IRCTC Ganga Ramayan Yatra Details : హైదరాబాద్ టూ గంగా రామాయణ్ టూర్ ప్యాకేజీ వివరాలివే
Hyderabad To Ganga Ramayan Yatra : రామ భక్తులకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి గంగా రామాయణ్ యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ.. 5 రాత్రులు, 6 రోజులు ఉంటుంది.
హైదరాబాద్(Hyderabad) నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. AYODHYA, NAIMISHARANYA, PRAYAGRAJ, SARNATH, VARANASI, ప్రాంతాలు కవర్ అవుతాయి. గంగా రామాయణ్ యాత్ర (Ganga Ramayan Yatra)పేరిట ఈ ప్యాకేజీ ఉంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. విమానంలో పర్యాటకుల్ని తీసుకెళ్లి అయోధ్య, నైమీశరణ్య, ప్రయాగ్‌రాజ్, సార్‌నాథ్, వారణాసిలోని పుణ్యక్షేత్రాలను చూపిస్తారు. 17 నవంబర్ 22న ఈ టూర్ ప్యాకేజీ ఉంది.
Day 1
హైదరాబాద్ విమానాశ్రయం(Hyderabad Airport) నుండి ఉదయం 9:30 గంటలకు బయలుదేరుతారు. వారణాసి విమానాశ్రయానికి 11:25కు చేరుకుంటారు. హోటల్‌కు వెళ్తారు. హోటల్‌లో భోజనం తర్వాత కాశీ దేవాలయం మరియు గంగా ఘాట్(Ganga Ghat) సందర్శన ఉంటుంది. వారణాసి(Varanasi)లో రాత్రి బస చేస్తారు.(లంచ్ ప్లస్ డిన్నర్)
గమనిక : వారణాసి ఘాట్‌లు, ఆలయానికి బస్సులు అనుమతి లేదు. పర్యాటకులు ఆలయం, ఘాట్‌లను సందర్శించడానికి వారి స్వంత ఖర్చులతో ఆటో-రిక్షాలలో ప్రయాణించాలి.
Day 2 : సారనాథ్(SARNATH) సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం తిరిగి వారణాసికి చేరుకుంటారు. BHU ఆలయాన్ని సందర్శించాలి. ఘాట్‌లను సందర్శించడం లేదా సొంతంగా షాపింగ్ చేయోచ్చు. వారణాసిలో రాత్రి బస చేస్తారు. (అల్పాహారం ప్లస్ రాత్రి భోజనం)
Day 3 : హోటల్ నుంచి చెకౌట్ చేయాలి. ఆనంద్ భవన్, అలోపి దేవి ఆలయం, త్రివేణి సంగమం సందర్శించండి. సాయంత్రం అయోధ్య(Ayodhya)కు బయలుదేరుతారు. హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. రాత్రికి అయోధ్యలో బస చేస్తారు. (అల్పాహారం ప్లస్ రాత్రి భోజనం)
Day 4 : అయోధ్య ఆలయాన్ని సందర్శించండి. మధ్యాహ్నానికి హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి లక్నోకి బయలుదేరాలి. అక్కడ హోటల్‌లో దిగాలి. లక్నోలో రాత్రి బస చేస్తారు. (అల్పాహారం ప్లస్ రాత్రి భోజనం)
Day 5 : పూర్తి రోజు నైమిశరణ్యాన్ని దర్శించండి. సాయంత్రం తిరిగి లక్నో రావాలి. లక్నోలో రాత్రి బస చేస్తారు. (అల్పాహారం ప్లస్ రాత్రి భోజనం)
Day 6 : బారా ఇమాంబరా, అంబేద్కర్ మెమోరియల్ పార్క్‌ని సందర్శించాలి. సాయంత్రం 6 గంటలకు లక్నో విమానాశ్రయంలో డ్రాప్ చేస్తారు. 07:35కి ఫ్లైట్ ఉంటుంది. అక్కడ నుంచి రాత్రి 9:40 వరకు హైదరాబాద్ వస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్‌సీటీసీ గంగా రామాయణ్ యాత్ర టూర్ ప్యాకేజీ(IRCTC Ganga Ramayan Yatra) ధర చూసుకుంటే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.28,200గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.29,900 చెల్లించాలి. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.36,8500 ఉంటుంది. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, రెండు రాత్రులు వారణాసిలో, ఒక రాత్రి అయోధ్యలో, రెండు రాత్రులు లక్నోలో బస చేయాలి. బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్(Travel Insurance) ఇందులోకి వస్తాయి.