IRCTC Tour: తెలంగాణ, ఏపీ నుంచి వారణాసి టూర్… ధర 15 వేల లోపే, ప్యాకేజీ వివరాలివే-irctc tourism announced varanasi tour package from hyderabad and vijayawada know full details here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Announced Varanasi Tour Package From Hyderabad And Vijayawada Know Full Details Here

IRCTC Tour: తెలంగాణ, ఏపీ నుంచి వారణాసి టూర్… ధర 15 వేల లోపే, ప్యాకేజీ వివరాలివే

HT Telugu Desk HT Telugu
Jun 17, 2022 05:23 PM IST

హైదరాబాద్ నుంచి వారణాసి టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. విజయవాడ, విశాఖపట్నం నుంచి కూడా ప్రయాణికులు బుక్ చేసుకునే వీలు కల్పించింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

హైదరాబాద్ నుంచి వారణాసి టూర్
హైదరాబాద్ నుంచి వారణాసి టూర్ (irctc tourism)

IRCTC Swadesh Yatra: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా వారణాసికి వెళ్లే వారి కోసం సరికొత్త ప్లాన్ తో ముందుకొచ్చింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నుంచి వారణాసికి టూర్ ప్యాకేజీ ప్రకటించింది. స్వదేశ్ యాత్ర పేరుతో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

వివరాలివే....

5 రాత్రులు, 6 రోజుల టూర్ తో ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్ సీటీసీ టూరిజం . ఈ టూర్ ప్యాకేజీలో వారణాసి, ప్రయాగ్ సంగం, గయ కవర్ అవుతాయి. సెప్టెంబర్ 15న ఈ టూర్ ప్యాకేజీ మొదలుకానుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వాసులు వారణాసి టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.

టూర్ ఇలా ఉంటుంది…

మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభం అవుతుంది. తెల్లవారుజామున సికింద్రాబాద్‌లో రైలు బయల్దేరుతుంది. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌లో రైలు ఎక్కవచ్చు. రెండో రోజు వారణాసి చేరుకుంటారు. గంగా నదిలో స్నానాలు, సైట్‌సీయింగ్, కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత కాశీ విశ్వనాథ, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి, కాళ భైరవ ఆలయాల సందర్శన పూర్తి అవుతుంది. సాయంత్రం సంధ్యా హారతి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. రాత్రికి వారణాసిలోనే బస చేయాలి. 

మూడో రోజు ఉదయం వారణాసి నుంచి ప్రయాగ్‌రాజ్ బయల్దేరాల్సి ఉంటుంది. 4వ రోజు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటారు. త్రివేణి సంగంలో స్నానాలు, కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆనంద్ భవన్, హనుమాన్ మందిర్, అలోపి శక్తి పీఠ్ సందర్శన ఉంటుంది. ఈ టూర్ రామాయణానికి సంబంధించిన ప్రాంతాలను సందర్శించొచ్చు. ఆ తర్వాత గయ బయల్దేరాలి. 5. ఇక్కడ విష్ణుపాద ఆలయాన్ని సందర్శించాలి. పిండ ప్రదాన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత బోధగయకు బయల్దేరాలి. ఆ తర్వాత గయ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఆరో రోజు భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు పర్యాటకులు చేరకోవడంతో టూర్ ముగుస్తుంది.

<p>ప్యాకేజీ వివరాలు</p>
ప్యాకేజీ వివరాలు (IRCTC Tourism )

ధరలివే....

ఈ టూర్ స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.14,485 కాగా, కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.18,785గా నిర్ణయించారు. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ రైలు ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ రైలు ప్రయాణం ఉండనుంది. హోటల్‌లో వసతి, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయని పేర్కొంది.

నోట్:

ఈ టూర్ ను బుకింగ్ చేసుకునేందుకు ఈ లింక్ ద్వారా పూర్తి వివరాలను తెలుకోవచ్చు. టూర్ ను బుకింగ్ కూడా చేసుకునే వీలు ఉంటుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్