Ram Mandir: వచ్చే ఏడాది డిసెంబర్ లో అయోధ్య రామయ్య దర్శనం-ayodhya ram temple to open for darshan by december next year ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ayodhya Ram Temple To Open For Darshan By December Next Year

Ram Mandir: వచ్చే ఏడాది డిసెంబర్ లో అయోధ్య రామయ్య దర్శనం

Mahendra Maheshwaram HT Telugu
Aug 14, 2022 11:31 AM IST

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర నిర్మాణ పనులు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కానున్నాయి. ప్రధాన సముదాయాన్ని నిర్మించిన తర్వాత ఆలయ సందర్శనకు

వచ్చే ఏడాది అయోధ్య రామమందిర దర్శనం
వచ్చే ఏడాది అయోధ్య రామమందిర దర్శనం (livemint)

Ayodhya Ram Temple open in next year: యూపీలో నిర్మిస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో పనులు పూర్తి కానున్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్… వార్త ఏజెన్సీ పీటీఐతో వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

శుక్రవారం రక్షాబంధన్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... 'సుల్తాన్ పూర్ ప్రజలకు ఆహ్వానం తెలుపుతున్నాను. వచ్చే ఏడాది డిసెంబర్ లో శ్రీరాముడిని దర్శించుకోండి. అయోధ్యకు సుల్తాన్ పూర్ చాలా దగ్గరకు ఉంటుంది' అని చెప్పారు.

అయోధ్య రామమందిర నిర్మాణం గురించి యావ‌త్ హిందూ స‌మాజం చాలా ఆసక్తిగా చూస్తుందని తెలిపారు. ఈ అద్భుత నిర్మాణంలో ఇనుమును వాడటం లేదని గుర్తు చేశారు. 2.7 ఎకరాల్లో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. 161 ఎత్తులో.. మూడు అంతస్తులతో నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆల‌య నిర్మాణంలో రాయి, రాయికి మధ్య రాగి పలకలను ఏర్పాటు చేస్తున్న‌మ‌నీ, అలాగే కాంక్రీటు పైన రాళ్లు వేస్తున్న‌మ‌ని తెలిపారు. ఆలయంలో అనేక ర‌కాల‌ డిజైన్‌లతో నిర్మిస్తున్నార‌నీ, అందులోని క‌ళ‌రూపాల‌ను భక్తులు చూస్తూనే ఉంటారంటే అతిశయోక్తి కాదని రాయ్ అన్నారు.

ఆగస్టు 5, 2020న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో వివాదాల అనంత‌రం… 2019లో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీంతో ఆలయ నిర్మాణానికి అడుగు పడింది. వివాదాస్పద భూమిని ప్రభుత్వం ఏర్పాటు చేసే ట్రస్ట్‌కు అప్పగించింది.

IPL_Entry_Point

టాపిక్