OTT Release: ఓటీటీలోకి ఒక్కరోజే 26 సినిమాలు- 10 చాలా స్పెషల్, 4 తెలుగులో- తమన్నా యాక్షన్ థ్రిల్లర్ టు తమిళ బోల్డ్ మూవీ!
OTT Release Movies Telugu: ఓటీటీలోకి నిన్న ఒక్కరోజు నుంచే 26 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో పది చాలా స్పెషల్‌గా ఉంటే, అందులో కేవలం నాలుగు మాత్రమే తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవన్నీ సస్పెన్స్, యాక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్‌గా ఉన్నాయి.
OTT Movies In Telugu: ఓటీటీలోకి నిన్న అంటే శుక్రవారం (నవంబర్ 29) ఒక్కరోజే 26 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అందులో బోల్డ్, ఫాంటసీ యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాలతోపాటు సస్పెన్స్ థ్రిల్లర్, యాక్షన్ వెబ్ సిరీస్‌లు ఎంతో స్పెషల్‌గా ఉన్నాయి. మరి అవేంటీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.
ఆహా ఓటీటీ
నారదన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సినిమా)- నవంబర్ 29
ష్! (తమిళ బోల్డ్ అంథాలజీ చిత్రం)- నవంబర్ 29
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
సికందర్ కా ముకద్దర్ (తెలుగు డబ్బింగ్ తమన్నా హిందీ చిత్రం)- నవంబర్ 29
లవ్ నెవర్ లైస్: సౌతాఫ్రికా (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 29
పారిస్ క్రిస్మస్ వాల్ట్జ్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 29
సెన్నా (తెలుగు డబ్బింగ్ పోర్చుగీస్ వెబ్ సిరీస్)- నవంబర్ 29
ది స్నో సిస్టర్ (నార్వేజియన్ సినిమా)- నవంబర్ 29
ది ట్రంక్ (కొరియన్ వెబ్ సిరీస్)- నవంబర్ 29
ది లేటర్స్ డేటర్స్ (రియాలిటీ షో)- నవంబర్ 29
జీ5 ఓటీటీ
బ్రదర్ ( ప్రియాంక అరుల్ మోహన్ తమిళ చిత్రం)- నవంబర్ 29
డివోర్స్ కే లియే కుచ్ బీ కరేగా (హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 29
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
బ్లడీ బెగ్గర్ (తమిళ సినిమా)- నవంబర్ 29
పొరట్టు నడకమ్ (మలయాళ చిత్రం)- నవంబర్ 29
హార్ట్ బీట్స్ సీజన్ 1 (హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 29
హార్డ్ నార్త్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 29
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
పారాచూట్ (తెలుగు డబ్బింగ్ తమిళ వెబ్ సిరీస్)- నవంబర్ 29
బీటల్స్64 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- నవంబర్ 29
బుక్ మై షో ఓటీటీ
ది వైల్డ్ రోబో (ఇంగ్లీష్ యానిమేటెడ్ సినిమా)- నవంబర్ 29
వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 29
జస్ట్ వన్ స్మాల్ ఫేవర్ (స్పానిష్ చిత్రం)- నవంబర్ 29
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
బాయ్ కిల్స్ వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 29
బ్లూ ఇగౌన (ఇంగ్లీష్ యాక్షన్ చిత్రం)- నవంబర్ 29
ది వారియర్స్ గేట్ (ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 29
హాస్టైల్స్ (హాలీవుడ్ అడ్వెంచర్ యాక్షన్ మూవీ)- నవంబర్ 29
కృష్ణం ప్రణయ సఖి (కన్నడ చిత్రం)- సన్ నెక్ట్స్ ఓటీటీ- నవంబర్ 29
హర్ (మలయాళ సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- నవంబర్ 29
ఓటీటీలోకి 26
ఇలా ఈ శుక్రవారం (నవంబర్ 29) 26 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో, తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోన్న తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ పారాచూట్, ఇంగ్లీష్ బయోగ్రఫీకల్ వెబ్ సిరీస్ సెన్నా, తమన్నా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సికందర్ కా ముకద్దర్, మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ నారదన్ చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్
ఫ్రైడే ఓటీటీ రిలీజ్ అయిన 26లో రెండు వెబ్ సిరీస్‌లు, 8 సినిమాలతో మొత్తం 10 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో నాలుగు మాత్రమే తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతూ అందుబాటులో ఉన్నాయి.