Winter Intimate Health: చలికాలంలో శృంగారంలో ఎక్కువగా పాల్గొంటే జలుబు, జ్వరం వస్తాయా? నిజం ఇదే-does having romance and intercourse cause cold related issues in winter find truth here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Winter Intimate Health: చలికాలంలో శృంగారంలో ఎక్కువగా పాల్గొంటే జలుబు, జ్వరం వస్తాయా? నిజం ఇదే

Winter Intimate Health: చలికాలంలో శృంగారంలో ఎక్కువగా పాల్గొంటే జలుబు, జ్వరం వస్తాయా? నిజం ఇదే

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 30, 2024 12:30 PM IST

Winter Intimate Health: చలికాలంలో శృంగారం గురించి చాలా మందిలో అనుమానాలు ఉంటాయి. ఈ కాలంలో ఎక్కువగా లైంగిక చర్యలో పాల్గొంటే జలుబు సంబంధిత జబ్బులు వస్తాయనే అపోహ ఉంటుంది. ఈ విషయంలో నిజమేంటంటే..

Winter Intimate Health: చలికాలంలో శృంగారంలో ఎక్కువగా పాల్గొంటే జలుబు, జ్వరం వస్తాయా? నిజం ఇదే
Winter Intimate Health: చలికాలంలో శృంగారంలో ఎక్కువగా పాల్గొంటే జలుబు, జ్వరం వస్తాయా? నిజం ఇదే

చలికాలంలో శృంగార వాంఛ ఎక్కువగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండటంతో కోరికలు అధికంగా వస్తుంటాయి. దీంతో చాలా మంది భాగస్వాములు ఈ కాలంలో ఎక్కువగా శృంగారంలో పాల్గొంటుంటారు. సాధారణంగా కంటే ఎక్కువగా లైంగిక చర్యలో లీనమవుతారు. ఈ క్రమంలోనే చలికాలంలో శృంగారం చేయడం విషయంలో కొన్ని అపోహలు కూడా వినిపిస్తుంటాయి. ఈ కాలంలో ఎక్కువగా శృంగారంలో పాల్గొంటే జలుబు, జ్వరంగా లాంటి ఆరోగ్య సమస్యలు వస్తానే అపోహ ఉంటుంది. ఈ విషయంలో నిజమేంటో ఇక్కడ చూడండి.

వాస్తవం ఇదే

చలికాలంలో శృంగారంలో పాల్గొన్న కారణంగా జలుబు, జ్వరం లాంటి వ్యాధులు రావు. లైంగిక చర్యలో పాల్గొనడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. దీని కారణంగా అనారోగ్యానికి గురవ్వరు. అయితే, శృంగారం చేసే సమయంలో సాధారణ శుభ్రత పాటిస్తే సరిపోతుంది. అందుకే ఎలాంటి చింత లేకుండా శీతాకాలంలో శృంగారాన్ని ఎంజాయ్ చేయవచ్చు.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

శృంగారం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. దీనివల్ల శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. శృంగారం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీంతో అవయవాల పని తీరు మెరుగ్గా ఉంటుంది.

చలికాలంలో శృంగారం వల్ల ప్రయోజనాలు

శరీరానికి వెచ్చదనం: చలికాలంలో శృంగారం వల్ల శరీరానికి వెచ్చదనం మెండుగా అందుతుంది. మంచి అనుభూతి కలుగుతుంది. బెడ్‍పై ఎక్కువసేపు గడిపే అవకాశం ఉంటుంది. దీనివల్ల జీవిత భాగస్వాముల మధ్య బంధం మరింత బలపడుతుంది.

ఒత్తిడి తగ్గుతుంది: చల్లటి వాతావరణం వల్ల శీతాకాలంలో శరీరం బద్ధకంగా అనిపిస్తుంది. మానసికంగానూ ఒత్తిడి అనిపిస్తుంది. అయితే, శృంగారం చేయడం వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్లు అయిన ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. దీనివల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది.

రక్తప్రసరణ: శృంగారం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీనివల్ల బాడీ చురుగ్గా ఉంటుంది. చాలా అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.

నిద్ర బాగా పడుతుంది: శృంగారం చేయడం వల్ల నిద్ర గాఢంగా పడుతుంది. నిద్ర నాణ్యత పెరుగుతుంది. మెదడు.. సెరటోనిన్, ఓపియోయిడ్‍లను విడుదల చేస్తుంది. దీంతో హాయిగా అనిపించి మెరుగ్గా నిద్రించేందుకు అవకాశం ఉంటుంది. నిద్రలేమి సమస్య ఉంటే తగ్గేందుకు తోడ్పడుతుంది.

Whats_app_banner