IRCTC Tirupati Tour Package : ఐఆర్‌సీటీసీ తిరుపతి బాలాజీ దర్శనం టూర్ ప్యాకేజీ చూశారా?-irctc announced tirupati balaji darshanam tour package from visakhapatnam know in details
Telugu News  /  Andhra Pradesh  /  Irctc Announced Tirupati Balaji Darshanam Tour Package From Visakhapatnam Know In Details
తిరుమల టూర్ ప్యాకేజీ
తిరుమల టూర్ ప్యాకేజీ (Twitter)

IRCTC Tirupati Tour Package : ఐఆర్‌సీటీసీ తిరుపతి బాలాజీ దర్శనం టూర్ ప్యాకేజీ చూశారా?

31 August 2022, 22:04 ISTAnand Sai
31 August 2022, 22:04 IST

IRCTC Tirupati Tour Package Details : శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏడుకొండలవాడి దర్శన భాగ్యం కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. స్వామి వారిని చూసి.. తరించిపోతుంటారు. వారికోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. తిరుపతి బాలాజీ దర్శనం పేరుతో టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. విశాఖపట్నం నుంచి టూర్ ప్రారంభమవుతోంది.

తిరుపతి బాలాజీ దర్శనం టూర్ ప్యాకేజీ.. సెప్టెంబరు, అక్టోబర్ నెలలో ఐఆర్‌సీటీసీ అందిస్తోంది. వెళ్లాలనుకునే భక్తులు వెంటనే బుక్ చేసుకోవాలి. 09.09.2022, 07.10.2022, 21.10.2022, 25.11.2022 , 18.12.2022 తేదీల్లో అందుబాటులో ఉన్నాయి. ఇది రెండు రాత్రులు, మూడు రోజుల టూర్ ప్యాకేజీ. తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుచానూర్, తిరుపతి కవర్ అవుతాయి.

Day 1

విశాఖపట్నం విమానాశ్రయంలో 06:25 గంటలకు విమానం ఎక్కాలి. 08:25 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుండి పికప్ చేసుకుంటారు. హోటల్ లో చెక్-ఇన్ కావాలి. అల్పాహారం నుంచి భోజనం వరకు విశ్రాంతి తీసుకోవాలి. భోజనానంతరం ఆలయాల సందర్శన ఉంటుంది. కాణిపాకం, శీనివాసమంగాపురం వెళ్లాలి. సాయంత్రం తిరిగి హోటల్‌కి రావాలి. డిన్నర్ చేసి రాత్రి బస చేయాలి.

Day 2

రెండో రోజు ఉదయం హోటల్‌లో అల్పాహారం ముగించుకోవాలి. ఆ తర్వాత శ్రీ బాలాజీ దర్శనం కోసం వెళ్లాలి. లంచ్ ఉంటుంది. అనంతరం శ్రీకాళహస్తి , తిరుచానూరు సందర్శన చేయిస్తారు. సాయంత్రం తిరిగి హోటల్‌కి రావాలి. డిన్నర్ చేశాక రెండో రోజు కూడా హోటల్ లోనే బస ఉంటుంది.

Day 3

తెల్లవారుజామున 05:00 గంటలకు హోటల్ నుండి చెక్ అవుట్ చేయాలి. 08:45 గంటలకు విశాఖపట్నం వెళ్లడానికి విమానం ఉంటుంది. 10:25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు.

ఐఆర్‌సీటీసీ టూరిజం తిరుపతి బాలాజీ దర్శనం టూర్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.14920గా నిర్ణయించింది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.15110, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.18485 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, తిరుపతిలో బస, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, గైడ్ సర్వీస్ కవర్ అవుతాయి.

ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్, విజయవాడ నుంచి తిరుపతికి వేర్వేరు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. ట్రైన్ టూర్ ప్యాకేజీలతో పాటు ఫ్లైట్ టూర్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఒక రాత్రి, రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఉంది. సెప్టెంబర్ 1, 2, 8, 9, 15, 16, 22 తేదీల్లో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లండి.

సంబంధిత కథనం