తెలుగు న్యూస్ / ఫోటో /
Arunachalam Giri Pradakshina : అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎప్పుడు, ఎలా చేయాలి? 6 ముఖ్యమైన అంశాలు
- Arunachalam Giri Pradakshina : శివ పురాణం ప్రకారం మోక్షాన్ని పొందడానికి 4 అత్యంత పవిత్రమైన స్థలాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి అరుణాచలేశ్వర దేవాలయం. ఈ ఆలయం గురించి ఒక్కసారి తలచుకుంటేనే పునర్జన్మల చక్రం నుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆధ్యాత్మిక క్షేత్ర పవిత్రత అలాంటిది.
- Arunachalam Giri Pradakshina : శివ పురాణం ప్రకారం మోక్షాన్ని పొందడానికి 4 అత్యంత పవిత్రమైన స్థలాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి అరుణాచలేశ్వర దేవాలయం. ఈ ఆలయం గురించి ఒక్కసారి తలచుకుంటేనే పునర్జన్మల చక్రం నుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆధ్యాత్మిక క్షేత్ర పవిత్రత అలాంటిది.
(1 / 6)
అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇది పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ. అరుణాచలం అర్థం ఎర్రని కొండ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. కేవలం స్మరణ చేస్తేనే ముక్తి లభిస్తుంది. అందుకే జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్లాలని పెద్దలు చెబుతుంటారు.
(2 / 6)
అరుణాచలం చేరుకోవడానికి చెన్నై నుంచి 185 కిలోమిటర్లు ప్రయాణించాలి. చెన్నై నుంచి బస్సు, ట్రైన్ సౌకర్యం ఉంది. చెన్నైలోని కోయంబేడు బస్టాండ్ నుంచి అరుణాచలం చేరుకోవడానిక 5 గంటల సమయం పడుతుంది.
(3 / 6)
అరుణాచలం పవిత్ర పుణ్యక్షేత్రానికి ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి. ఇక్కడ పగలు, రాత్రి, ఎండ, వాన, చలి.. ఇలా ఏ సమయంలో అయినా ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే.. ఆ పరమ శివుడి చుట్టూ చేసినట్టేనని భక్తుల విశ్వాసం.
(4 / 6)
శివ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే నిత్యం ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ కనిపిస్తారు. గిరిపైన ఉన్న మహౌషధీ ప్రభావం వల్ల శరీరానికి, శివ స్మరణవల్ల మనస్సుకూ, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుందని భక్తుల నమ్మకం.
(5 / 6)
గిరి ప్రదక్షిణ చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరిప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట వేశారు. ఎండ సమయంలో ప్రదక్షిణ చేయడం కష్టం. అందుకే ఎక్కువ మంది తెల్లవారుజామున, రాత్రి చేస్తారు. గిరి ప్రదక్షిణలో రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్లిన తరువాత కుడివైపునకు తిరిగితే వినాయకుడి గుడి వస్తుంది. అక్కడినుంచి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది.
ఇతర గ్యాలరీలు