Best sedan car : హోండా అమెజాన్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​.. సరికొత్తగా సెడాన్​!-best selling sedan honda amaze facelift latest spy shot leaks its new design in real life ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Sedan Car : హోండా అమెజాన్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​.. సరికొత్తగా సెడాన్​!

Best sedan car : హోండా అమెజాన్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​.. సరికొత్తగా సెడాన్​!

Sharath Chitturi HT Telugu
Nov 30, 2024 12:27 PM IST

Best sedan car : హోండా అమేజ్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​కి సంబంధించిన స్పై షాట్స్​ అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో పలు కీలక వివరాలు బయటపడ్డాయి.

హోండా అమెజాన్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​ డేట్​ ఫిక్స్
హోండా అమెజాన్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​ డేట్​ ఫిక్స్

హోండా అమేజ్ 2024 సబ్ కాంపాక్ట్ సెడాన్ మరో వారం రోజుల్లో మార్కెట్లోకి రానుంది. జపనీస్ ఆటో దిగ్గజం ఇప్పుడు థర్డ్​ జనరేషన్​లో ఉన్న అమేజ్ ఫేస్​లిఫ్ట్​ని డిసెంబర్ 4న విడుదల చేయనుంది. రాబోయే సెడాన్​కి సంబంధించిన అనేక వివరాలను సంస్థ టీజర్​ రూపంలో రిలీజ్​ చేస్తూ వచ్చింది. అయితే, హోండా అమేజ్ తాజా స్పై షాట్లు లీక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ కారు విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

హోండా అమేజ్ ఫేస్​లిఫ్ట్​ లేటెస్ట్ స్పై షాట్స్​..

అమేజ్ 2024 ఫ్రంట్ ఫేస్​ని లేటెస్ట్ స్పై షాట్స్​ పూర్తిగా రివీల్​ చేశాయి. కొత్త గ్రిల్ కనిపించింది. ఇది ప్రస్తుత మోడల్​లో ఉన్న క్రోమ్​లో ఎక్కువ భాగాన్ని కోల్పోయింది. దీనికి బదులుగా, సెడాన్ ఇప్పుడు బానెట్​పై స్లిమ్ క్రోమ్ బార్​తో వస్తోంది. ఎల్​ఈడీ హెడ్​లైట్, డీఆర్ఎల్ యూనిట్లు గత సంవత్సరం లాంచ్ చేసిన హోండా సిటీ ఫేస్​లిఫ్ట్​లో ప్రవేశపెట్టిన వాటిని పోలి ఉంటాయి! మొత్తం మీద, ఫ్రంట్ ఫేస్ ఇప్పుడు హోండా ఏడాది క్రితం ప్రవేశపెట్టిన ఎలివేట్ ఎస్​యూవీని పోలి ఉంటుంది.

కొత్త అమేజ్​లో బ్రేక్ లైట్లు ఇప్పుడు నిలువుగా ఉన్నాయి. బంపర్​ని కూడా మార్చింది సంస్థ. ఇందులో 4 సెన్సార్లు వస్తున్నాయి. ఇక బూట్​ లిడ్​ కింది రేర్​ వ్యూ కెమెరా వస్తోంది. సైడ్స్​ని చూస్తే మాత్రం పెద్దగా మార్పులు కనిపించవు.

హోండా అమేజ్: కొత్త ఇంటీరియర్- ఫీచర్లు..

అమేజ్ 2024 ఇంటీరియర్.. ఎలివేట్ లోపల మాదిరిగానే కొత్త డ్యాష్​బోర్డ్, కొత్త ఫ్లోటింగ్ టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ స్క్రీన్, డ్యూయెల్-టోన్ బ్లాక్, బీజ్ ఇంటీరియర్ థీమ్, రేర్ ఏసీ వెంట్స్, మరెన్నో ప్రధాన అప్డేట్స్​ని పొందింది. ఈ సెడాన్​లో చిన్న ఎలక్ట్రిక్ సన్​రూఫ్, ఏడీఏఎస్ టెక్నాలజీ కూడా లభిస్తుందని భావిస్తున్నారు. ఇది ఈ విభాగంలో మొదటిది!

హోండా కొత్త అమేజ్​లో హుడ్ కింద మార్పులు చేసే అవకాశం లేదు. ప్రస్తుత వెర్షన్​కు పవర్​ని ఇచ్చే అదే 1.2-లీటర్, నాలుగు సిలిండర్ల, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్​పై ఆధారపడుతుంది. ఇది 89 బీహెచ్​పీ పవర్, 110 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేయగలదు. 5-స్పీడ్ మేన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది.

హోండా అమేజ్​ ప్రస్తుత వెర్షన్ 2018లో లాంచ్ అయ్యి, ఇప్పుడు అఫ్డేట్​ పొందుతోంది. హోండా అమేజ్ భారతదేశంలో జపనీస్ కార్ల తయారీదారు నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటి! ఇది మారుతీ సుజుకీ డిజైర్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి ఇతర సబ్-కాంపాక్ట్ సెడాన్లతో పోటీపడుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం