్ ను సందర్శిస్తారు. రాత్రి పొకారాలోనే బస చేస్తారు.

Day 05: బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఖట్మాండ్ కు వెళ్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

Day 06: బ్రేక్ ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం ఖట్మాండ్ కు చేరుకుంటారు. రాత్రి వరకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ధరలివే.....

visakha kathmandu tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 58,150 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 49,499 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.48,510గా ఉంది. కంఫార్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. షరతులు కూడా వర్తిస్తాయి.

<p>ధరల వివరాలు</p>
ధరల వివరాలు

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

IPL_Entry_Point