IRCTC Kerala Tour Package : కేరళ చూడాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ-irctc kerala hills and waters tour package from hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Kerala Hills And Waters Tour Package From Hyderabad

IRCTC Kerala Tour Package : కేరళ చూడాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

Anand Sai HT Telugu
Sep 06, 2022 05:38 PM IST

IRCTC Tour Packages : కేరళ అందాలను చూడాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ మంచి ప్యాకేజీ ప్రకటించింది. కేరళ హీల్స్ అండ్ వాటర్స్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

Hyderabad To Kerala : కేరళను చూడాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. కేరళలోని అందాలను చూసి.. తెగ ఎంజాయ్ చేయోచ్చు. హైదరాబాద్ టూ కేరళ వరకూ ఈ ప్యాకేజీ ఉంది. మున్నార్, అలెప్పీలాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. రైలులో తీసుకెళ్లి తీసుకొస్తారు. ఫుడ్, హోటల్, ట్రావెల్స్ ఇన్సూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో ఉంటాయి. 5 రాత్రులు, 6 రోజులు ఈ టూర్ ఉంటుంది. సెప్టెంబర్ 13, 2022న ప్యాకేజీ అందుబాటులో ఉంది.

Day 01 : శబరి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 12:20 గంటలకు బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.

Day 2 : 12:55 గంటలకు ఎర్నాకులం టౌన్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. మున్నార్‌కు వెళ్లి.. హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. మున్నార్ టౌన్‌లో సాయంత్రం విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి బస చేస్తారు.

Day 3 : ఉదయం ఎరవికులం నేషనల్ పార్క్ సందర్శన ఉంటుంది. తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్ అండ్ ఎకో-పాయింట్ సందర్శిస్తారు. మున్నార్‌లో రాత్రి బస చేస్తారు.

Day 4 : హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అలెప్పీకి బయలుదేరుతారు. అలెప్పీలో హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. బ్యాక్‌వాటర్‌ అందాలను సాయంత్ర వరకూ ఎంజాయ్ చేయోచ్చు. రాత్రిపూట అలెప్పీలో బస చేస్తారు.

Day 5 : హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. ఎర్నాకులానికి బయలుదేరాలి శబరి ఎక్స్‌ప్రెస్ 11:20 గంటలకు రైల్వే స్టేషన్‌లో ఉంటుంది.

Day 6 : 12:20 గంటలకు రైలు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

సింగిల్ ఆక్యూపెన్సీ ధర రూ. 29830గా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీకి రూ.17240 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.14300గా ఉంది. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ ఉంటాయి. స్టాండర్డ్ క్లాసులో ధరలు వేరేలే ఉన్నాయి. వివరాలు ఇక్కడ చూడండి.

<p>కేరళ టూర్ ప్యాకేజీ</p>
కేరళ టూర్ ప్యాకేజీ
IPL_Entry_Point