IRCTC Hyd UP Tour: వారణాసి, ప్రయాగ్ రాజ్ చూడాలని ఉందా..?మీ కోసమే ఈ టూర్ ప్యాకేజీ
hyderabad uttar pradesh tour package: హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
irctc tourism announced uttar pradesh tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'JAI KASHI VISWANATH GANGE' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో ప్రయాగ్ రాజ్, సార్ నాథ్, వారణాసి వంటి ప్రాంతాలను సందర్శిస్తారు.
hyderabad up tour: ఈ నెల సెప్టెంబర్ 11వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి ఆదివారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
Day 1 Sunday: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 9.25 గంటలకు బయల్దేరుతారు. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
Day 2 Monday: మధ్యాహ్నం 1.30 గంటల వలకు వారణాసి స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ లో చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం గంగా హారతి ఉంటుంది. రాత్రికి వారణాసిలోనే ఉంటారు.
Day 3 Tuesday: మూడో రోజు వారణాసిలో కాశీ విశ్వనాథ్ మందిర్, కాల్ భైరవ మందిర్, బీహెచ్ యూ మందిర్ లను సందర్శిస్తారు. షాపింగ్ చేసుకునే సమయం కూడా ఉంటుంది. రాత్రి వారణాసిలోనే బస చేస్తారు.
Day 4 Wednesday: హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత సార్ నాథ్ వెళ్తారు. అక్కడ్నుంచి ప్రయాగ్ రాజ్ కు బయల్దేరుతారు. మార్గమధ్యంలో వింద్యాచల్ ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి వరకు ప్రయాగరాజ్ కు చేరుకుంటారు. అక్కడే బస చేస్తారు.
Day 5 Thursday: ఉదయం త్రివేణి సంగమానికి వెళ్తారు. అనంతరం హోటల్ కి వెళ్లి... మధ్యాహ్నం నుంచి చెక్ అవుట్ అవుతారు. అనంతరం ఆనంద్ భవన్, కుస్రో బాగ్ కు వెళ్తారు. సాయంత్రం వరకు ప్రయాగ్ రాజ్ రైల్వే జంక్షన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి తిరిగి హైదరాబాద్ బయల్దేరుతారు. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
Day 6 Friday: రాత్రి 09.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.
ధరలివే.....
hyd uttar pradesh tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 28,030 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 17,080 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.13,800 గా ఉంది. 3AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.
NOTE:
ఈ లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.