చిన్నారుల్లో మయోపియా అంటే దూరపు చూపు స్పష్టంగా లేకపోవడం అనే సమస్య తీవ్రమవుతోంది
Pixabay
By HT Telugu Desk Nov 30, 2024
Hindustan Times Telugu
రిమోట్ లెర్నింగ్, వినోదం కోసం పిల్లలు స్క్రీన్లపై ఎక్కువ గంటలు గడుపుతున్నారు. ఇది చిన్నారుల చూపుపై ప్రభావం చూపుతోంది
తల్లిదండ్రులు పిల్లల్లో కంటి చూపు సమస్యను గుర్తించడంలో ఆలస్యం చేయవద్దు. వైద్యుడిని సంప్రదిస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చు
సమస్య ఉందని గ్రహించకుండా పిల్లలు వారి బలహీనమైన దృష్టికి అనుగుణంగా అడ్జస్ట్ అవుతారు. అందుకే తరచుగా కంటి వైద్యుడిని సంప్రదించడం మంచిది
ఎక్కువ సమయం ఆరుబయట గడిపే పిల్లలకు మయోపియా వచ్చే అవకాశం తక్కువని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. సహజ కాంతి ఇందుకు కారణం.
ఆరుబయట ఆటలాడడం వల్ల పిల్లల స్క్రీన్ సమయం కూడా తగ్గుతుంది. తద్వారా కంటి చూపుకు హాని తగ్గుతుంది
ప్రతి 20 నిమిషాలకు, పిల్లలు కనీసం 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఏదో ఒకదాన్ని చూడాలి. ఈ అభ్యాసం కంటి కండరాలను సడలించడానికి, ఒత్తిడి తగ్గించడానికి సహాయపడుతుంది
లాప్‌టాప్, టాబ్లెట్లలో బ్లూ లైట్ ఫిల్టర్లను ఉపయోగించడం ద్వారా స్క్రీన్ ఎక్స్‌పోజర్ కొంత తగ్గించవచ్చు
ఆకుకూరలు, క్యారెట్లు, సిట్రస్ పండ్లు వంటి కంటికి ఉపయోగపడే ఆహారాన్ని రోజువారీ భోజనంలో చేర్చడం మంచిది
చలికాలంలో దాల్చిన చెక్కతో లాభాలు ఇవే.. తప్పక తీసుకోండి!