అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే!-braou distance degree admission 2022 in ambedkar open university hyderabad ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే!

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే!

HT Telugu Desk HT Telugu
Jul 01, 2022 06:08 PM IST

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్సిటీ) దూరవిద్య ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తులకు జూలై 31 చివరి తేదీ.

<p>Dr. B.R. Ambedkar Open University Admission 2022:</p>
<p>Dr. B.R. Ambedkar Open University Admission 2022:</p>

దూరవిద్య ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశానికి డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ ఎం.ఎస్సీ, ఎం.బీ.ఏ) కోర్సులు చేయలనుకునే వారు తాజాగా డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ నుండి విడుదలైన నోటిఫికేషన్ చూడవచ్చు. వీటితో పాటు B.Lisc, M.Lisc, PG డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి కూడా నోటిఫికేషన్ 2022-23 విడుదల చేసినట్లు యూనివర్సిటి అధికారులు తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సులు తదితర వివరాలను www.braouonline.in, www.braou.ac.in వెబ్‌సైట్‌ల పొందొచ్చని అధికారులు వెల్లడించారు.

దరఖాస్తు వివరాలు

దరఖాస్తుల స్వీకరణ జూన్ 30 నుండి ప్రారంభం కాగా.. జూలై 31వ తేదీతో ముగియనుంది. 2021-22 విద్యా సంవత్సరంలో మొదటీ ఏడాదిలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు రెండో సంవత్సర ట్యూషన్ ఫీజును, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా జూలై 31వ తేదీ లోపు ట్యూషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలని తెలిపారు. పూర్తి సమాచారం కొరకు, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు: 7382929570/580/590/600 లేదా 040-23680290/291/294/295 లో సంప్రదించొచ్చని అధికారులు సూచించారు.

పూర్తి వివరాలకు ఇక్కడ చూడండి.

దరఖాస్తు పద్ధతి : ఆన్‌లైన్

దరఖాస్తు రుసుము: క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్‌లలో చెల్లించవచ్చు.

దరఖాస్తు ప్రారంభ తేదీ : జూన్ 30,2022

దరఖాస్తు ముగింపు తేదీ : జూలై 31, 2022

సంబంధిత కథనం

టాపిక్